సాక్షి, ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసం పోటాపోటీ నడుస్తుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు మూడు రో జుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది.
ఈ స్థానం కోసం 15 నుంచి 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తుది జాబితా వివరాలు తెలి యరాలేదు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పరిశీలన తర్వా త స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల పేర్లు చేరుతాయి. అక్కడ వడపోత అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి చేరుతుంది. ఆతర్వాత అభ్యర్థి ఎంపికను ఏఐసీసీ ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ఎస్టీలో ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గాల్లో ఎవరికిస్తారనే దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది.
పలువురు ఉదోగ్యుల యత్నాలు..
కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, నిర్మల్ జిల్లా కుబీర్‌కు చెందిన ఐటీశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ ప్రకాశ్, ఉట్నూర్ అదనపు డీఎంహెచ్‌వో కుమురం బాలు, ఐటీడీఏ పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఐటీడీఏ బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మేస్రం మనోహర్, పరిశ్రమల శాఖ రిటైర్డ్ అధికారి రాంకిషన్, ఆదిలాబాద్ ఎల్‌ఐసీ ఉద్యోగి దౌలత్‌రావు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఆదివాసీ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డిప్యూటీ తహసీల్దార్ మే స్రం బాబురావు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉట్నూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి రోషన్, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సబావత్ శ్రీనివాస్ నాయక్‌తో పాటు నరేశ్‌జాదవ్, శ్రావణ్ నాయక్ శనివారం దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీ పరంగా..
కాంగ్రెస్ పార్టీ పరంగా పలువురు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానంపై ఆశతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా శాసన సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ దిశగా తనకు పోటీకి అవకాశం ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై న ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ మరోసారి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ మాజీ నాయకులు శ్రావణ్ నాయక్ టికెట్ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. ఉట్నూర్ ఎంపీపీ పంద్రం జైవంత్‌రావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నా రు. శాసనసభ ఎన్నికల్లో బోథ్ నుంచి పోటీ చేసిన అడె గజేందర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా పార్టీపరంగా పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారి సంఖ్య 15 నుంచి 20 మంది ఉండటంతో అధిష్టానం ఎవరి వైపు దృష్టి సారిస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment