IT investment
-
త్వరలో నూతన పారిశ్రామిక విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా త్వరలో నూతన పారిశ్రామిక విధానం తీసుకురానున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక పాలసీలు వచ్చే ఏడాదితో ముగియనుండడంతో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. గతంలో ప్రకటించిన రాయితీలు, పాలసీలు కేవలం వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే ప్రయోజనాలు వర్తించేవని, దీంతో కార్పొరేట్ సంస్థల్లో ఒక రకమైన ఆందోళన ఉండేదన్నారు. ఇప్పుడు అలా కాకుండా అందరికీ వర్తించే విధంగా గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పాత పాలసీల గడువు ముగిసే లోపు 100 రోజుల కార్యక్రమం లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. రూ.7,000 కోట్లు అడిగాం... పారిశ్రామిక రంగానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు రూ.7,000 కోట్లు, ఐటీ శాఖకు రూ.1,400 కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా ఆర్థిక మంత్రిని కోరినట్లు గౌతంరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం మేరకు కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఐటీపై ప్రత్యేక దృష్టి బెంగళూరు, పూణే నగరాలతో పోటీ పడే విధంగా విశాఖ నగరానికి ఐటీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఐటీ పెట్టుబడుల్లో వేగంగా విస్తరించడానికి విశాఖకు అపార అవకాశాలున్నాయని అన్నారు. విశాఖ తర్వాత మంగళగిరి, తిరుపతి వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు, చెన్నై, బెంగళూరులకు దగ్గరగా ఉన్న తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. -
హైదరాబాద్‌కు మరో భారీ ఐటి హబ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు మరో భారీ ఐటి హబ్ ను ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ పచ్చజెండా ఊపింది. 2.19 లక్షల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ ఐటీ హబ్ ను ఏర్పాటు చేయడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం ఐటీఐఆర్ గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) శుక్రవారం పరిశీలించింది. ఐటీఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు, పాలనా సంబంధ సర్వీసుల వంటివి ఏర్పాటవుతాయి. వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్), పారిశ్రామిక పార్క్‌లు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు(వేర్‌హౌసింగ్), ఎగుమతి యూనిట్లు తదితరాలను కూడా నెలకొల్పే అవకాశముంది. 25 ఏళ్ల కాలంలో 50,000 ఎకరాలలో రెండు దశలలో ఐటీఐఆర్ ఏర్పాటవుతుంది. తద్వారా 15 లక్షల మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధి లభించగలదు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ర్టం వాటా 12.4%కాగా, 4వ ర్యాంక్‌లో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదైంది. -
ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా హైదరాబాద్!
న్యూఢిల్లీ: సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్)గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) శుక్రవారం పరిశీలించనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐటీఐఆర్‌లో ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయాలు, పాలనా సంబంధ సర్వీసుల వంటివి ఏర్పాటవుతాయి. వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్), పారిశ్రామిక పార్క్‌లు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు(వేర్‌హౌసింగ్), ఎగుమతి యూనిట్లు తదితరాలను కూడా నెలకొల్పే అవకాశముంది. 25 ఏళ్ల కాలంలో 50,000 ఎకరాలలో రెండు దశలలో ఐటీఐఆర్ ఏర్పాటవుతుంది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముంది. తద్వారా 15 లక్షల మంది యువకులకు ప్రత్యక్ష ఉపాధి లభించగలదు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ర్టం వాటా 12.4%కాగా, 4వ ర్యాంక్‌లో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ద్వారా రూ.53,246 కోట్ల టర్నోవర్ నమోదైంది.