IT Mall MD Mohammad
-
ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో ఉన్న ఐటీ మాల్.. దీపావళి నేపథ్యంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్, అవిటా బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే స్క్రాచ్ కార్డుపై రూ.2,500 నుంచి రూ.50,000 వరకు నగదు, ల్యాప్‌టాప్, మొబైల్స్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.5,000 వరకు విలువైన యాక్సెసరీస్ కూడా ఉచితంగా అందుకోవచ్చని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. పరిశ్రమలో తొలిసారిగా 70–80% కొత్త మోడళ్లు కొలువుదీరాయని చెప్పారు. కంపెనీలు 10 శాతం వరకు ధరలను తగ్గించడం వినియోగదార్లకు ప్రయోజనం అన్నారు. జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ధరల శ్రేణి రూ.20,000లతో మొదలుకుని రూ.7 లక్షల వరకు ఉంది. -
ఎలక్ట్రిక్ రిక్షాల అసెంబ్లింగ్‌లోకి ఐటీ మాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్సనల్ కంప్యూటర్ల విక్రయంలో ఉన్న హైదరాబాదీ కంపెనీ ‘ఐటీ మాల్’... తాజాగా ఎలక్ట్రిక్ రిక్షాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం హర్యానాకు చెందిన మల్హోత్రా వెహికిల్ మాన్యుఫ్యాక్చరింగ్‌తో చేతులు కలిపింది. బబ్లి బ్రాండ్ ఈ–రిక్షాలను ఐటీ మాల్ దక్షిణాది మార్కెట్లో విక్రయిస్తుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి తెలియజేశారు. విదేశాల నుంచి కీలక విడిభాగాలను దిగుమతి చేసుకుంటామన్నారు. బబ్లి వాహనాలకు సీఐఆర్టీ ధ్రువీ కరణ ఉందని మల్హోత్రా వెహికిల్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్ దీపక్ లాంబా తెలిపారు. నెలకు 3,000 యూనిట్లు..: ప్రయాణికుల కోసం రెండు, సరుకు రవాణాకు ఒక మోడల్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఎక్స్‌షోరూంలో వీటి ధర రూ.లక్ష– రూ.1.25 లక్షల శ్రేణిలో ఉంది. కంపెనీ ప్రస్తుతం నెలకు 3,000 యూనిట్లు విక్రయిస్తోంది. ఒకసారి బ్యాటరీని చార్జీ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మల్హోత్రా వెహికిల్ కన్సల్టెంట్ సంజయ్ బహుగుణ తెలియజేశారు. ఈ–రిక్షాలో డ్రైవర్‌తో కలిపి అయిదుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. బ్యాటరీ జీవితకాలం ఏడాదిన్నరని, మెయింటెనెన్స్ అవసరం లేదని బహుగుణ చెప్పారు. -
గృహోపకరణాల విక్రయాల్లోకి ఐటీ మాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ ఉపకరణాల విక్రయంలో ఉన్న ఐటీ మాల్ గృహోపకరణాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. శాంసంగ్, ఎల్జీ బ్రాండ్లను తొలుత ప్రవేశపెడుతోంది. ఒకట్రెండు నెలల్లో సోనీ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభిస్తామని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వంటి ఉపకరణాలను విక్రయిస్త్తామని చెప్పారు. కొత్త విభాగం కోసం ఐటీ మాల్ రూ.6 కోట్లకుపైగా వ్యయం చేసే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన నిధులను బ్యాంకుల నుంచి సమీకరించనుంది. ఆపిల్ స్టోర్ ఏర్పాటుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందని అహ్మద్ పేర్కొన్నారు. మార్చికల్లా స్టోర్‌ను తెరుస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్ 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సోనీ, శాంసంగ్, హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఏసూస్, తోషిబా, ఇంటెల్, ఏఎండీ ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు మాల్లో కొలువుదీరాయి.