ivory
-
తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!
టాలీవుడ్ నటి తమన్నా ఎప్పటికప్పుడూ డిఫెరెంట్ లుక్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తన అభిమానుల ఆశ్చర్యపరుస్తుంటుంది. ఒకపక్క బాలీవుడ్ వెబ్ సీరిస్తో బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడూ డిఫరెంట్ స్టయిల్ డిజైనర్ డ్రెస్‌లు ధరిస్తూ..తన క్యూట్ లుక్‌తో ఉన్న పోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలానే ఈ మిల్కీ బ్యూటీ తాజగా ఓ తెల్లటి చీరలో పాలరాతి శిల్పంలో మెరిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. చూడటానికి దివి నుంచి భువికి వచ్చిన దేవతా మాదిరిగా అందంగా ఉంది. నిజానికి ఈ ఫోటో 2022 నాటిది. ఈ చీర సావన్ గాంధీ బ్రాండ్‌కి చెందిన సునేహ్రీ ఐవరీ పిట్టా కలెక్షన్స్‌కి సంబంధించిన డిజైనర్ శారీ. ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే..శారీ బోర్డర్ అంతటా గోల్డ్ గొట్టా పట్టీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. నెక్‌లైన్‌ని కలిగి ఉన్న మ్యాచింగ్ గోల్డ్ బ్లౌజ్ ఆ చీరకు చక్కగా మ్యాచ్ అయ్యింది. దీనికి తగ్గట్టు గ్లిట్జీ పెర్ల్ చెవిపోగులు, కుందన బ్యాంగిల్స్ చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే జుట్టుని చక్కగా ముడివేయడం మంచి అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ చీర ఆర్గాన్జా సిల్క్ ఫ్రాబ్రిక్ కావడంతో శరీరంపై చక్కగా జాలువారుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 1,28,000/-. ఈ బ్రాండ్ చీరలు డిజైన్వేర్కి తగ్గ రేంజ్లో కాస్టలీగా ఉంటాయి. ఇక తమన్నా ఇటీవలే తమిళ అరణ్మనై 4 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పచ్చని చీరలో తళుక్కుమంది. ఆ చీర పల్లు చుట్టూ కూడా ఇలానే బంగారు బోర్డర్ ఉంది. ఆ ఈవెంట్లో తమన్నా ఈ చీరలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!) -
కెన్యాలో ఏనుగు దంతాలను తగులబెట్టేశారు
-
ఏనుగు దంతాలను తగలబెట్టేశారు
వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో భాగంగా ప్రతి ఏడాది వేలాది ఏనుగులను స్మగ్లర్లు చంపేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాలని కెన్యా నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు దేశంలో ఏనుగులను చంపి సేకరించిన... దాదాపు రూ.105 మిలియన్ డాలర్ల విలువైన ఏనుగు దంతాలను కెన్యాలోని నైరోబి జాతీయ పార్క్‌లో శనివారం తగలబెట్టారు. ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా వీటికి నిప్పుంటించారు. దేశంలో దాదాపు 7000 ఏనుగులకు చెందిన దంతాలను అక్రమంగా తరలిస్తుండగా... అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో దంతాల అక్రమ వ్యాపారం కోసం ఏనుగులను చంపివేస్తుండటంతో వాటి సంఖ్య భవిష్యత్తులో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని కెన్యా భావించింది. అందులోభాగంగా దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏనుగు దంతాలలో ఎవరు ఎటువంటి వ్యాపారం చేయకూడదు అన్నారు. ఈ వ్యాపారం అంటేనే మరణం, ఏనుగులను చంపితే... మన జాతి సంస్కృతి మృతి చెందినట్లే అని దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఓ ఏనుగు చంపేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా అయితే రానున్న 10 ఏళ్లలో మరింత దుర్భరం అవుతుందన్నారు. 1970లో ఆఫ్రికాలో 1.2 మిలియన్ ఏనుగులు ఉండేవని.. కానీ నేటి వాటి సంఖ్య నాలుగు నుంచి నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏనుగు దంతాలను తగలబెట్టడం ద్వారా వేటగాళ్లను కెన్యా ఓ సందేశాన్ని ఇచ్చింది.