Jagadish Dwarapureddy
-
బొత్సను వదలని టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ నేతలు వదలడం లేదు. బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం మొదలైన దగ్గరి నుంచి టార్గెట్ రాజకీయాలు చేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు తాజాగా లిక్కర్ కేసును తిరగదోడేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బొత్స లిక్కర్ కేసును తిరగదోడే విషయాన్ని ప్రస్తావించారు. బొత్స, ఆయన సోదరుడ్ని తప్పిస్తూ గతంలో విచారణ జరిగిందని, తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని, వాటి ఆధారంగా మరోసారి విచారణ జరుపుతామని రామకృష్ణుడు సూచన ప్రాయంగా వెల్లడించారు. తమ వాదలనకు బలం చేకూరే విధంగా జిల్లా నేతల నుంచి బొత్స మద్యం వ్యాపారం వివరాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా నేతలు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, శోభా హైమావతి తదితరులు బొత్స మద్యం వ్యాపార వివరాలన్ని సేకరించి నివేదిక రూపంలో సిద్ధం చేశారు . దాన్ని మంగళవారం సాయంత్రం 4.30గంటలకు హైదరాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్ర సమావేశంలో చంద్రబాబుకు నివేదికను సమర్పించనున్నారు. ఈలోపే బొత్స లిక్కర్ బిజినెస్ నివేదిక కాపీని సీఎం ఓఎస్డీకి మెయిల్ ద్వారా కూడా పంపించారు. -
జగదీష్..నోరు అదుపులో పెట్టుకో?
విజయనగరం ఫోర్ట్ : టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చరిత్ర అందరికీ తెలిసిందేనని డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకోపోతే చరిత్ర మొత్తం బయట పెడతామని హెచ్చరించారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నా.. అన్నా.. అంటూ బొత్స సత్తిబాబును కౌన్సిలర్ టికెట్టు ఇప్పించాలని అడిగినా మాట మర్చిపోయావా అని మండిపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లో బి ఫారాలు అమ్ముకున్న నీవా.... బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి గురించి అడిగితే ఎక్కడ అవినీతి చిట్టా విప్పుతారని ఎమ్మెల్సీ పదవి కూడా అడగకుండా ఉండిపోయినా చరిత్ర నీదని ఆరోపిం చారు. ఎదుట వారిపై విమర్శలు చేసే ముం దు మన చర్రిత ఎలాంటిదో తెలుసుకోవాలని సూచించారు. రూ. వంద కోట్లతో జిల్లాకు తా గునీటి పథకాలను తీసుకువచ్చి ప్రజల దాహార్తి తీర్చిన ఘతన బొత్స సత్యనారాయణది అన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 700 ఇంటికి వచ్చేదని, ఇప్పుడు రూ. 4 వేలు అయిందని, దీన్ని బట్టి ఎవరు ఇసుక దోపిడీ చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. పూటకో పార్టీ మారే మీసాల గీతకు గత ఎన్నికల్లో ఐవిపి రాజుతో కలిసి డబ్బులకు టిక్కెట్ అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పు జరిగి ఉంటే ప్రభుత్వం మీదేనని విచారణ చే సుకోవాలని సవాల్ విసిరారు. ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, రొంగలి పోతన్న, యడ్ల ఆదిరాజు, మన్మథకుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు -
డంపింగ్‌యార్డు ఏర్పాటుకు మల్లగుల్లాలు
పార్వతీపురం రూరల్ :మున్సిపాల్టీ పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం పట్టణ శివారున ఉన్న డంపింగ్ యార్డు చాలకపోవడంతో పాటు చెత్తంతా ప్రధాన రోడ్డుపైకి వచ్చేయడంతో మున్సిపల్ అధికారులు కొత్తగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలసేకరణ పనిలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలోని చినమరికి గ్రామ సమీపంలో యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించి, ట్రాక్టర్ల సహాయంతో చెత్తను పారబోసేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామ సమీపంలో చెత్తను వేసేందుకు గ్రామస్తులంతా వ్యతిరేకించి అప్పట్లో ఆందోళనలు చేపట్టారు. అధికారులు ఎంత నచ్చచెప్పినా వారంతా ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే మున్సిపాల్టీలో రోజు రోజుకూ పెరుగుతున్న చెత్తను పారబోసేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు స్థలసేకరణ పనిలో పడ్డారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు, తహశీల్దార్ కేడీవీ ప్రసాదరావు నర్సిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. అయితే గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు, గ్రామపెద్దలకు మాటమాత్రమైనా చెప్పకుండా గ్రామ రెవెన్యూ పరిధిలో స్థల పరిశీలన చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుమంటున్నారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఏ విధంగా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తారో చూస్తామని గ్రామపెద్దలు అంటున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ గొట్టాపు గౌరి స్పష్టం చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా మున్సిపల్ అధికారులు గ్రామంలో ప్రవేశించి డంపింగ్ యార్డుకు స్థలపరిశీలన చేయటమేమిటని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. మరి మున్సిపల్ అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి మరి. -
జగదీష్‌పై పెరుగుతున్న వ్యతిరేకత
పార్వతీపురం: టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌పై రాన్రాను వ్యతిరేకత పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అన్నీ జగదీషేనంటూ వెంట తిరిగిన తమ్ముళ్లు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతతో ఆయనపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నుంచి నిన్న మొన్నటి కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక వరకు జరిగిన పరిణామాల పట్ల తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ద్వారపురెడ్డి జగదీష్ తన రాజకీయ చతురత తో 12 వార్డులను గెలుచుకుని, ఇండిపెం డెంట్ల మద్దతుతో మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని తన సతీమణి శ్రీదేవికి కట్టబెట్టారు. తాను ఎమ్మెల్సీ రేసులో లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి తనకే వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకు డు, ఆది నుంచి పార్టీ జెండాను భుజాన వేసుకొని తిరిగిన బార్నాల సీతారం ఆశపడ్డారు. అయితే అనూహ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన బెలగాం జయప్రకాష్‌కు వైస్ చైర్మ న్ కట్టబెట్టారు. అప్పటి నుంచి బార్నాల వర్గం జగదీష్ పట్ల వ్యతిరేకత కనబరు స్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కో- ఆప్షన్ పదవిని టీడీపీలో ఆది నుంచి ఉం టున్న మరియదాసు, సీనియర్ నాయకు డు బోడ పోలారావు, కోరాడ సతీష్, పట్టా చిన్నంనాయుడు, తదితరులు ఆశించారు. ఒకానొక సమయంలో ఓ నాయకుడు తనకు కో-ఆప్షన్ పదవి వచ్చిం దని స్వీట్లు కూడా పంచిపెట్టారు. అదేదీ జరగకుండా ఊహించని రీతిలో జగన్నాథపురానికి చెందిన రాగోలు మంగమ్మకు కో-ఆప్షన్ కట్టబెట్టారు. దీం తో జగదీష్‌ను వ్యతిరేకించేవారు ఎక్కువయ్యారు. ఇదిలా ఉండగా త్వరలో భర్తీ చేయనున్న ఏఎంసీ చైర్మన్ పదవికి కూడా రూ.20 లక్షలకు బేరసారాలు జరిగాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే జగదీష్ వ్యతిరేక వర్గం బలపడే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీలో కొత్తగా పాలకవర్గం పగ్గాలు చేపట్టింది మొదలు చైర్‌పర్శన్ పర్యట నలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలలు గా పట్టణ ప్రజలు తాగునీటి కి ముఖం వాచిపోతున్నారు. దీంతోపాటు వరహా లగెడ్డ గట్టుపై బడ్డీల తొలగింపు, పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు అం దించకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఇండిపెండెంట్ల మద్ధతుతో చైర్పర్సన్ పదవి దక్కించుకున్న ద్వారపురెడ్డికి ఆ పదవిని సైతం దూరం చేసే పనిలో వ్యతిరేకవర్గం పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్లు భోగట్టా. ఏది ఏమైనా జగదీష్ తమ పట్ల రేగుతున్న వ్యతిరేకతను చక్కదిద్దుకోకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.