జేపీ అగర్వాల్ రాజీనామా
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరవైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ అగర్వాల్ పదవికి రాజీనామా చేసినట్టు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఎన్నికల ప్రచారంలో అగర్వాల్ సహకరించకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2008లో 43 అసెంబ్లీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పార్టీ తనకు సహకరించలేదని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సైతం ఆరోపించడం తెలిసిందే.