Jamili election
-
అధికార కేంద్రీకరణకు మార్గంగా.. జమిలి ఎన్నికలు
‘ఒకే దేశం – ఒకే సంస్కృతి – ఒకే పన్ను’ అంటూ నిరంతరం ప్రచారం చేసే అధికార బీజేపీ ఇప్పుడు ‘జమిలి ఎన్నికల’కు సన్నద్ధమవు తోంది. కేంద్ర మంత్రి వర్గం ఇటీవల జమిలి ఎన్నికలకు ఆమోదాన్ని తెలిపింది. దేశంలో సవివరమైన చర్చ జరగకుండానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలను పూర్తిగా సమర్థించేవారే కమిటీలో ఉన్నప్పుడు అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యంకాదనీ, ఇది అధికార కేంద్రీ కరణకు మార్గాన్ని సుగమం చేయడమేననీ, మన దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక సూత్రా లపైన దాడి చేయడమేననీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో తరచూ ఏదో ఒక ఎన్నిక జరుగు తున్నందు వల్ల అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందనేది ఒక అభిప్రాయం. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందనీ, దీనికి మన జీడీపీ గణాంకాలే రుజువనీ ప్రభుత్వ పెద్దలు చెబు తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజంగా సరైనవనుకుంటే అభివృద్ధికి తరుచూ జరిగే ఎన్నికలు ఎలా ఆటంకమవుతాయి? దేశం ముందున్న మౌలిక సవాళ్ళ నుండి జనం దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారనేది ఒక విమర్శ. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనేది సమర్థకుల మరో వాదన. ఈ వాదనను సరిగ్గా విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023–24 సంవత్సరానికి ఎన్నికల కోసం కేంద్రం కేటాయించింది కేవలం రూ. 466 కోట్లు మాత్రమే. పైగా అది ఎన్నికల సంవత్సరం కాబట్టి. అదే 2022–23 సంవత్సరానికి కేటాయించినది రూ. 320 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు కూడా ఎన్నికల ఖర్చును భరిస్తాయి. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న కేంద్రానికి ఈ ఎన్నికల ఖర్చు నిజంగా పట్టించుకోవలసినది కాదు. నిజానికి జమిలి ఎన్నికలు జరిపితేనే ఖర్చు పెరుగుతుంది. ఈ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో ఈవీఎమ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని, రక్షణసిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి.ఎన్నికలు తరచూ జరగడం వల్ల ఇప్పటి వరకూ విధానపర నిర్ణయాలు చేయడంలో ఏనాడూ ఆటంకమేర్పడలేదు. ప్రజల ప్రయోజనాలకు, వారి స్వేచ్ఛకు జమిలి ఎన్నికలు విఘాతమే. ప్రభుత్వాల దూకుడుకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కళ్ళెం వేసేది ప్రజలు మాత్రమే. జమిలి ఎన్నికల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి వెంటనే మరణిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీ మధ్యలో మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయమేమిటి? అటువంటి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతం అవుతుందా?చదవండి: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?అందుకే జమిలి ఎన్నికలకు బదులు, ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టి దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలి. పార్టీల మ్యానిఫెస్టోలను, వారి విధానాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాజకీయ పార్టీలకు ప్రజలు ఓటు వేయడం న్యాయసమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రస్తుత పద్ధతిలో రాజకీయ పార్టీలకు లభించిన ఓట్ల శాతం, ఆయా పార్టీలు గెలిచిన సీట్లకు ఉన్న తేడా అసంబద్ధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రక్రియను అమలు చేసే ఆలోచనను విరమించి ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పరిరక్షణకు అవసరమైన అన్ని మార్పులను మన రాజకీయ వ్యవస్థ చేపట్టాలి. అధికార బీజేపీ దీనికి ముందుగా చొరవ చూపాలి.- వి.వి.కె. సురేష్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి -
జమిలి ఎన్నికలకు కేంద్రం ఓకే.. త్వరలో దేశం మొత్తం ఎన్నికలు..
-
జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇదీ చదవండి: Tender Voting: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? -
విశాఖలోనూ సీఎం క్యాంపు కార్యాలయం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై కొంత కాలంగా సాగుతున్న చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరదించారు. విశాఖపట్నంలోనూ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, దసరా నుంచి పరిపాలన ప్రారంభిద్దామని మంత్రులకు స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం మొదలు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను గుర్తించేందుకు అధికారులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపునకు అధికారులతో మరో కమిటీ వేస్తామన్నారు. దసరాలోగా కార్యాలయాలను తరలించి.. పండుగ రోజునే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిశాక సమావేశం నుంచి అధికారులు నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రులతో సీఎం వైఎస్ జగన్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దసరా పండుగను విశాఖపట్నంలోనే జరుపుకుందామని మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామనడంతో మంత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమాలను సాక్ష్యాధారాలతో వివరిద్దాం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. గురువారం నుంచి నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శాసనసభ వేదికగా అవసరమైతే టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలపై.. స్కిల్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ కుంభకోణం వరకు అన్నింటిపై చర్చిద్దామన్నారు. టీడీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ అక్రమాలను సాక్ష్యాధారాలతోసహా ప్రజలకు వివరించడానికి సమావేశాలను ఉపయోగించుకుందామని ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లగా.. జమిలి ఎన్నికలపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉందనే అంశాన్ని మంత్రులకు సీఎం గుర్తు చేస్తూ.. ప్రజల్లో విస్తృతంగా తిరగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ 52 నెలలుగా మనం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని.. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను కళ్లకు కట్టినట్లు వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని దసరా నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడదామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది మా విధానం. విశాఖపట్నంలో సీఎం కార్యాలయం నుంచి వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించేందుకు అధికారులతో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. దసరా నుంచి విశాఖే పరిపాలన రాజధాని. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి. -
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!
‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ప్రధాని’ అని కేంద్రంలోని అధికార బీజేపీ గత కొంతకాలంగా నినదిస్తూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై లా కమిషన్‌ను గిల్లుతూనే ఉంది. తరచూ ఎన్నికల వల్ల పడే ఖాజానా భారాన్ని తప్పించడానికీ, జన జీవితానికి విఘాతం కలగకుండా చూడటానికీ జమిలి ఎన్నికలే తరుణోపాయం అని చెబుతోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాలనా పరిస్థితులు అస్తుబిస్తుగా ఉండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణం. ఈ తరహా ఎన్నికల నిర్వహణ ద్వారా ఏకపక్ష పాలనకూ, ఏక వ్యక్తి నియంతృత్వ పోకడలకూ ప్రయత్నిస్తోందనే అనుమానాలు బలంగానే ఉన్నాయి. నిర్ణీత తేదీ రాకముందే 2024లో జరగాల్సిన ఎన్నికలు జరుగుతాయా? ఈ ‘నడమంత్రపు’ ఎన్నికల కోసం బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు తహతహలాడటం ఇవాళ అర్ధంతరంగా పుట్టిన ‘పుండు’ కాదు. 2014లో ప్రధానమంత్రి పదవిని నరేంద్ర మోదీ చేపట్టిన రోజు నుంచీ ‘ఒక దేశం, ఒక ఎన్నిక, ఒక ప్రధాని’ నినాదం కొనసాగుతూనే ఉంది. గత ఎనిమిదేళ్లుగా తనకు వీలు చిక్కినప్పుడల్లా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయమై కేంద్ర ‘లా కమిషన్’ను పదేపదే గిల్లుతూ వచ్చారు మోదీ. అదే విషయాన్ని బీజేపీ న్యాయ శాఖామంత్రి కిరెన్ రిజిజూ (22 జూలై 2022) లోక్‌సభలో ప్రకటిస్తూ, జమిలి ఎన్నికలు జరిపే అంశాన్ని పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇందుకు ‘కారణాల’ను పేర్కొంటూ, తరచూ ఎన్నికల వల్ల సాధారణ జన జీవితానికి విఘాతం కలుగుతోందనీ, ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయనీ అన్నారు. వీటికితోడు ఖజానాపై భారం పడుతోంది కాబట్టి, జమిలి ఎన్నికలు నిర్వహించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి చెప్పారు. జారిపోతున్న విలువలు అయితే దీనికి ప్రతిపక్షాలు స్పందిస్తూ, ‘ధరల పెరుగుదలపైనా, జీఎస్టీ రూపంలో రాష్ట్రాలపై పడుతున్న దుర్భర భారం పైనా’ ముందు చర్చ జరగాలని కోరాయి. బీజేపీ పాలకుల కోర్కె పైనే 21వ లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో ‘ఉప్పు’ అందిస్తూ, ఈ ‘చిట్కా’తో దేశం ‘తరచూ ఎన్నికల బెడద’ నుంచి విముక్తి అవు తుందని వత్తాసు పలికింది. ఇందుకు అనుగుణంగానే 22వ లా కమిషన్‌ను ‘ఏర్పాటు’ చేసిన పాలకులు – కమిషన్‌ను అధ్యక్షుడు, ఇతర సభ్యులు లేకుండానే వదిలేసింది. ఫలితంగా కమిషన్ పదవీ కాలం మూడేళ్లూ గడిచిపోనుండటం పాలకుల దురుద్దేశానికి నిదర్శనం. ‘జమిలి’ ఎన్నికల ఎత్తుగడ వెనక బీజేపీ పాలనలో ఒక్కొక్కటిగా జారిపోతున్న ప్రజాస్వామిక విలువలు ఉన్నాయని మరచిపోరాదు. విచిత్రమేమంటే, మోదీ కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులలో కనీసం 42 శాతం మంది తమపైన క్రిమినల్ కేసులున్నాయని బాహాటంగా ప్రకటించుకున్నారు. అయినా కొలది రోజులనాడు జరిగిన నూతన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా క్రిమినల్ కేసులతో మసకబారి పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వేసే ఓట్లు చెల్లనేరవని ప్రకటించే అధికారం తనకు ఉన్నా కూడా ఉన్నత న్యాయస్థానం గొంతు విప్పలేకపోయింది. ఏక పక్ష పాలనకేనా? 500 పైచిలుకు పార్లమెంట్ సభ్యులలో 250 మందికి పైగా అవినీతి పరులు ఉన్నారని, సాధికారికంగా రుజువులతో లెక్కదీసి దేశ ప్రజల ముందుంచిన అత్యున్నత విచారణ సంస్థల నివేదికలను ఇంతవరకూ కాదనగల ధైర్యం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకత్వానికి లేదు. ఇలాంటి సర్వవ్యాపిత పతన దశల్లో ఉన్న రాజ్యాంగ వ్యవస్థల నీడలో 2014లో ఢిల్లీ పీఠం ఎక్కిన మోదీ ప్రభుత్వం వచ్చీరావడంతోనే ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’ (ఆర్పీఏ)లో, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎలాంటి నేరానికి పాల్పడ్డా, చార్జిషీట్ అతనిపై నమోదై ఉన్నా ఏడేళ్లకు తక్కువ గాకుండా ఖైదు శిక్ష విధించాలన్న బిల్లును పక్కకు పెట్టేసింది. బీజేపీ ‘జమిలి’ ఎన్నికలకు అనుసరించబోతున్న వ్యూహానికి ఇది పక్కా నిదర్శనం. నేరస్థులైన రాజకీయవేత్తలు తమపై ఆరోపణలు రుజువయ్యే దాకా లేదా విడుదలయ్యేదాకా ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కారని తొలి చట్టం నిర్దేశించింది. ఈ చట్ట నిబంధనలున్న ముసాయిదా బిల్లును కాస్తా మోదీ ప్రభుత్వం పక్కకు నెట్టేయడం రానున్న ‘జమిలి’ ఎన్నికల ద్వారా ఏకపక్ష పాలనకు, ఏక వ్యక్తి నియంతృత్వ పోకడలకు ‘తాతాచార్యుల ముద్ర’ వేయడంగానే భావించాలి. అంతకుముందు, స్వాతంత్య్రం తర్వాత తొలి పాతిక ముప్పయ్యేళ్ల దాకా ‘పళ్ల బిగువుతో’ కాపాడుకుంటూ వచ్చిన రాజ్యాంగ నిర్దేశాలు, ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలు క్రమంగా ‘డుల్లి’పోతూ వచ్చాయి. అయినా బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలపై నమోదైన అనేక కేసులను స్వచ్ఛంద సంస్థ – ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) పదేపదే దేశ ప్రజల దృష్టికి తెస్తూనే ఉంది. ‘మసకబారి’ ఎన్నికైన సభ్యుల సంఖ్య 2007 నుంచీ మరీ రెట్టింపు అవుతోందని 2014 నుంచీ సుప్రీంకోర్టు కూడా మొత్తుకుంటూనే ఉంది. రబ్బరు స్టాంపు కాకూడదు గిరిజనుల నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలి. పాలకులకు ‘రబ్బరు స్టాంపు’గా మారకూడదు. దేశ జనాభాలో 2011 జనగణన ప్రకారం, 10 కోట్ల 40 లక్షలమంది ఆదివాసీ ప్రజలు (8.6 శాతం మంది) ఉన్నారని మరచిపోరాదు. అంతేగాదు, ఏడు రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు 2020లో కూడా వేధింపులకు గురి కావలసి వచ్చిందని జాతీయ స్థాయిలో నేరాలు నమోదు చేసిన తాజా నివేదిక వెల్లడించింది. అందుకే ‘సమత’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గనులు, ఖనిజాలు, ప్రజారక్షణ సంస్థ అధ్యక్షుడు రవి రెబ్బాప్రగడ... రాష్ట్ర పతిగా ద్రౌపదీ ముర్మూ షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను మరింతగా కాపాడాల్సిన అవసరాన్ని మరీమరీ గుర్తు చేస్తున్నారు. దళిత వర్గం నుంచి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా ఆ పదవిలోకి వచ్చేట్టు చేయగలిగింది భారతీయ జనతా పార్టీయే. అయినా దళితుల బతు కులు ఇసుమంత కూడా మెరుగు పడకపోగా, బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసమే ‘పావు చెక్క’గా వినియోగపడక తప్పలేదు. గతంలో దేశంలో విధించిన మద్య నిషేధం కాస్తా ఉన్నట్టుండి మధ్యలో మటుమాయమైనప్పుడు శ్రీశ్రీ వ్యంగ్య ధోరణిలో కాంగ్రెస్ ‘పొడి’ రాష్ట్రాలన్నీ ‘తడి’ చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ దశ కూడా దాటిపోయింది. ‘తురా’ పట్టణంలోని తన ‘ఫామ్ హౌస్’ను ‘వేశ్యా గృహం’గా మార్చాడన్న ఆరోపణపైన మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలింపును ఉధృతం చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ‘జమిలి’ ఎన్నికల ప్రతిపాదనపై కొంతకాలంగా బీజేపీ పట్టు పట్టడానికి – మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కర్ణాటక సహా పలు బీజేపీ రాష్ట్రాలలో పాలనా పరిస్థితులు అస్తుబిస్తుగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణం. ఈ సందర్భంగా భారతదేశ ప్రసిద్ధ జాతీయ పక్షపత్రిక ‘ఫ్రంట్ లైన్’ తాజా సంచిక ‘మహా సర్కస్’ మకుటంతో మహారాష్ట్ర పరిణామాలపై గొప్ప వ్యంగ్య చిత్రం ప్రచురించింది. మహారాష్ట్ర తర్వాత ప్రభుత్వాల్ని పడగొట్టే బీజేపీ తర్వాత పడగొట్టే రాష్ట్రమేది? అని ఆ చిత్రం ప్రశ్నించింది. ఈ సర్కస్ నడుపుతున్న వారిలో మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా మరోవైపు నుంచి ‘కమ్చీ’ ఝళిపిస్తూ ఇకమీదట ఉండేది ‘ఒకే భారత్, అదే బీజేపీ భారత్’ అని ముక్తాయింపు విసురుతాడు. అదే ‘నడమంత్రపు ఎన్నికల’కు వచ్చే ‘జమిలి భారత్’! 2024 వరకూ ప్రస్తుత పాలన కొనసాగకపోవచ్చు. ఈ అనుమానాల్ని రేకెత్తిస్తున్నది మరెవరో కాదు – తన ఉనికి అనుమానంలో పడిన రాజకీయ పార్టీయే, దాని పాలకులే! ‘గొంతెమ్మ కోర్కెలన్నీ ఎండమావుల నీళ్లే’నన్న సామెత రాజకీయ పాలకుల విషయంలో అక్షరసత్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జమిలి పోరాటాలు నేటి అవసరం
ఇప్పుడు దేశాన్ని చుట్టుముడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటి అన్ని కీలక సమస్యలను గాలికి వదిలేసి లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనే అంశమే అతి ప్రధాన సమస్య అయినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ, భారత్‌కి ఇప్పుడు కావలసింది మౌలిక సమస్యలపై జమిలి పోరాటాలే తప్ప జమిలి ఎన్నికలు కావని గ్రహించాలి. అలాగే ఏపీలో సాధారణ ప్రజానీకం తరపున పేదలకు అండగా సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపర్చేందుకు ప్రగతిశీల శక్తులు సిద్ధంకావాలి. ఇటీవలనే జమిలి (లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి) ఎన్నికల అంశాన్ని, అది మన దేశ ప్రజలముందున్న అతి తీవ్రమైన, తక్షణం పరిష్కరించవలసిన సమస్య అయినట్లూ.. దానిముందు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటివి చాలా చిన్న సమస్యలైనట్లు, ముందుకు తెచ్చి దానిపై చర్చించేందుకు ఎన్టీయే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక్కడో చిన్న మెలిక ఉంది. బీజేపీ ప్రభుత్వం ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అన్న అంశాన్ని ఎజెండాగా చేసింది. ఇది ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న అర్థంలో మన తెలుగు మీడియాలోకి వచ్చి చర్చలు జరిగాయి. నిజానికి దీని అసలు అనువాదం ‘ఒకేజాతి, ఒకే ఎన్నికలు’ అని చెప్పుకోవాలి. జాతి–దేశం సమానార్థకాలు కావు. భౌగోళికంగా సారూప్యత, ఒకే విధమైన వాతావరణం, ఆర్థిక నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలు అన్నింటినీ మించి ఒకే భాష కలిగిన ప్రజాసమూహాన్ని జాతి అంటాము. నిజానికి ఈ దేశంలో రాష్ట్రపతి గానీ, ప్రధాని గానీ, తమ మాతృభాషలో ప్రసంగిస్తే, మన దేశ జనాభాలో సగంమందికి అర్థం కాదు. అంటే ఒకే భాష ‘జాతి’కి ఒక సామాన్య అంశం. ఉదాహరణకు, మనది తెలుగుజాతి, అలాగే ద్రవిడ, మరాఠా, పంజాబీ, గుజరాతీ ఇలా మనదేశంలో వివిధ జాతులున్నాయి. మన జాతీయ గీతం జనగణమనలో కూడా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా అని మన దేశం వివిధ జాతుల సముదాయం అనే రాశారు. నా భారతదేశం జిందాబాద్, మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని సగర్వంగా నేను నినదిస్తాను. ఇలా ఒక దేశంలో ఎన్నో జాతులున్నట్లే, ఒకేజాతి ఎన్నో దేశాలలో ఉండవచ్చు. మన దేశ స్వాతంత్య్రోద్యమంలో, వివిధ జాతుల ప్రజానీకమూ, పరాయి, వలస బ్రిటిష్ దుర్మార్గ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా, తమ తమ పోరాటాలు సాగించారు. మన అల్లూరి, కొమరం భీం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, తమిళులకు వీరపాండ్య కట్టబొమ్మన, మరాఠాలకు శివాజీ, కన్నడిగులకు టిప్పుసుల్తాన్, ఇలా స్వాతంత్య్రం కోసం పోరాడిన వివిధ జాతుల వీరులెందరో ఉన్నారు. అయినా రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీ గాంధీజీ నాయకత్వాన దేశవ్యాపితంగా ప్రధానమైన పాత్ర పోషించిందనడం నిర్వివాదం! 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు, తొలి సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అనే పిలిచారు. నిజానికి భారత స్వాతంత్య్రోద్యమం ‘భారత జాతుల స్వాతంత్య్రోద్యమం’ అన్నమాట. ఈ వివిధ జాతులన్నీ బ్రిటిష్ వాడు ఏర్పర్చిన పాలనాపరమైన దేశంలాగా గాక, తమ జాతుల అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, భారతదేశంగా ఏకశిలాసదృశ్యమైన, రాజ్యాంగంగానే.. వివిధ రాష్ట్రాలుగా ఉన్న ఒక సమాఖ్య స్వరూపంగానే మన రాజ్యాంగం ఏర్పడింది. ఇప్పటికీ తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండులో జాతులు, ఉపజాతులు మన దేశంలో కళ్లముందు ఉన్న దృశ్యమే. ఇంత సువిశాల భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ సమయాలలో, ఎన్నికలు జరుగుతూ ఉండటం వలన, ఎన్నికల నియమావళి, పాలనాపరమైన ఇబ్బందులు, అధిక ధనవ్యయం, ఎప్పుడూ ఎన్నికల వాతావరణంతో అభివృద్ధి వెనకడుగు వేయడం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రాష్ట్రాల శాసనసభలకూ, దేశ లోక్‌సభకూ ఎన్నికలు నిర్వహించడం వలన మేలు జరుగుతుందన్న భావన ఉండవచ్చు. వాస్తవానికి మన రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అలా జమిలి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జమిలి ఎన్నికలకు సూత్రప్రాయమైన అంగీకారం తెలిపారు. తనకు అత్యంత ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పొందుపర్చవలసిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్న ఆకాంక్షను, అక్కడి అఖిలపక్ష సమావేశంలో మరోసారి వక్కాణించారు. అదీ ఆయన నిబద్ధత. వైవిధ్యభరితమైన వివిధ జాతుల ప్రత్యేకతలను బీజేపీ తృణీకరించి ప్రతిపాదించిన అఖండ భారత జాతి అన్న అవగాహనకు భిన్నంగా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ అంశం మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకే ఒక కమిటీ ఏర్పాటుకు అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. అంతేకాదు. జమిలి ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్ర ప్రాధాన్యతలు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, మొన్నటి మన శాసనసభ ఎన్నికలలో గత వెన్నుపోట్ల పార్టీ పాలనలోని అవినీతి, అసమర్థత, కులతత్వం, నయవంచన వంటి వాటిని అంతం చేయడం.. మన రాష్ట్రానికి, ప్రత్యేక హోదాతోసహా విభజన లాభాలను సాధించడం.. ఒక నిబద్ధత గల, ప్రజానురంజక, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ప్రధాన ఎజెండాగా వైఎస్ జగన్ నాయకత్వాన వైఎస్సార్సీపీ ఎన్నికల రంగంలోకి దిగి అద్భుత విజయాన్ని సాధించింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఈ అంశాలు పట్టలేదు. భారత జాతీయత, అఖండ భారతం అంటూ సామాజిక న్యాయసాధనను వ్యతిరేకిస్తూ మనుస్మృతి ఆధారిత, మతతత్వ నిచ్చెనమెట్ల వర్ణ(కుల) వ్యవస్థను నిలబెట్టడం ఎజెండా. అందుకే ప్రజలు, వెన్నుపోటు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేవిధంగా తిరస్కరించడమే కాక, బీజేపీ పార్టీకీ దాని భావజాలానికి రాష్ట్ర శాసనసభలో స్థానం లేకుండా చేశారు. కేవలం మాటలతోనూ, ప్రచారంతోనే కాదు.. ఆచరణలో మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా, పదహారు రోజుల పండుగ కూడా ముగియకుండానే, జగన్మోహన్రెడ్డి ఆచరణలో అడుగులు వేశారు. ఆయన పాలన ఆరంభించి అవినీతి రహిత పాలన దిశగా, నవరత్న పథకాల ఆచరణకు రూపు దిద్దుకునే రీతిలో రాష్ట్రం ముందడుగు వేయడం చూస్తున్నాం! వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థుల సంగతి ఎలా ఉండినా, దాదాపు యావదాంధ్ర ప్రజలు ఆశావహ రీతిలో అభినందించడమూ చూస్తున్నాం. ఒక్క సామాజిక న్యాయ అంశాన్నే తీసుకుందాం. ఎన్నడైనా, ఏ పార్టీ అయినా తన మంత్రివర్గ కూర్పులో అయిదుగురు దళిత, గిరిజన, మైనార్టీ, మహిళా, వెనుకబడిన కులాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి గౌరవించిందా? తన మంత్రివర్గంలో 60 శాతం సామాజిక న్యాయం అవసరమైన వారికే స్థానం కల్పించి చరిత్ర సృష్టించిన వారు ఇంతకు ముందెవరు? ఇటీవల ఒక మార్క్సిస్టు మిత్రుడు నాకు ఫోన్ చేసి, ‘మీరు జగన్‌ను సమర్థిస్తున్నట్లు వ్యాసాలు రాస్తుంటే, జగన్ ఏమైనా సోషలిజం తీసుకువస్తాడా అని అడిగాడు. కానీ సాధారణ ప్రజానుకూల పాలనదిశగా, ఇంత త్వరగా ఇంత నిబద్ధతతో జగన్ తన ప్రస్థానం ఆరంభించగలడని అనుకోలేదండీ! ఎండకన్నెరుగని జగన్మోహన్ రెడ్డి ఇలా దళితులకు, గిరిజనులకు, మహిళలకు, మైనారిటీలకు, వెనుకబడిన కులాలవారికి, ఇంత పెద్ద పీట వేస్తారని అనుకోలేదండీ’ అంటూ ఎంతో స్పందనతో మాట్లాడాడు. నిజానికి ఈ వర్ణ(కుల) వ్యవస్థను అంతం చేయడం.. ఈ దేశ ప్రజల శ్రేయస్సును కోరేవారందరి ప్రథమ కర్తవ్యం. ఆర్థిక దోపిడీకి గురవుతున్న సాధారణ శ్రామికులలో కూడా ఈ అణగారిని ప్రజానీకమే ఎక్కువ. వర్గదోపిడీని అరికట్టాలన్నా, ఈ కులవ్యవస్థను బద్దలు కొట్టకుండా మన దేశంలో అసాధ్యం. విభిన్న జాతుల సమాహారం మన భారతదేశం అని చెప్పుకున్నాం కదా! ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జాతిలో అయినా ఈ కులవివక్ష ఉంది. అదే మన సామాన్య అంశంగా ఉందన్నదీ నిర్వివాదాంశమే. ఆంధ్రప్రదేశ్‌లో అయినా, బెంగాల్లో అయినా, ఉత్తరాది రాష్ట్రాల్లో అయినా కులవ్యవస్థ అమానవీయత మన దేశంలో సర్వేసర్వత్రా వ్యాపించింది. అత్యంత పేదరికం అనుభవిస్తున్న శ్రమజీవులూ ఈ అణగారిన కులాల్లోనే ఉన్నారు. అంతేకాదు మన జనాభాలో ఆధిపత్య కులాలవారు 20 శాతం ఉంటే మిగిలిన వారిలో అత్యధికులు సామాజిక న్యాయం పొందవలసిన అణగారిన ప్రజానీకమే. ఎక్కువమంది పేద మధ్యతరగతి ప్రజానీకం ఉండగా, కోటీశ్వరుల సంఖ్య చట్టసభల్లో పెరుగుతుండటం నిజం. ప్రజాస్వామ్యం పెంపొందే క్రమంలో అది పేద, మధ్యతరగతి ప్రజానీకానికి అనుగుణంగా మారాలి. అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వారిలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ ఉన్నది. ఇతర వెనుకబడిన కులాల వారికి, మహిళలకు, మైనారిటీలకు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అవసరం. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం ఆధిపత్య కుల ధనస్వామ్యంగా మారకుండా ఉంటుంది. పార్లమెంటులో వైఎస్సార్ సీపీ తరపున విజయసాయిరెడ్డి.. ఇతర వెనుకబడిన కులాలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి, ఆ ప్రజాసమూహాల అభినందనలు అందుకున్నారు. నిజానికి ఇలాంటి బిల్లును కమ్యూనిస్టులే ఎప్పుడో పెట్టాల్సి ఉండింది. కానీ సృజనాత్మకత, సాధారణ వివేకం కనుమరుగైనట్లుగా.. ఈ కుల వ్యవస్థ నిర్మూలనకు నడుం కడితే, వర్గపోరాటం వెనకపట్టు పడుతుందని వాదిస్తున్న కమ్యూనిస్టు నేతల ఆలోచనా ధోరణి సరి కాదు. కులతత్వం మన భారతదేశంలో ఘనీభవించింది అని ఇఎంఎస్ నంబూద్రిపాద్ అన్నారు. పైగా మార్క్సిజం ప్రవచించిన నాటి ‘ప్రొలిటేరియట్స్’ నేడు బాగా తగ్గిపోతున్నారు. నేడు ట్రేడ్ యూనియన్లలో ప్రధానంగా ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్లలో (రెక్కల కష్టం తప్ప మరేమీ లేనివారు), బ్యాంకింగ్ రంగంలో, తదితర పరిశ్రమల్లో ఉన్న వారిలో అత్యధికులు మధ్యతరగతివారు. వారు ఆర్థిక సమస్యలతో పాటు నిజానికి, అంతకంటే కొంచెం ఎక్కువగానే సామాజిక న్యాయం అవసరమని అర్రులు చూస్తున్నారు. కనుక వర్గపోరాటాన్ని, వర్ణపోరాటాల్ని పరస్పర విరుద్ధంగా ఆలోచించడం మన దేశ పరిస్థితుల్లో మార్క్సిజం అనిపించుకోదు. తెలంగాణ రాష్ట్ర సీపీఎం, నాడు తెలంగాణ పోరాటంలో దిశానిర్దేశం చేసి నేడు ఈ కులనిర్మూలన పోరాటంలో ముందున్నందుకు వారికి అభినందనలు! ఆ తెలంగాణ గడ్డమీదే లాల్–నీల్ నినాదమిచ్చాడు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం! కానీ, ఇప్పుడెందుకో పార్టీ కేంద్రనాయకత్వం తెలంగాణ సీపీఎం విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు లేదు. ప్రజలు ఎక్కడ ఏరకమైన దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారో వారికి అండగా ఉంటేనే మనదేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఏమాత్రమైన పురోగమనం ఉంటుంది. లేకుంటే ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఈ విషయంలో.. మన మార్క్సిస్టు పరిభాషలో, బూర్జువా పార్టీనే అయినా, బహుజన వామపక్ష సంఘటన వంటి వాటి నిర్మాణంతో, ప్రస్తుత దేశ, కాల, రాష్ట్ర, సామాజిక న్యాయ పరిస్థితులకు అనుగుణంగా, సాధారణ ప్రజానీకం తరఫున పేదలకు అండగా సామాజిక న్యాయదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజల అభ్యున్నతి – ప్రస్తుత దశలో, ఎలా ఆచరణలోకి వస్తే, దానిని బలపర్చి, మొత్తం సమాజం మార్క్స్ చెప్పిన పరిణామ దిశగా పురోగమించడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించాలని మనసారా కోరుకుంటున్నాను. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
అఖిలపక్ష భేటీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం పార్లమెంట్లో జరగనున్న అన్ని పార్టీల అధినేతల సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళుతున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగే ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశంలోని అన్ని చట్ట సభలకు (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 2022లో 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది జరిగే మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయా పార్టీల అధినేతలకు రాసిన లేఖలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడును కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ మంత్రి ప్రహ్లాద జోషికి లేఖ రాశారు. -
జమిలిపై చర్చ ఊపందుకుంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనపై చర్చ జరగటం ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజకీయ భవిష్యత్తును మార్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయికి మనమిచ్చే అసలైన నివాళి ఇదేనన్నారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ సందర్భంగా దేశాన్నుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం, విపక్షాలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఓ సానుకూల మార్పునకు నాంది. ప్రజాస్వామ్యానికి ఇది ఆరోగ్యకర పరిణామం. నిష్పక్షపాతంగా జరిగే చర్చలను ప్రోత్సహించడమే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇచ్చే ఘనమైన నివాళి’ అని మోదీ పేర్కొన్నారు. కేరళకు దేశం అండ ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి దేశ ప్రజలంతా మానవతా దృక్పథంతో సాయం చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. జాతి, మత, ప్రాంత, లింగ భేదాల్లేకుండా, చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మనస్ఫూర్తిగా సాయానికి ముందుకురావడం గొప్ప పరిణామమన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో ప్రాణాలకు తెగించి ప్రయత్నించిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ తదితర విభాగాలు చేసిన సాయం మరువలేనిదన్నారు. ‘వరదలబారి నుంచి కోలుకుంటున్న కేరళ సాధారణ స్థితికి చేరుకోవాలని, తిరిగి అభివృద్ధి బాట పట్టాలని ఓనం సందర్భంగా భగవంతుడిని కోరుకుందాం. విపత్కర సమయంలో కేరళ, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల విషయంలో భారతీయులందరూ మానవత్వంతో స్పందించి సహాయ సహకారాలు అందించారు. దేశంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా ప్రజలంతా ఒకే విధంగా స్పందించడం గొప్ప విషయం’ అని మోదీ పేర్కొన్నారు. వరదల్లో మృతిచెందిన వారి లోటు తీర్చలేనిదని.. అయితే ఆ కుటుంబాలు కోలుకునేందుకు దేశం అండగా నిలబడుతుందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. భయంకరమైన పరిస్థితుల్లో కేరళ ప్రజలు గొప్ప మనోధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. గొప్ప ప్రధాని వాజ్‌పేయి ఓ మంచి ఎంపీగా, సున్నితాంశాలను స్పృశించే రచయితగా, గొప్ప వక్తగా, దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని మోదీ పేర్కొన్నారు. దేశంలో సానుకూల రాజకీయ భవిష్యత్తును, సుపరిపాలనను తీసుకొచ్చిన వ్యక్తిగా వాజ్‌పేయిని కీర్తించారు. వాజ్‌పేయి ప్రధాని అయ్యేంతవరకు సాయంత్రం ఐదుగంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారని.. ఆయన వచ్చాక ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసే నిబంధనలను సరళీకరించడం ద్వారా సామాన్యుడికీ త్రివర్ణపతాకం దగ్గరయ్యిందన్నారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల కేబినెట్ మంత్రుల సంఖ్యను అసెంబ్లీ సీట్లలో 15% నియంత్రించడం ద్వారా ప్రజాధనం, అధికార దుర్వినియోగం తగ్గిందన్నారు. ఇలాం టి ఎన్నో మార్పులు తెచ్చినందుకే దేశం వాజ్‌పేయిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఆడబిడ్డలకు పతకాలు శుభపరిణామం ఆసియా క్రీడల్లో భారత ఆడబిడ్డలు సాధిస్తున్న విజయాలు దేశ క్రీడారంగానికి ఓ శుభపరిణామమని మోదీ పేర్కొన్నారు. ఇండోనేసియాలో జరుగుతున్న ఈ ఈ క్రీడల్లో మనవాళ్లు సాధిస్తున్న విజయాలపై భారతీయులంతా ఆసక్తిగా రోజూ పేపర్లు, టీవీలు చూస్తున్నారన్నారు. ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండగ సందర్భంగా 55 మంది మహిళలను మోదీ ట్వీటర్లో ఫాలో అయ్యారు. ఇందులో క్రీడా, కళా, మీడియారంగాల ప్రముఖులున్నారు. సానియా మీర్జా, పీటీ ఉష, కరణం మల్లీశ్వరి, మాజీ మిస్ ఇండియా స్వరూప్ తదితరులు ఉన్నారు. రేప్‌లను సహించబోం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలను సహించే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు కూడా రాజ్యసభలో త్వరలోనే ఆమోదముద్ర పడేలా చూస్తామన్నారు. ‘దేశంలోని ముస్లిం మహిళలకు యావద్భారతం అండగా ఉంటుంది. వారికి సామాజిక న్యాయం కల్పిస్తాం. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం, పౌర సమాజం సహించదు. మహిళలపై అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన వారికి పదేళ్ల జైలు, 12ఏళ్ల లోపు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు’ అని మోదీ పేర్కొన్నారు. -
జమిలి జంఝాటం
-
జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ మద్ధతు
-
మరోసారి తెరపైకి జమిలి ఎన్నికల ప్రస్తావన