జగదీష్..నోరు అదుపులో పెట్టుకో? | Jagadish Dwarapureddy Control YOur mouth : Pilla Vijay Kumar | Sakshi
Sakshi News home page

జగదీష్..నోరు అదుపులో పెట్టుకో?

Published Fri, Nov 7 2014 2:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

జగదీష్..నోరు అదుపులో పెట్టుకో? - Sakshi

జగదీష్..నోరు అదుపులో పెట్టుకో?

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చరిత్ర అందరికీ తెలిసిందేనని డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకోపోతే చరిత్ర మొత్తం బయట

విజయనగరం ఫోర్ట్ : టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చరిత్ర అందరికీ తెలిసిందేనని డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకోపోతే చరిత్ర మొత్తం బయట పెడతామని హెచ్చరించారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నా.. అన్నా.. అంటూ బొత్స సత్తిబాబును కౌన్సిలర్ టికెట్టు ఇప్పించాలని అడిగినా మాట మర్చిపోయావా అని మండిపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లో బి ఫారాలు అమ్ముకున్న నీవా.... బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.   ఎమ్మెల్సీ పదవి గురించి అడిగితే ఎక్కడ అవినీతి చిట్టా విప్పుతారని ఎమ్మెల్సీ పదవి కూడా అడగకుండా ఉండిపోయినా చరిత్ర నీదని ఆరోపిం చారు.
 
 ఎదుట వారిపై విమర్శలు చేసే ముం దు మన చర్రిత ఎలాంటిదో తెలుసుకోవాలని సూచించారు. రూ. వంద కోట్లతో జిల్లాకు తా గునీటి పథకాలను తీసుకువచ్చి ప్రజల దాహార్తి తీర్చిన ఘతన బొత్స సత్యనారాయణది అన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 700 ఇంటికి వచ్చేదని, ఇప్పుడు రూ. 4 వేలు అయిందని, దీన్ని బట్టి ఎవరు ఇసుక దోపిడీ చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. పూటకో పార్టీ మారే మీసాల గీతకు గత ఎన్నికల్లో ఐవిపి రాజుతో కలిసి డబ్బులకు టిక్కెట్ అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పు జరిగి ఉంటే ప్రభుత్వం మీదేనని విచారణ చే  సుకోవాలని సవాల్ విసిరారు. ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, రొంగలి పోతన్న, యడ్ల ఆదిరాజు, మన్మథకుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement