jai singh
-
‘హస్త’వాసి ఎవరో..?
సాక్షి, ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసం పోటాపోటీ నడుస్తుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు మూడు రో జుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ స్థానం కోసం 15 నుంచి 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తుది జాబితా వివరాలు తెలి యరాలేదు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పరిశీలన తర్వా త స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల పేర్లు చేరుతాయి. అక్కడ వడపోత అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి చేరుతుంది. ఆతర్వాత అభ్యర్థి ఎంపికను ఏఐసీసీ ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ఎస్టీలో ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గాల్లో ఎవరికిస్తారనే దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది. పలువురు ఉదోగ్యుల యత్నాలు.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, నిర్మల్ జిల్లా కుబీర్‌కు చెందిన ఐటీశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ ప్రకాశ్, ఉట్నూర్ అదనపు డీఎంహెచ్‌వో కుమురం బాలు, ఐటీడీఏ పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఐటీడీఏ బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మేస్రం మనోహర్, పరిశ్రమల శాఖ రిటైర్డ్ అధికారి రాంకిషన్, ఆదిలాబాద్ ఎల్ఐసీ ఉద్యోగి దౌలత్‌రావు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ మే స్రం బాబురావు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉట్నూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి రోషన్, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సబావత్ శ్రీనివాస్ నాయక్‌తో పాటు నరేశ్‌జాదవ్, శ్రావణ్ నాయక్ శనివారం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పరంగా.. కాంగ్రెస్ పార్టీ పరంగా పలువురు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానంపై ఆశతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా శాసన సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ దిశగా తనకు పోటీకి అవకాశం ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై న ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ మరోసారి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ మాజీ నాయకులు శ్రావణ్ నాయక్ టికెట్ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. ఉట్నూర్ ఎంపీపీ పంద్రం జైవంత్‌రావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నా రు. శాసనసభ ఎన్నికల్లో బోథ్ నుంచి పోటీ చేసిన అడె గజేందర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పార్టీపరంగా పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య 15 నుంచి 20 మంది ఉండటంతో అధిష్టానం ఎవరి వైపు దృష్టి సారిస్తుందో వేచి చూడాల్సిందే. -
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్‌రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
రిమ్స్ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్‌ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, అవుట్‌సో ర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌నర్సుల నుంచి వసూళ్లు.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్)లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌పై రాసుకొని గ్రూప్‌లో వేశారు. ఇంక్రిమెంట్ కాకపోతే పీఆర్సీ, ఐఆర్‌లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారు. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్‌పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్‌లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సర్వీసు బుక్‌లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సుల నుంచి రిమ్స్‌లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. రిమ్స్‌లో స్టాఫ్ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్‌డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్‌లో పనిచేసే ఓ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మరో ల్యాబ్ అసిస్టెంట్ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్‌డైరెక్టర్ -
విహారం: జయ్‌పూర్ - ఎడారిలో పచ్చని కాంతి
రాచరికానికి చిహ్నం రాజస్థాన్. దానికి చక్కటి ఆనవాలు రాజస్థాన్ రాజధాని జయ్‌పూర్ నగరం. సవాయ్ రెండవ జయ్సింగ్ కట్టించిన నగరం కావడంతో జయ్పూర్గా నామకరణం అయింది. ఇండియన్ టూరిజం ప్రతిష్టాత్మకంగా చూపించుకునే బాందినీ ప్రింట్ చేసిన తలపాగాలు, కుందన్ ఆభరణాలు ధరించిన యువతులు, ఒంటెల సవారీల వంటి వాటికి పుట్టిల్లు ఇది. జయ్‌పూర్‌లో అడుగుపెట్టిన తర్వాత నగర పర్యటన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఒక పట్టాన అర్థం కాదు. హవామహల్, నహర్‌ఘర్ ఫోర్ట్, అంబర్ ఫోర్ట్, జయ్‌ఘర్ ఫోర్ట్, సిటీప్యాలెస్, జల్‌మహల్, రామ్‌బాఘ్ ప్యాలెస్, సిసోడియా రాణి కా బాఘ్, ఆల్బర్ట్ మ్యూజియం, జంతర్‌మంతర్... ఇలా ప్రధానమైన నిర్మాణాల జాబితా కూడా పది దాటుతుంది. నగరానికి అన్ని వైపులా స్వాగత ద్వారాలు ఉంటాయి. లోపలికి అడుగు పెడితే ఆధునికత సంతరించుకుంటున్న పాశ్చాత్యఛాయలు కనిపిస్తాయి, పర్యాటక శాఖ ఊరించే కోటలను చూడాలంటే ఓల్డ్‌సిటీకి వెళ్లాలి. పాత నగరం మొత్తానికి ప్రహరీ గోడ ఉంటుంది. లోపల మొత్తం గులాబీమయమే. బ్రిటిష్ యువరాజు ఎడ్వర్డ్ 1876లో భారత్‌లో పర్యటించాడు. ఆ యువరాజుకి ఘనస్వాగతం పలకడానికి జయ్‌పూర్ రాజు సవాయ్రామ్సింగ్ ప్రతి నిర్మాణానికీ గులాబీ రంగు వేయించాడు. పింక్‌సిటీ అనే పేరు అప్పటి నుంచే వచ్చిందంటారు. నగరం మొత్తం రాజస్థానీ, మొఘల్ నిర్మాణశైలుల సమ్మేళనం. ప్యాలెస్‌లలో తోటలు చక్కటి ప్రణాళికతో ఉంటాయి. వెల్కమ్ టు సిటీప్యాలెస్! సిటీప్యాలెస్కి స్వాగతమందిరం ముబారక్మహల్. ఇక్కడి నుంచి ముందుకెళ్తే రెండవ మాన్ సింగ్ మ్యూజియం కనిపిస్తుంది. రాజకుటుంబాల జీవనశైలికి ప్రతీక ఇది. ఎంబ్రాయిడరీ దుస్తులు, బెనారస్ పట్టుచీరలు, రాజులు ధరించిన పైజామాలు, ఛోగాలు(చొక్కాలు), జమావర్ శాలువాలు, వడ్డాణాలు... చూడడానికి ఓపిక నశిస్తుంది తప్ప అవి తరగవు. రాజపుత్రులు ఆజానుబాహులు అనడానికి నిదర్శనం మొదటి మాధోసింగ్ దుస్తులే. ఈ రాజు ఏడడుగుల పొడవు ఉండేవాడని నిర్ధారిస్తున్నట్లు ఉంటాయి ఇవి. మహారాణి ప్యాలెస్‌లోని ఆయుధాగారంలో ఐదు కిలోల బరువైన కత్తి ఉంటుంది. రాజపుత్రులు... జానపద కథల్లో విన్నంతటి బలశాలులే అని రుజువుచేస్తున్నట్లుగా ఉంటుందీ ఈ భారీ ఖడ్గం. రాజులు వార్థక్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వాహ్యాళికెళ్లేప్పుడు ఉపయోగించే చేతికర్రలు కూడా ఉంటాయి. మరో సెక్షన్లోకి అడుగుపెడితే ఫిరంగులు, డబుల్ బ్యారెల్గన్, పిస్టల్లు ఉంటాయి. ఇక్కడ కనిపించే నెమలిపిడికత్తులు, పర్షియా ఆయుధాలు, దక్కనులో వాడే చేతి విల్లంబులు, బాణాలు... ఒక ఎత్తయితే కెంపులు, మరకతాలు పొదిగిన కత్తి మరో ఎత్తు. ఇది మహారాజా సవాయ్ రామ్‌సింగ్‌కు బ్రిటిష్ రాణి విక్టోరియా బహూకరించిన కత్తి. మ్యూజియం దాటి బయటకు వస్తే... గైడ్ వెంటే పర్యాటకుల అడుగులు దివాన్ ఈ ఖాస్, దివాన్ ఇ ఆమ్ వైపు పడతాయి. ఇవి రాజు ఆంతరంగికులను, ప్రజలను కలిసే మందిరాలు. దివానీ ఆమ్ (ఆర్ట్ గ్యాలరీ) పై కప్పుకి ఉన్న చిత్రలేఖనాలలో పొదిగిన రంగురాళ్లు ఇప్పటికీ మెరుపులీనుతుంటాయి. పెద్ద క్రిస్టల్ షాండ్లియర్ చూపుతిప్పుకోనివ్వదు. గ్యాలరీలోని చిత్రలేఖనాలలో రామాయణ సన్నివేశాలే ప్రధానం. మరికొంచెం ముందుకుపోతే చంద్రమహల్... ఈ మందిరం నుంచి గోవింద్‌జీ ఆలయం కనిపిస్తుంది. కృష్ణుని భక్తులైన రాజపుత్రులు ఆలయం కనిపించేటట్లు ఈ మహల్‌ను కట్టించుకున్నారు. రికార్డుకెక్కిన వెండికూజాలు! సిటీప్యాలెస్‌లో అత్యంత ఆకర్షణీయమైనవి వెండికూజాలు. మహారాజా రెండవ మాధోసింగ్ యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు రెండు కూజాల్లో గంగనీరు తీసుకెళ్లాడు. ఒక్కో కూజా సామర్థ్యం తొమ్మిది వేల లీటర్లు. యూరప్ పర్యటన కోసమే ఈ కూజాలను చేయించారు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద వెండి పాత్రలుగా గిన్నిస్ బుక్‌లో రికార్డుకెక్కాయి. జంతర్‌మంతర్! ఇది ఖగోళశాస్త్ర ప్రావీణ్యానికి ప్రతీక. ఢిల్లీ జంతర్‌మంతర్‌కి మాతృక కూడ. సవాయ్ జయ్సింగ్ నిర్మించిన ఐదు అబ్జర్వేటరీల్లోకి ఇదే పెద్దది (మిగిలినవి వారణాసి, ఉజ్జయిని, మధురలలో). ఇక్కడి నుంచి బయటకు వెళ్తే స్వాగతం పలికే నిర్మాణం హవామహల్. జయ్‌పూర్‌కి చిహ్నంగా పరిగణించే హవామహల్ కృష్ణుని కిరీటాన్ని పోలి ఉంటుంది. గవాక్షాల మాటున ఉన్న గదుల్లోంచి రాణివాసపు స్త్రీలు నగరంలో జరిగే వేడుకలు చూసేవారు. ఇక్కడి నుంచి జయ్‌ఘర్ ఫోర్ట్‌లో అడుగుపెడితే రాజమందిరాలు, ఉద్యానవనాలు, రిజర్వాయర్లు, ధాన్యాగారం, ఆయుధారాగం, ఆలయాలు ఉంటాయి. ఇది ఉంది అది లేదు అనడానికి వీల్లేనంత పకడ్బందీగా ఉంటాయి ఈ కోటలు. జగత్ శిరోమణి ఆలయంలో భక్తమీరా కొలుస్తున్న కృష్ణుని విగ్రహం ఉంటుంది. తొలి రాజధాని అంబర్! రామ్ నివాస్ గార్డెన్లో ఆల్బర్ట్ హాల్ ఉంది. ఈజిప్టు మమ్మీ, పర్షియాలో తయారైన బంగారు తివాచీ ప్రధాన ఆకర్షణలు. జయ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపుగా పదికిలోమీటర్లు ప్రయాణిస్తే అంబర్ కోట వస్తుంది. జయ్‌పూర్ నిర్మాణానికి ముందు పాలన ఈ కోట నుంచే జరిగేది. ఏనుగు అంబారీ ఎక్కి కోట మీదకు వెళ్లవచ్చు. ఈ పర్యటనలో సున్నితత్వం అంతా సిసోడియా రాణీకా బాఘ్లోనే కనిపిస్తుంది. ఈ గార్డెన్ జయ్‌పూర్‌కి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఆగ్రా రూట్లో వస్తుంది. సవాయ్ జయ్సింగ్... సిసోడియా యువరాణిని మనసు పడి వివాహమాడి, ఆమెకు ఇష్టమైనట్లు ఉద్యానవనాన్ని నిర్మించాడు. రాణి కాలు కింద పెట్టకుండా ఉద్యానవనంలో విహరించేటట్లు టై గార్డెన్ ఏర్పాటు చేశాడు. రాజుకు ప్రేమ ఎక్కువైతే ఇలాగే ఉంటుందేమో. ఎలా వెళ్లాలి? సమీప విమానాశ్రయం: జైపూర్. హైదరాబాద్ నుంచి జైపూర్‌కి ఎకానమీ క్లాస్ విమానం టిక్కెట్టు రూ5000. సమీప రైల్వేస్టేషన్: జైపూర్ జంక్షన్. కాచిగూడ నుంచి జైపూర్ జంక్షన్‌కి నార్త్‌వెస్టర్న్ రైల్వే రైళ్లు ఉన్నాయి. మైసూర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి జైపూర్‌కి టిక్కెట్టు ధరలు స్లీపర్‌లో రూ600, ఏసీ త్రీటైర్‌లో రూ 1500, ఫస్ట్‌క్లాస్‌లో రూ 4000 ఉంటాయి. సికింద్రాబాద్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దాదాపుగా ఇంతే. ప్రయాణం 30 గంటలు. రాజు యూరప్ పర్యటన ముగించుకుని జయ్‌పూర్ చేరే వరకు తాగడానికి కావలసిన నీటిని ఖండాంతరాలకు తరలించారు. ఎప్పుడు వెళ్లవచ్చు? అక్టోబర్, నవంబర్, మార్చి నెలలు సౌకర్యం. ఎక్కడ ఉండాలి? హోటల్ పెర్ల్ ప్యాలెస్... ఒక రోజు డబుల్ రూమ్ (షేరింగ్ బాత్రూమ్) అద్దె రూ350, ఏసీ డబుల్ రూమ్ రూ950, ఫ్యామిలీ రూమ్ (4-6 బస) రూ1,100. వీటిలో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉండదు. అనురాగ్ విల్లా... నాన్ఏసీ డబుల్ రూమ్ రూ800, సూపర్ డీలక్స్ గార్డెన్ వ్యూ గదికి రూ2000. రామ్‌బాఘ్ ప్యాలెస్‌లో బస చేయాలంటే ఒక రోజుకి 19 వేలు. వీటితోపాటు ఒక రాత్రికి ఆరేడు వందలు చార్జ్ చేసే వినాయక్ గెస్ట్‌హౌస్ వంటివీ ఉన్నాయి. భోజనం ఎలా? రాజస్థాన్ సంప్రదాయ భోజనం రుచి చూడాలంటే జోరి బజార్‌లోని ఎల్ఎంబి రెస్టారెంట్‌కి, స్వీట్స్‌కి రావత్ మిస్థాన్ భండార్‌కి వెళ్లాలి. గుజరాతీ రుచుల కోసం అన్నపూర్ణ, పనీర్ బటర్ మసాలా కోసం ‘సూర్య మహల్’, విదేశీ రుచులకు ‘కాపర్ చిమ్నీ’, ఇటాలియన్ పిజ్జా తినాలంటే పిజ్జాహట్, చిరుతిళ్లకు ఇండియన్ కాఫీ హౌస్‌కు వెళ్లవచ్చు. వాతావరణం? ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతాయి. జూన్ - సెప్టెంబరు వర్షాకాలం. అక్టోబర్, నవంబరు ఆహ్లాదంగా ఉంటుంది. డిసెంబర్ - ఫిబ్రవరిఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోతాయి. మార్చిలో బావుంటుంది. ఇంకా ఏమేం చూడవచ్చు? విద్యాధర బాఘ్... రెండవ జయ్సింగ్ కొలువులో ప్రధాన వాస్తుశిల్పి విద్యాధరుడు. సిసోడియా రాణి కా బాఘ్ వంటి అద్భుత నిర్మాణాల రూపకర్త. అందుకే ఒక ఉద్యానవనానికి విద్యాధరుడి పేరు పెట్టారు. జల్‌మహల్... మన్సాగర్ మధ్యలో ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడికి వలస పక్షులు వస్తాయి. ఏమేమి కొనవచ్చు... ఎక్కడ కొనాలి? జైపూర్ చెప్పులకు (జూటీ) రామ్‌గంజ్ బజార్, టై అండ్ డై దుస్తులకు కృష్ణపాల్ బజార్, అలంకరణ వస్తువుల కు మనిహారన్ కా రాస్తా, తివాచీలకు సుభాష్ చౌక్, మార్బుల్ కళాకృతులకు ఖజనో కా రాస్తా, హస్తకళలు, నీలిరంగు పింగాణీ వస్తువుల కోసం సంగనెర్ గ్రామానికి వెళ్లాలి. ఒంటె చర్మంతో చేసిన బ్యాగ్‌లు, చెప్పులు, పర్సులకు విదేశాల్లో డిమాండ్. ఇక జయ్‌పూర్ కుందన్, జేడ్ ఆభరణాల దుకాణాలు ఇక్కడ చాలానే ఉంటాయి.