జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన
ఆగస్టు 15 నుంచి మొదలు.. ఉదయం 8 గంటలకు షురూ
ఇక ఎక్కడివారు అక్కడే సెల్యూట్
జమ్మికుంట(హుజూరాబాద్): స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పంద్రాగస్టును పురస్కరించుకొని జమ్మికుంట ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అలాగే, ఎక్కడి ప్రజలు అక్కడ సెల్యూట్ చేస్తారు.
పట్టణ సీఐ ప్రశాంత్‌రెడ్డి ఆలోచనల్లోంచి ఈ కొత్త ఒరవడిని మంగళవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా జమ్మికుంటలో రోజూ ఉదయం 8 గంటలకు మొత్తం 11 చోట్ల ఏర్పాటు చేసిన మైకుల్లో ‘జనగణమణ’ వినిపిస్తారు. ఈ సమయంలో పట్టణ ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే సెల్యూట్ చేస్తూ.. జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇలా రోజూ ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపించి, సెల్యూట్ చేయడం దేశంలోనే తొలిసారిగా జమ్మికుంట వేదిక కానుంది.