Jaidev
-
రవికి విజయం ఖాయం!
– దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘‘నా వందో చిత్రంలో హీరో బన్నీ అని ఎప్పుడో డిసైడ్ అయ్యా. అప్పుడు బన్నీ సింగిల్ ఏ.. ఇప్పుడు డబుల్ ఏ.. బన్నీని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి, మాళవిక జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్‌కుమార్ నిర్మించిన ‘జయదేవ్’ ఈ నెల 30న విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను విశాఖలో నిర్వహించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘మనకు మంచి జరగాలని గుళ్లోకి వెళ్లినప్పుడు గంట కొడతాం. గంటా శ్రీనివాసరావుకి అన్నింట్లో జయమే. అలా గంటా రవికి కూడా జయమే. టైటిల్లో, డైరెక్టర్ పేరులోనూ జయం ఉంది. ఇంతకన్నా ఈ సినిమాకి కావాల్సింది ఏముంది? యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘గంటా శ్రీనివాసరావుతో మాది పర్సనల్‌గా, పొలిటికల్‌గా లాంగ్ జర్నీ. చిరంజీవిగారిపై ఆయనకు ఉండే ఇష్టం నన్ను గంటాను ఎక్కువ ఇష్టపడేలా చేసింది. మా నాన్న (అల్లు అరవింద్) గారికి మంచి ఫ్రెండ్ ఆయన. ‘జయదేవ్’ రవికి మంచి బ్రేక్ ఇచ్చి, గొప్ప భవిష్యత్ అవ్వాలని కోరుకుంటున్నా. సభాముఖంగా జయంత్గారు అని పిలుస్తున్నాను. కానీ పార్టీలో, పబ్బుల్లో మేమిద్దరం వేరేలా పిలుచుకుంటాం. మేం అంత క్లోజ్ ఫ్రెండ్స్’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి, వారి అబ్బాయిని నా చేతుల్లో పెట్టినందుకు గంటా శ్రీనివాసరావు, శారదలకు కృతజ్ఞతలు. రవి, మాళవికలకు మనస్ఫూర్తిగా ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి’’ అన్నారు జయంత్ సి. పరాన్జీ.‘‘మ్యూజిక్ సూపర్‌హిట్ అయింది. ప్రతి ఒక్కరూ ‘జయదేవ్’ గురించి మాట్లాడుతున్నారు. నాకు, జయంత్‌కి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది’’ అన్నారు అశోక్‌కుమార్. గంటా రవి మాట్లాడుతూ – ‘‘ఈరోజు నేనీ స్టేజిపై నిలబడ్డానంటే కారణం నా తల్లిదండ్రులే. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన జయంత్గారు, అశోక్కుమార్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు దంపతులు, కథానాయిక మాళవిక, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు, కెమెరామేన్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం
-
లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం...
‘‘సినిమాపై ఇష్టంతో ఇక్కడకు చాలామంది వస్తుంటారు. 24 శాఖల్లో ఏదో ఒక శాఖలో తమ సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతుంటారు. కానీ... అర్హతలెన్ని ఉన్నా అవకాశాలు మాత్రం రావు. అలాంటి వారికి అండగా ఉంటూ... ప్రోత్సహించడమే మా సంస్థ ప్రధాన లక్ష్యం’’ అంటున్నారు లాస్ ఏంజిల్స్ టాకీస్ వ్యవస్థాపకులు జయదేవ్, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి, వెన్ అల్లూరి. ఈ సంస్థపై అమెరికాలో కూడా పలు చిత్రాలను నిర్మించిన వీరు... తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సంస్థ లోగోను హైదరాబాద్‌లో డా. డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. నిర్మాతల్లో ఒకరైన జయదేవ్ మాట్లాడుతూ- ‘‘సినిమా అంటే నాకిష్టం. నాకున్న వ్యాపారాలతో పాటు సినీరంగంలో కూడా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో మిత్రులతో కలిసి లాస్ ఏంజిల్స్ టాకీస్ సంస్థను స్థాపించాను. మేమేంటో నిరూపించుకోవడానికి అందరూ కొత్తవాళ్లతో ‘రన్’ అనే సినిమాను లాస్ ఏంజిల్స్‌లో చేశాం. ఇక్కడ ‘గాలిపటం’ అనే సినిమాతో టైఅప్ అయ్యాం. అంతేకాదు పలు చిత్రాలకు క్వాలిటీతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసి పెడతాం. అమెరికా ‘ట్రిబెకా ఫిలిం ఫిలిం ఫెస్టివల్స్’లో తెలుగు సినిమాను ప్రదర్శింపజేయడం మా లక్ష్యం’’ అని చెప్పారు. తెలుగు సినిమా అభ్యున్నతిలో పాలుపంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ‘లాస్ ఏంజిల్స్ టాకీస్’ సంస్థకు అల్లు అరవింద్, అశ్వనీదత్, సంపత్‌నంది, నిఖిత, స్వప్న శుభాకాంక్షలు అందించారు. -
జయదేవ్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, ముంబై: తమ తండ్రి దివంగత బాల్‌ఠాక్రే ఆస్తుల వివాదం పరిష్కారమయ్యేవరకు ఉద్ధవ్ ఠాక్రే అధీనంలో ఉన్న ఆస్తులు విక్రయించరాదని పెద్ద కుమారుడు జయదేవ్ ఠాక్రే దాఖలుచేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్ధవ్‌కు కొంతమేర ఊరట లభించింది. ప్రస్తుతం బాల్‌ఠాక్రే ఆస్తులన్నీ ఉద్ధవ్ అధీనంలో ఉన్నాయి. ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై ఉద్ధవ్ హైకోర్టులో ‘ప్రొబేట్’ దాఖలు చేశారు. దీన్ని జయదేవ్ ఠాక్రే ‘నోటీస్ ఆఫ్ మోషన్’ ద్వారా కోర్టులో సవాలు చేశారు. ఉద్ధవ్ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన అధీనంలో ఉన్న ఆస్తుల న్నీ విక్రయించే ప్రమాదముందని,వాటిని విక్రయిం చకుండా ఆదేశాలివ్వాలని జయదేవ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. కాగా, బాల్‌ఠాక్రే చనిపోయిన కొద్దిరోజులకే ఆస్తుల విషయమై ఉద్ధవ్, జయదేవ్‌ల మధ్య వాగ్వాదం మొదలైంది. తన తండ్రి రాసిన వీలునామాలో ఆయన సంతకం లేదని, ఆ వీలునామా తప్పుల తడకగా ఉందని జయదేవ్ పిటిషన్లో పేర్కొన్నారు. మరాఠీ భాష అభ్యున్నతి కి పాటుపడే ఆయన ఆంగ్లంలో వీలునామా రాయడమేంటన్నారు. స్థిరాస్తులు, చరాస్తులు బ్యాంక్‌లో డిపాజిట్, ఇలా మొత్తం రూ.14.85 కోట్లు మాత్రమే ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొనడం అనుమానంగా ఉందన్నారు.తన తండ్రి నివాసముంటున్న బాంద్రా లోని మాతోశ్రీ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.40 కోట్లకుపైనే ఉంటుందని, ఇంకా చాలా ఆస్తులు ఉన్నా వాటిని ఉద్ధవ్ వీలునామాలో చూపించలేదని జయదేవ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, రుజువులు చూపించాలని జయదేవ్‌ను కోర్టు కోరింది. కానీ ఆస్తులను ఉద్ధవ్ రహస్యంగా విక్రయించే అవకాశాలున్నాయని ముందుగానే గ్రహించిన జయదేవ్ హైకోర్టులో దాఖలు చేసిన నోటీస్ ఆఫ్ మోషన్‌ను తిరస్కరించింది.