jabardhast
-
నేను చేసిన పూజలు, ఉపవాసాలు వృథా.. జబర్దస్త్ యాంకర్ వీడియో వైరల్
-
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి(హరిబాబు) మంగళవారం టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పలు విషయాలను శ్రీహరి వెల్లడించాడు. తొలుత తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పిన నటుడు ఆపై జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తాల్లో అప్పు చేసి జాబ్ మానేసినట్లు తెలిపాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తీసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వాటిని తీర్చేందుకు చాలా కష్టపడ్డానని శ్రీహరి.. తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. నాలుగేళ్ల కిందట తన తల్లి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని చెప్పాడు. దాంతో డబ్బుల కోసం ఫ్రెండ్ ద్వారా తొలిసారి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బులతో తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించినట్లు అంగీకరించాడు. అయితే గతంలో తొలిసారి కేసు నమోదు చేశాక.. ఇప్పుడు తనకేం సంబంధం లేకపోయినా నాలుగేళ్లకు మరో కేసు నమోదు చేశారని ఆందోళనకు గురయ్యాడు. గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసులురెడ్డి దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోక తనపేరు చెప్పాడన్నాడు. అయితే గతంలో తనపై నమోదైన తొలికేసు సమయంలో తాను స్మగ్లింగ్ చేయడం నిజమే కనుక నిజాయితీగా తాను లొంగిపోయానని.. ఆ కేసులో శిక్ష అనుభవించేందుకు సిద్ధమని తెలిపాడు హరిబాబు. తాను ఎప్పుడో వదిలేసిన ఈ పనికి ప్రస్తుతం తప్పుడు కేసులు బనాయించారని, ఆ కారణంతోనే నాలుగేళ్లు తనపేరు మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అర్బన్ జిల్లాలో ఉన్న ఏ కేసులతోనూ తనకు సంబంధం లేదని, శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్ఐతో కలిసి స్లగ్లింగ్ చేశాడని వివరించాడు. బెంగళూరులో దుంగలు అమ్మి ఎస్ఐ డబ్బులు ఖాతాలో వేసేవాడని, అయితే వాటికి సంబంధించిన రశీదులు శ్రీనివాసులు రెడ్డి వద్ద ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌కు బహిర్గతం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే తనపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించారని తన ఆవేదనను కమెడియన్ వెల్లగక్కాడు. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తిన కమెడియన్.. సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం గాలించారు. ఈ క్రమంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారుల ఎదుట లొంగిపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. టాస్క్‌ఫోర్స్ ఐజీ ఎదుట లొంగిపోయిన టీవీ ఆర్టిస్ట్ కమెడియన్ కోసం పోలీసుల వేట -
లొంగిపోయిన ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్..!
తిరుపతి సిటీ: ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి మంగళవారం టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడు. తిరుపతికి చెందిన యల్లంపల్లి శ్రీహరి న్యాయవాదితో వచ్చి కపిలతీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో లొంగిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో వచ్చిన ఆదాయంతో సినిమా తీశాడని, టీవీ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీహరి కోసం 5 రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టగా, ఐజీ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు శ్రీహరిని కోర్టులో హాజరుపరిచారు. ఇతనిపై 10కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన ఆర్థిక పరిస్థితి బాగోలేక తాను ఒకే ఒక్క సారి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పాల్గొన్నానని శ్రీహరి మీడియాకు తెలిపారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుండగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కానిస్టేబుల్ తనపై అనేక కేసులు బనాయించి ఇరికించాడని చెప్పారు. -
నా మాటలు సాఫ్ట్వేర్..రూపం హార్డ్‌వేర్..
-స్నేహమే సినిమాల్లోకి రప్పించింది – హాస్యనటుడు రఘు కారుమంచి రాయవరం(మండపేట) : ఆయన ఆంధ్రాకు చెందిన వాడైనా..పెరిగింది తెలంగాణలోనే. అందుకే డైలాగులు పూర్తిగా తెలంగాణ యాసతో చెపుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాఫ్ట్వేర్ మార్కెటింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ..అనుకోకుండా సినీ నటుడిగా మారానంటున్నారు ప్రముఖ హాస్య నటుడు రఘు కారుమంచి. స్నేహమే తనను సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేయించిందంటున్న రఘు నటుడికి ట్రిపుల్ ‘టి’తో ప్రోత్సాహం ఉండాలంటున్నారు. రాయవరం సాయితేజా విద్యానికేతన్ 20వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయన విద్యానికేతన్ కరస్పాండెంట్ కర్రి సూర్యనారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సినీ ఫీల్డ్‌కు వస్తానని ఊహించలేదు.. ఎంబీఏ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి చీఫ్ మార్కెటింగ్ ఇంజనీర్‌గా పనిచేసేవాడిని. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ అపార్ట్మెంట్లో ఆఫీస్ నిర్వహిస్తుండేవాడిని. వీవీ వినాయక్, సురేందర్‌రెడ్డి అసిస్టెంట్ దర్శకులుగా ఉంటూ అదే అపార్ట్మెంట్లో ఉండేవారు. ప్రతి రోజూ కలుసుకోవడంలో మా మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే సినీ ఫీల్డ్ వైపు అడుగులు వేశాను. ‘నేను దర్శకుడినయ్యాక నీకు వేషమిస్తా’నన్న వినాయక్ ‘ఆది’ సినిమాతో ఆ మాట నిలబెట్టుకున్నారు. ‘అదుర్స్’ తర్వాత ఉద్యోగానికి రాజీనామా.. ‘అదుర్స్’ సినిమా నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 2010 వరకు జాబ్ చేస్తూనే నటిస్తుండేవాడిని. అప్పటి వరకు 30–40 సినిమాల్లో నటించాను. 2010 జనవరి తర్వాత 2016 వరకు 110 సినిమాలు చేశాను. ‘ఆది’ రిలీజయ్యాక ఏ రోజూ వేషం కావాలని ఎవ్వరినీ అడగలేదు. జాబ్ చేసుకుంటుండగానే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. వృత్తిపరంగా నా మాటలు సాఫ్ట్‌వేర్‌గా ఉన్నా..నా రూపం హార్డ్‌వేర్‌గా ఉంటుంది. అదే ప్రేక్షకులకు దగ్గర చేసింది. ప్రతి వృత్తిలోనూ స్ట్రగుల్ ఉంటుంది.. ప్రతి వృత్తిలోనూ జాబ్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. సినిమా రంగం మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఈ రంగంలోకి వచ్చినందుకు గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు 170కి పైగా సినిమాల్లో నటించాను. టీవీ రంగంలో 1500 వరకు ఎపిసోడ్లు చేశాను. తెలుగు భాషతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నటించాను. ట్రిపుల్ ‘టి’తో పాటు ప్రోత్సాహం అవసరం.. నటుడికి టాలెంట్, టైమ్, టైమింగ్ అవసరం. ఈ మూడింటితో పాటు ప్రోత్సాహం ఉండాలి. నాకు లభించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చాను. కామెడీ నటుడిగా ప్రేక్షకులను అలరించాను. అయితే విలన్‌గా నటించి ప్రేక్షకులను మరింత మెప్పించాలనుంది. ప్రస్తుతం తెలుగులో 10 సినిమాలు, కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నాను.