విద్యుదాఘాతంతో రైతు మృతి
అలుగనూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. కర్ర జలపతిరెడ్డి(50) అనే రైతు పంటకు నీళ్లు పట్టేందుకు మోటరు స్విచ్ ఆన్ చేస్తుండగా జే వైరు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆరెకరాల్లో పంట సాగు చేసుకుంటున్నాడని గ్రామస్తులు తెలిపారు.