ఎలక్ట్రిక్‌ రిక్షాల అసెంబ్లింగ్‌లోకి ఐటీ మాల్‌ | IT Mall into Electric Rickshaw Assembling | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ రిక్షాల అసెంబ్లింగ్‌లోకి ఐటీ మాల్‌

Published Sat, Oct 14 2017 1:27 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM

IT Mall into Electric Rickshaw Assembling - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పర్సనల్‌ కంప్యూటర్ల విక్రయంలో ఉన్న హైదరాబాదీ కంపెనీ ‘ఐటీ మాల్‌’... తాజాగా ఎలక్ట్రిక్‌ రిక్షాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం హర్యానాకు చెందిన మల్హోత్రా వెహికిల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌తో చేతులు కలిపింది. బబ్లి బ్రాండ్‌ ఈ–రిక్షాలను ఐటీ మాల్‌ దక్షిణాది మార్కెట్లో విక్రయిస్తుంది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ను నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధికి తెలియజేశారు. విదేశాల నుంచి కీలక విడిభాగాలను దిగుమతి చేసుకుంటామన్నారు. బబ్లి వాహనాలకు సీఐఆర్‌టీ ధ్రువీ కరణ ఉందని మల్హోత్రా వెహికిల్‌ ఇండియా సేల్స్, మార్కెటింగ్‌ హెడ్‌ దీపక్‌ లాంబా తెలిపారు.  
నెలకు 3,000 యూనిట్లు..: ప్రయాణికుల కోసం రెండు, సరుకు రవాణాకు ఒక మోడల్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఎక్స్‌షోరూంలో వీటి ధర రూ.లక్ష– రూ.1.25 లక్షల శ్రేణిలో ఉంది. కంపెనీ ప్రస్తుతం నెలకు 3,000 యూనిట్లు విక్రయిస్తోంది. ఒకసారి బ్యాటరీని చార్జీ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మల్హోత్రా వెహికిల్‌ కన్సల్టెంట్‌ సంజయ్‌ బహుగుణ తెలియజేశారు. ఈ–రిక్షాలో డ్రైవర్‌తో కలిపి అయిదుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. బ్యాటరీ జీవితకాలం ఏడాదిన్నరని, మెయింటెనెన్స్‌ అవసరం లేదని బహుగుణ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement