IYR Krishna
-
చంద్రబాబు వ్యాఖ్యలు నేను నమ్మడం లేదు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
-
కొలిక్కిరాని విద్యుత్ ఉద్యోగుల విభజన
న్యాయస్థానం సూచన మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ ఎవరి వాదన వారిదే-భేటీలో పరిష్కారం కాని విభజన సమస్య హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం కొలిక్కి రాలేదు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. న్యాయస్థానం సూచన మేరకు విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఇందులో రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎవరి వాదనకు వారు కట్టుబడ్డారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతో విద్యుత్ ఉద్యోగుల విభజనపై చర్చించానని, పరిష్కారం లభించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీ స్థానికత ఆధారంగా చేయాలని కోరుతోందని, ఇందుకు ఏపీ అంగీకరించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిన 1,253మంది విద్యుత్ ఉద్యోగులు రెండు నెలల నుంచి జీతాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రవిభజన చట్టంలో ఎక్కడా ఏకపక్షంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీకి ఆస్కారం కల్పించలేదని, చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు ఏ ప్రాంతం లో ఉన్నా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు వాటి సేవలను పొందాలని ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలో విభజన చట్టంలో ఎక్కడా పొందుపరచలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీతోపాటు తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీ జనాభా ప్రాతిపదికన షీలాబిడే కమిటీ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రానికి తెలియజేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. -
నో హెల్మెట్.. నో ఫైన్
‘ఆగాగు.. హెల్మెట్ లేకుండా వెళ్తున్నావ్.. బండాపు. సార్ అక్కడున్నారు. వెళ్లి ఫైన్ కట్టు’ అంటూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చీపోయేవారిని ఏలూరు పోలీసులు శనివారం ఇలా అడ్డుకున్నారు. ఒక్కరోజే నగరంలో 276 కేసులు నమోదు చేసి రూ.32 వేలు జరిమానా వసూలు చేశారు. అయితే, హెల్మెట్ లేకుండా వెళ్లే వారికి జరిమానాలు విధించవద్దని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. రెండు నెలలపాటు హెల్మెట్ వాడకంపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని.. ఆ తరువాతే జరిమానా వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఏలూరు (ఆర్ఆర్ పేట) : హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకుల నుంచి రెండు నెలలపాటు జరిమానాలు వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ ఈ మేరకు ఆదేశాలిచ్చారన్నారు. రానున్న రెండు నెలలపాటు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వాడేవిధంగా చైతన్యపరచాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత మాత్రమే ఫైన్ వసూలు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని పోలీస్, రవాణా అధికారులకు ఆదేశాలిచ్చినట్టు కలెక్టర్ చెప్పారు. హెల్మెట్ ఎందుకు వాడాలి, దానివల్ల ప్రాణానికి ఎంత మేలు కలుగుతుందనే విషయాలపై ఈ రెండు నెలలపాటు వాహన చోదకులకు అవగాహన కల్పించేందుకు ‘ఫైన్ వద్దు.. చైతన్యం ముద్దు’ అనే కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో హెల్మెట్లకు సంబంధించి మార్గదర్శక సూత్రాలు పంపిస్తామని ప్రధాన కార్యదర్శి చెప్పారని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా.. నిబంధనల మేరకు తయారైన హెల్మెట్లను మాత్రమే మార్కెట్లో విక్రయించేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌కు ఇన్చార్జి జేసీ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు, డ్వామా పీడీ రమణారెడ్డి, రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్, రవాణా శాఖ పరిపాలనాధికారి మాణిక్యాలరావు పాల్గొన్నారు.