జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని వినతి
రాజంపేట:క్లస్టర్, పీహెచ్సీ పరిధిలో విధి నిర్వహణలో తమకు కేటాయించిన జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని సీహెచ్ఓ, ఎంపీహెచ్‌ఓలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ పిచ్చయ్య ఆధ్వర్యంలోజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీ.రాజా, నారాయణ డీఎంఅండ్‌హెచ్‌ఓ నారాయణనాయక్‌కు విన్నవించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా రాజంపేటలో పిచ్చయ్య విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ క్లస్టర్ పరిధిలో పనిచేసే సీహెచ్ఓ, ఎంపీహెచ్ఓల విధుల నిర్వహణ గురించి సరైన మార్గదర్శకాలను జారీ చేయాలని కోరారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ సెలవును మంజూరు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
పీహెచ్‌సీల్లో (సబ్‌సెంటర్) ఎన్ఆర్ హెచ్ఎం స్కీం కింద విడుదలైన నిధులను ప్రస్తుతం మహిళ ఆరోగ్య కార్యకర్తలు, పబ్లిక్ హెల్త్ నర్సులు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ అకౌంట్ కింద ఖర్చు చేస్తున్నారని వివరించారు. సంబంధిత మగ, ఆడ ఆరోగ్య పర్యవేక్షకులు, మహిళ ఆరోగ్య కార్యకర్తలు జాయింట్ అకౌంట్ కింద నిధులు ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓల సంఘం ఉపాధ్యక్షులు మురళీ, దిబ్బన్న, నాగరాజస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు టీపీ రెడ్డయ్య, జాయింట్ సెక్రటరీ కుసుమకుమారి, జిల్లా నేతలు వేణు, స్వామిదాస్, సురేంద్రరాజు పాల్గొన్నారు.