భక్తుల సామగ్రి భద్రతకు లాకర్లు
జగ్గంపేట : గోదావరి పుష్కరాలకు భక్తుల రద్దీ అధికంగా ఉన్న ఘాట్ల వద్ద లాకర్ సదుపాయం కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ లాకర్లను జగ్గంపేట పార్టీ కార్యాలయం వద్ద తయారుచేయించే పనిలో జ్యోతుల నిమగ్నమయ్యారు. సుమారు రూ.8 లక్షలతో వంద లాకర్లు తయారు చేయిస్తున్నారు. రెండు రోజులు గా పెద్దాపురం, జగ్గంపేట మండలాల్లోని కార్పెంటర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. భక్తులు లగేజిని లాకర్లలో ఉచితంగా భద్రపర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నా రు. భక్తులకు తాగునీరు, పాలు, మజ్జిగ సదుపాయాలతోపాటు సమాచారం, ఇత ర సదుపాయాలను పార్టీ శ్రేణులు అందజేయనున్నాయి.
శనివారం పార్టీ కార్యాల యం వద్ద తయారవుతున్న లాకర్లను పరిశీ లించిన జ్యోతుల నెహ్రూ రాత్రి పగలు తేడా లేకుండా రెండు రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని అక్కడ కార్పెంటర్లకు సూ చించి పలు సలహాలు, సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారని, ప్రభుత్వపరం గా కాకుండా తమ పరంగా వైఎస్సార్ కాం గ్రెస్ తరఫున సదుపాయాలు కల్పించేం దుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే ఘాట్ల వద్ద లాకర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్నానమాచరించేందుకు వచ్చే భక్తులు త మ లగేజిని లాకర్ల వద్ద భద్రంగా ఉంచుకోవచ్చన్నారు. లాకర్ల తాళాలను కూడా భక్తులకు అందజేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, జంపన సీతారామచంద్రవర్మ, భూపాలపట్నం ప్రసాద్, కెంగం రమణ, తాతాజీ ఉన్నారు.