Pilla Vijay Kumar
-
నిరూపిస్తే.. దేనికైనా రెడీ!
విజయనగరం క్రైం : ఎమ్మెల్యే టిక్కెట్ కోసం డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే...దేనికైనారెడీ అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ. వి. పి. రాజు డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్‌కు సవాల్ విసిరారు. శుక్రవారం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిక్కెట్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు నిరూపించాలన్నారు. టిక్కెట్ అమ్ముకున్నది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను తాడ్డి వెంటకరావుకు బి ఫారమ్ కేటాయించి వంగపండు నారాయణప్పలనాయుడుకు ఎంతకు అమ్ముకున్నారో ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. పదేళ్లుగా విజయనగరం పట్టణంలో అనేక దందాలు, భూకబ్జాలకు పాల్ప డిన వ్యక్తి ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. డీసీసీ అధ్యక్షుడు పట్టణానికి ఎక్కువ... జిల్లా పదవికి తక్కువ అన్న చం దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జిల్లాపై అవగాహన లేని వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని, ఇప్పటివరకు ఆయన ఎన్ని మండలాలు తిరిగారో చెప్పాలన్నారు. విజ య్‌కుమార్ చేసిన దందాలు, భూ ఆక్రమణలపై ఇప్పటికీ కేసు లు నడుస్తున్నాయని తెలిపారు. విజయ్‌కుమార్ అక్రమాలు, దందాలపై విచారణ చేయిస్తామన్నారు. ఆ పార్టీ నాయకుడు సైలాడ త్రినాథ్మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హు ందగా వ్యవహరించాలని, విధానపరమైన విమర్శలు చేసుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజల్లో సులకన భావన వస్తుందని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కర్రోతు వెంకట నరసింగరావు, పార్టీ నాయకులు ఎస్.ఎన్.ఎం.రాజు, మైల పల్లి పైడిరాజు, గుండెల ప్రకాశరావు, మద్దాల ముత్యాలరావు, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
జగదీష్..నోరు అదుపులో పెట్టుకో?
విజయనగరం ఫోర్ట్ : టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చరిత్ర అందరికీ తెలిసిందేనని డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకోపోతే చరిత్ర మొత్తం బయట పెడతామని హెచ్చరించారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నా.. అన్నా.. అంటూ బొత్స సత్తిబాబును కౌన్సిలర్ టికెట్టు ఇప్పించాలని అడిగినా మాట మర్చిపోయావా అని మండిపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లో బి ఫారాలు అమ్ముకున్న నీవా.... బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి గురించి అడిగితే ఎక్కడ అవినీతి చిట్టా విప్పుతారని ఎమ్మెల్సీ పదవి కూడా అడగకుండా ఉండిపోయినా చరిత్ర నీదని ఆరోపిం చారు. ఎదుట వారిపై విమర్శలు చేసే ముం దు మన చర్రిత ఎలాంటిదో తెలుసుకోవాలని సూచించారు. రూ. వంద కోట్లతో జిల్లాకు తా గునీటి పథకాలను తీసుకువచ్చి ప్రజల దాహార్తి తీర్చిన ఘతన బొత్స సత్యనారాయణది అన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 700 ఇంటికి వచ్చేదని, ఇప్పుడు రూ. 4 వేలు అయిందని, దీన్ని బట్టి ఎవరు ఇసుక దోపిడీ చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. పూటకో పార్టీ మారే మీసాల గీతకు గత ఎన్నికల్లో ఐవిపి రాజుతో కలిసి డబ్బులకు టిక్కెట్ అమ్ముకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పు జరిగి ఉంటే ప్రభుత్వం మీదేనని విచారణ చే సుకోవాలని సవాల్ విసిరారు. ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, రొంగలి పోతన్న, యడ్ల ఆదిరాజు, మన్మథకుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు