jamat ud dawah
-
ఉగ్రవాదులకు పాక్‌సైన్యం శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం శిక్షణ అందిస్తోందన్న ఆరోపణలకు మరోసారి బలమైన సాక్ష్యం లభించింది. నవంబర్ 24న కశ్మీర్లో భద్రతాబలగాలకు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్ఐఏ విచారణలో చెప్పారు. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన ఉగ్రసంస్థ జమాతే ఉద్ దవా తనకు ఉగ్రశిక్షణ ఇచ్చిందని.. ఎన్ఐఏకు తెలిపారు. అలాగే పాకిస్తాన్ సైన్యం.. మిలటరీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు భారత్లోరి రహస్యంగా పంపిందని ఎన్ఐఏ అధికారులుకు వివరించారు. ఇదిలా ఉండగా అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అమీర్ బెన్ రియాజ్ అలియాస్ అబు హమాస్‌గా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని కరాచీ అతని స్వస్థలమని పోలీసులు చెబుతున్నారు. హహీజ్ సయీద్ గృహ నిర్భంధం తరువాత భారత్‌పై మళ్లీ భారీ దాడికి పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక మిలిటెంట్‌ను భద్రతాధికారులు పట్టుకోవడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
'అమెరికా డార్లింగ్' వ్యాఖ్యలపై హఫీజ్ గుస్సా
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి, జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రభుత్వానికి చుక్కులు చూపిస్తున్నాడు. న్యూయార్క్‌లో తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పాక్ విదేశాంగమంత్రిపై పరువునష్టం దావా వేశాడు. 10కోట్ల రూపాయలకు ఖవాజ ఆసిఫ్‌పై క్రిమినల్ దావా ఫైల్ చేశాడు. న్యూయార్క్‌లో జరిగిన ఆసియా దేశాల ఫోరంలో మాట్లాడిన ఆసిఫ్.. 'డార్లింగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' అంటూ హఫీజ్ సయీద్‌ని అభివర్ణించారు. హక్కాని నెట్వర్క్, లష్కరేతోయిబా వంటి ఉగ్రసంస్థలు పాక్‌కు గుదిబండలుగా తయారయ్యారని ఆయన అంగీకరించారు. ఆ ఉగ్రమూకల నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం శత్రువుగా చూస్తున్న హఫీజ్ సయీద్‌ను గతంలో అమెరికాకు ఎంతో ప్రియమైన వ్యక్తి అన్న విషయం మరచిపోకూడదని వ్యాఖ్యానించారు. ముస్లిం సంప్రదాయాలను పక్కగా పాటించే తనను 'అమెరికా డార్లింగ్'గా పేర్కొనడాన్ని తప్పుబడుతూ.. ఖవాజి ఆసిఫ్‌పై హఫీజ్ పరువునష్టం దావా వేశాడు. -
బావమరిదికి పగ్గాలు!
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు కొత్త బాస్ వచ్చాడు. ఇప్పటివరకు అధినేతగా ఉన్న హఫీజ్ సయీద్ గృహనిర్బంధంలో ఉండటంతో.. అతడి బావమరిది హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఆ సంస్థకు అధిపతిగా నియమించారు. అతడిని పట్టిస్తే 13 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. కొత్త బాస్ మక్కీ అన్న విషయాన్ని జమాత్ ఉద్ దవా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మక్కీ జేయూడీలో నెంబర్ 2గా ఉన్నాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలోనే ఉన్నా.. ఇంటి నుంచే హఫీజ్ సయీద్ కార్యకలాపాలు సాగిస్తున్నాడన్న వదంతులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని జేయూడీ ఖండించింది. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలూ మక్కీయే చూసుకుంటున్నాడని చెప్పింది. హఫీజ్ సయీద్ నిర్బంధం తర్వాతి నుంచి ఇప్పటివరకు మక్కీ లాహోర్ నగరంలో దాదాపు ఆరు ర్యాలీలు నిర్వహించాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం జమాత్ ఉద్ దవాతో పాటు మరో నలుగురు జేయూడీ నేతలను, ఫలా ఎ ఇన్సానియత్ నేతలను 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ రెండు సంస్థలకు చెందిన పలు కార్యాలయాలను కూడా మూసేశారు. ఈ రెండింటినీ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పరిశీలనలో ఉంచారు. సయీద్ గృహనిర్బంధం తర్వాత జేయూడీ తన పేరు మార్చుకుంది. 'తెహరీక్ ఆజాదీ జమ్ము కశ్మీర్' అనే కొత్త పేరుతో దీని కార్యకలాపాలు నడుస్తున్నాయి.