Janakamma
-
తెలుగు మహిళ తొలి యాత్రా కథనం
తెలుగువారి ఘన చరిత్ర తెలుగువారు ప్రత్యేకంగా చెప్పుకోరు. ఇంటి గడప దాటడం కూడా మహా వింత అయిన రోజుల్లో, సముద్రం దాటడం అంటే కుల భ్రష్టత్వం అని భావించే రోజుల్లో 1873లో తెలుగు మహిళ పోతం జానకమ్మ ఇంగ్లండ్, పారిస్‌లను చుట్టి ఆ విశేషాలను యాత్రాకథనంగా రాశారు. 1876లో ఇంగ్లిష్‌లో వెలువడ్డ ఈ పుస్తకం ఒక విలువైన డాక్యుమెంట్‌గా నిలిచి ఉంది. బహుశా భారతీయ మహిళల్లోనే యాత్రా కథనం రాసిన తొలి మహిళ పోతం జానకమ్మ. ఇన్నాళ్లకు ఈ పుస్తకం తెలుగులో రానుంది. అందులో ఏముంది? జానకమ్మ ఎవరు? ‘సాక్షి’కి ప్రత్యేకం. తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు అని చాలాకాలం భావించినా ఆయన కంటే ముందే భండారు అచ్చమాంబ తెలుగులో కథలు రాశారు అని పరిశోధకులు తేల్చారు. కాని ఈ పరిశోధన తెలుగు స్త్రీల కృషిని విశద పరిచింది. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి సమాజ చట్రాలను దాటి సంఘర్షించిన, కొత్త మార్గాలు తెరిచిన తెలుగు మహిళలు ఎందరో ఉన్నారు. ఆ వరుసలో పోతం జానకమ్మ కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నారు. 1838లో మద్రాసు నుంచి ఏనుగుల వీరాస్వామయ్య ప్రకటించిన ‘కాశీ యాత్రా చరిత్ర’ విఖ్యాతం. అయితే ఆయన చేసిన యాత్ర స్వదేశానికి పరిమితం. కాని 1873లో అదే మద్రాసు నుంచి పోతం జానకమ్మ చేసిన ‘జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర’ అంతే విశిష్టమైనది. అయితే కాశీ యాత్రకు లభించినంత ప్రచారం ఈ పుస్తకానికి లభించలేదు. ఎవరీ జానకమ్మ పోతం జానకమ్మ అచ్చ తెలుగు ఆడపడుచు. మద్రాసులో (చెన్నై) ఆమె వ్యాపారవేత్త రాఘవయ్యతో జీవించారు. ఈ రాఘవయ్య తమ్ముడు వెంకటాచల చెట్టి లండన్‌లో పత్తి దళారిగా పని చేస్తే, మరో తమ్ముడు జయరాం అక్కడే చదువుకున్నట్టు తెలుస్తోంది. పోతం జానకమ్మ చదువుకున్న మహిళ. ఇంగ్లిష్ కూడా మాట్లాడటం వచ్చు. ఆమె ప్రధానంగా చిత్రకళా ప్రియురాలు. దేశాలు, ప్రాంతాలు చూడాలనే ఆమె అభిలాషను భర్త గౌరవించాడు. ప్రోత్సహించాడు. భర్తతో కలిసి జానకమ్మ 1871లో ఇంగ్లాండ్‌కు వెళ్లాలనుకుని ప్రయత్నం చేస్తే ఆ సంవత్సరం ఓడలో ‘కుటుంబాలు వెళ్లడం లేదని’ మానుకున్నారు. 1873లో ఆమె ప్రయత్నం సఫలమైంది. ఆ సంవత్సరం ‘ఇండియన్ ఫైనాన్స్ కమిషన్’కు మహజర్లు సమర్పించడానికి మన దేశం నుంచి వ్యాపారవేత్తల బృందం లండన్ వెళ్లింది. బహుశా ఆ బృందంలో జానకమ్మ బృందం చేరి ఉంటుంది. 1873 జూలై 20న మద్రాసు ఓడరేవు నుంచి లండన్ బయలుదేరి వెళ్లిన జానకమ్మ 1874 ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు. తన యాత్రానుభవాన్ని తెలుగులో రాసి ‘ఆంధ్ర భాష సంజీవని’ లో ప్రచురించారు. పుస్తకాన్ని ఆమె తెలుగులోనే రాసినా అనువాదమయ్యి మొదట ఇంగ్లిష్‌లోనే 1876లో వెలువడింది. దీనిని జానకమ్మ నాటి మద్రాసు యాక్టింగ్ గవర్నర్ విలియం రోజ్ రాబిన్సన్ భార్య ఎలిజిబత్ రాబిన్సన్కు అంకితం ఇచ్చింది. అంటే బ్రిటిష్ అధికార కుటుంబాలతో ఆమె పరిచయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ముద్రణ అత్యంత ఖరీదు కనుక కాపీ వెల రెండున్నర రూపాయి పెట్టారు (సగటు కుటుంబం నెల ఖర్చు). ఆమె ఉండగా తెలుగులో పుస్తకం రాకపోవడం బాధాకరమే. 150 పేజీల ఈ పుస్తకంలో జానకమ్మ హైందవ ధర్మాల పట్ల తన నిష్ఠను వ్యక్తం చేస్తూనే ఆధునిక దృష్టి, స్త్రీ పురుష సమభావన దృష్టి, భారతీయుల పరిమితులపై విమర్శనా దృష్టి వ్యక్తం చేసింది. యాత్రాకథనంలో చాలా చోట్ల చిన్న పిల్లలా ఆశ్చర్యపోవడం ఉన్నా ఆమె ఆలోచనాపరురాలైన స్త్రీగా ఈ యాత్రనంతటినీ దర్శించడం విశేషం. ఈ పుస్తకాన్ని ఇప్పుడు నెల్లూరుకు చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు పురుషోత్తం కాళిదాసు అనువాదం చేశారు. రచయిత పి.మోహన్ ప్రచురణకర్తగా ఉన్నారు. మరో వారం రోజుల్లో వెలువడనుంది. పుస్తకంలో ఏముంది? కొన్ని పేరాగ్రాఫ్‌లు అక్కడక్కడ నుంచి ఎంచినవి ► 1873– జూలై 20వ తేదీ వేకువజాము. కెప్టెన్ ముర్రే సారథ్యంలో సౌతాంప్టన్ వెళ్లే ఓడ కలకత్తా నుంచి మద్రాస్ వచ్చేసిందని తెలుపుతూ మూడు తుపాకులు పేలడంతో మేం ప్రయాణానికి హడావుడిగా సిద్ధమయ్యాం. బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నాం. సహ ప్రయాణికులతో కలిసి రేవు నుంచి ఓడలోకి చేరవేసే మసూలా బోట్లు ఎక్కాం. మా సుదీర్ఘమైన ప్రయాణంలో ఏయే కష్టాలు ఎదురవుతాయోనని దిగాలు పడుతూ విషాద వదనాలతో ఉన్నాం. ముప్పై రోజులో ఇంకా ఎక్కువరోజులో ఎటు చూసినా సముద్ర జలాలు తప్ప మరేం కనిపించవు. ► నేను ఇంగ్లండ్ పర్యటన తల పెట్టగానే ఆ ప్రయత్నం మానిపించడానికి, నన్ను భయపెట్టడానికి మావాళ్లు ఎన్ని తెలివితక్కువ అపోహలు కల్పించారని. వాళ్లకు నచ్చజెప్పడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి యూరప్ చూడాలనే కోరికను నెరవేర్చుకొన్నాను. అక్కడకు వెళ్లాక విక్టోరియా రాణి ఏలుబడిలో లేని దేశాలను కూడా చూసి రావాలనే కోరిక కలిగింది. మాతో వచ్చిన బృందంతో కలిసి ఫ్రాన్స్ రాజధాని పారిస్ చూడటానికి బయల్దేరాం. మా పర్యటన ఏర్పాటు చేసిన థామస్ కుక్ అండ్ సన్స్ కంపెనీ ద్వారా టికెట్లు కొని నవంబర్ నెలలో అందరం న్యూ హేవన్ మీదుగా ఇంగ్లిష్ చానల్లో డియప్ మీదుగా పయనమయ్యాం. ► ఇంగ్లండ్ వెళ్లక పూర్వం బ్రిటిష్ ప్రజల గురించి అనేక అసంబద్ధ ఆలోచనలు నా బుర్రలో ఉండేవి. అక్కడి సామాజిక, రాజకీయ సమూహాల్లో మెలిగాక నా అభిప్రాయాలు మారాయి. పొరపాటేమిటంటే ఆంగ్లేయులు హిందూ దేశాన్ని తమదిగా భావించకపోవడం. ఏదో కొంతకాలమిక్కడ గడపడానికి వచ్చామనుకొంటారు కాబట్టే తరచూ తమ విధులను యాంత్రికంగా నిర్వర్తిస్తారు. ► మన హిందూ దేశస్తులు ఓడలు నిర్మించి సముద్రాల మీద విదేశాలకు వెళ్లి అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను తెలుసుకొని ఆ దేశాలతో మైత్రి చేసినట్లు గ్రంథస్తమైన ఆధారాలు లేవు. పైపెచ్చు మనవాళ్లు సముద్ర యానాన్ని, విదేశాలకు వెళ్లి రావడాన్ని నిషేధించారు కూడా. ఇటువంటి నిషేధాల వల్ల మన పూర్వీకులకు ఏం మేలు జరిగిందో ఏమో కానీ మనకిప్పుడు అపారమైన కీడు మాత్రమే కలుగుతోంది. ► సందర్భం, అవసరం వస్తే ఆంగ్లేయ మహిళలు శాస్త్రీయ విషయాల గురించి మాట్లాడతారు. ఎప్పుడో తప్ప వాళ్లు పోచికోలు కబుర్లతో కాలం వెళ్ళబుచ్చరు. ఆ దేశంలో దంపతుల మధ్య ప్రేమ చాలా గొప్పది. మగవాళ్లు స్త్రీలను హీనంగా చూడరు. ఏ విషయంలోనైనా తమతో సమానంగా చూస్తారు. హిందూ దేశ స్త్రీల కంటే ఇక్కడి స్త్రీలు మంచిస్థితిలో ఉన్నారు. మన దేశంలో పురుషులు స్త్రీలను బానిసల్లా చూస్తున్నారు. ► ఎర్ర సముద్రం అంతటా చిన్న చిన్న కొండలు, గుట్టలు తల పైకెత్తుకొని కనిపిస్తాయి. ఓడ ప్రయాణం చెయ్యక ముందు సముద్రంలో కొండలు, గుట్టలు ఉంటాయన్న వాస్తవం నాకు తెలియదు. పర్వతాలకు రెక్కలుండి ఎగిరే కాలంలో అవి ఊళ్ల మీద పడి నాశనం చేసేవి. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండిస్తున్నపపుడు మైనాక పర్వతం సముద్రుణ్ణి శరణుగోరి సాగరగర్భంలో దాగిందన్న రామాయణ గాథ ఈ సందర్భంలో నా మనసులో మెదిలింది. ► మేం లండన్‌లో ఉన్నప్పుడు లార్డ్ బైరన్ రాసిన నాటకం మాన్‌ఫ్రెడ్‌ను ప్రదర్శించారు. నాటకం సాగుతున్నప్పుడు తరచూ సందర్భానికి అనువుగా నేపథ్య దృశ్యాలను మార్చేవాళ్లు. ఆ దృశ్యాలు చాలా సహజంగా ఉండేవి. ► ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ ఒడిదొడుకులూ లేకుండా మమ్మల్ని క్షేమంగా వెనక్కి చేర్చిన దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాం. ఈ ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడ్డాను. పర్యటనలో ఎన్నో నేర్చుకున్నాను. నేను సంపాదించుకున్న జ్ఞానంతో, ఎరుకతో మరొకసారి అవకాశం లభిస్తే ఆ అద్భుతమైన పశ్చిమ దేశాలకు వెళ్లి అవి కళల్లో, శాస్త్ర విజ్ఞానంలో, పారిశ్రామిక ఉత్పత్తుల్లో సాధించిన విశేష ప్రగతిని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఆత్మస్థయిర్యం నాకు చేకూరింది. -
సమర అమ్మాళ్
భారత స్వాతంత్య్ర సంగ్రామ ధీరవనిత.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన నాయిక.. దక్షిణ భారతంలో అరెస్టయిన తొలి మహిళ.. తొలి రోజుల్లో.. నాటకరంగ కళాకారిణి. తర్వాత.. సమర యోధురాలు.. జానకీ అమ్మాళ్! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమ్మాళ్ పునఃపరిచయం ఇది. (డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ సభ్యులతో జానకి అమ్మాళ్ (మధ్యలో)) జానకి అమ్మాళ్ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నాయకురాలు, డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు. (తమిళనాడులో ప్రారంభమైన ఈ సమాఖ్య ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్– ఐద్వా స్థాపన తర్వాత అందులో విలీనమైంది) తమిళనాడు 1967 సార్వత్రిక ఎన్నికల్లో మదురై (ఈస్ట్) నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారామె. రంగస్థలం మీద గాయనిగా మొదలైన ఆమె ప్రస్థానం అనతికాలంలోనే ప్రధాన నాయిక పాత్రలోకి మారింది. రంగస్థలం నుంచే జాతీయపోరాటాన్ని ప్రారంభించారు జానకి అమ్మాళ్. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పడానికి రంగస్థలాన్నే ఆమె వేదిక గా చేసుకున్నారు. వేదిక మీద భారతమాత కీర్తిప్రతిష్ఠలను ఎలుగెత్తి పాడారు. వలస పాలనలో మగ్గుతున్న భారతావని కడగండ్లను రాగయుక్తంగా ఆలపించారు.. శ్రోతల నరాల్లో రక్తం ఉడికిపోయేట్లుంది ఆమె గానం. జనంలో ఉద్రేకం.. కట్టలు తెగడానికి సిద్ధంగా ఉండేది. అప్పుడు అరెస్టు చేశారామెని.. బ్రిటిష్ ఆదేశాలతో ఉద్యోగం చేస్తున్న దేశీయ పోలీసులు. ఒక ఏడాది పాటు ఆమె ఆచూకీ తెలియదెవ్వరికీ. జైలు నుంచి విడుదలైన తర్వాత మునుపటి పౌరుషం, జాతీయతాభావం అడుగంటి పోయి ఉంటాయనుకున్నారు పాలకులు. అదే జరిగి ఉంటే... జానకి అమ్మాళ్కి చరిత్రలో ఇన్ని పేజీలు ఉండేవి కాదేమో! జానకి అమ్మాళ్ 1917లో మదురైలో పుట్టారు. పద్మనాభన్, లక్ష్మి ఆమె తల్లిదండ్రులు. ఎనిమిదేళ్ల వయసులో తల్లిపోయింది. అమ్మమ్మ పెంపకంలో ఎనిమిదవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. సంగీత సాధన కొనసాగించి, పన్నెండేళ్ల వయసులో పళనియప్ప పిళ్లై బాయ్స్ నాటక కంపెనీలో నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు. కొద్దికాలంలోనే కథానాయిక పాత్రల స్థాయికి చేరారు. ఆమె వేతనం కూడా నెలకు మూడు వందల రూపాయలకు చేరింది. ఆమెను ఎవరూ చేయి పట్టుకుని నడిపించలేదు. కానీ ఆమె జీవితంలో ప్రతి అడుగూ విప్లవాత్మకమైనదే అయింది. అప్పటి సమాజంలో అంటరానితనం బలంగా వేళ్లూనుకుని ఉండేది. ఆ సమయంలో కులమతాలకతీతంగా సమసమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించారు జానకమ్మ. తమ నాటక కంపెనీలో కథానాయకుడి పాత్రలో విశ్వనాథదాస్తో కలిసి నటించడానికి సహ నటీమణులు ఇష్టపడని సందర్భంలో జానకమ్మ ముందుకు వచ్చారు. వారిద్దరి కాంబినేషన్‌తో అనేక సాంఘిక నాటకాలు ఆదరణ పొందాయి. జాతీయోద్యమ భావనను పెంచేవిధంగా సాగిన నాటకాల్లో ఆమె దేశభక్తి గేయాలు ఆలపించేవారు. అలా రంగస్థలం మీద దేశభక్తి గీతం పాడుతున్న సమయంలోనే ఆమెను అరెస్టు చేశారు. తిరునల్వేలిలో 1930లో అరెస్టయినప్పుడు ఆమె ఏడాది పాటు జైల్లో గడిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరుచ్చిలో యాంటీ వార్ ప్రాపగాండ చేస్తోందన్న కారణంగా(డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ నిబంధనల ప్రకారం) మరోసారి అరెస్టు చేశారు. పోరాటమూ స్వతంత్రమే సత్యాగ్రహ ఉద్యమంలో ఆమె స్వతంత్రంగా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ఆమె వంతుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు జానకమ్మ. ఆమె చొరవ ఉద్యమానికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారామెను. అలా మదురై కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారామె. కొంతకాలానికే ఆమె కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోకి మారిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మదురై సందర్శించిన సందర్భంగా ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ను సమర్థంగా నిర్వహించారామె. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కూడా అంతే హుందాగా స్వీకరించారు జానకమ్మ. ఆ తర్వాత కొన్నాళ్లకే... 1940లోనే కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు జానకి అమ్మాళ్ మార్క్సిస్టు పార్టీతో పనిచేశారు. జానకమ్మ పార్టీ జానకమ్మ కాలి నడకన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేవారు. అనేక మందిని ఉద్యమం వైపు నడిపించారు కూడా. జాతీయోద్యమం ఇతివృత్తంతో పాటలు రాసుకునేవారు. భర్త గురుస్వామి (ఆయన హార్మోనియం వాయిద్యకారుడు) సహకారంతో మ్యూజిక్ కంపోజ్ చేసుకుని స్టేజి మీద పాడేవారు. ఆమె ప్రభావం ఆ పార్టీ మీద ఎంతగా ఉండేదంటే... తమిళనాడులోని తువారిమన్, శోలవందన్, తిరుమంగళం పరిసరగ్రామాల్లో కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అని చెప్పడానికి ‘జానకి అమ్మ కచ్చి (జానకమ్మ పార్టీ)’ అనే చెప్పుకునేవారు. సగం చేవ చచ్చిపోతే... మహిళలు ఇల్లు వదిలి బయటకు రాని రోజుల్లో... ఆమె, ‘వలస పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి సమాజంలో సగభాగం అయిన మహిళలు చేవలేక చూస్తూ ఉంటే కుదరద’ని చెప్పి చైతన్యపరిచారు. ఆమె ప్రసంగాల్లో మహిళల సాధికారత, మహిళల స్వయంప్రతిపత్తి, లింగ వివక్షలేని సమానత్వంతో కూడిన సమాజ సాధన, పరిశ్రమల్లో పని చేసే కార్మికుల హక్కులు, వారి ప్రయోజనాలు, అసంఘటిత రంగంలోని శ్రామికుల శ్రేయస్సు ప్రధానాంశాలుగా ఉండేవి. ఆమె ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు తర్వాతి కాలంలో మంచి హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారని ఆమె స్నేహితురాలు నాగమ్మాళ్ చెప్పేవారు. జానకమ్మ స్వీయ క్రమశిక్షణ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేవారో, అంతే సున్నితమనస్కురాలు కూడా. ‘ఎమర్జెన్సీ సమయంలో పార్టీ కేడర్ పడుతున్న కష్టాలు చూసి తన నగలన్నీ అమ్మేసి వారిని కాపాడుకున్నారు. ఆ డబ్బు ఖర్చయిపోయిన తర్వాత పట్టు చీరలు అమ్మేయాల్సి వచ్చింది. ఖరీదైన ఆమె పట్టు చీరలకున్న జరీలో బంగారు, వెండి ఉండేది. జరీ అంచులను కాల్చి బంగారు చేసి అమ్మి రోజులు గడిపాం’ అని గుర్తుచేసుకున్నారు జానకమ్మ స్నేహితురాలు నాగమ్మాళ్. పెట్టే చెయ్యే కానీ... జానకమ్మ ఒకరికి పెట్టడమే కానీ ఎవరి నుంచి ఏమీ ఆశించే తత్వం కాదు. నాగమ్మాళ్ పెళ్లి కోసం జానకమ్మ తన ఖరీదైన పట్టుచీరను రెండో ఆలోచన లేకుండా ఇచ్చేసిన వైనాన్ని చెప్పుకుంటారు ఆమె స్నేహితులు. ఆమె తన పట్టుచీరలన్నింటినీ ఒక్కో సందర్భంలో ఒక్కో మంచి పని కోసం ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత ఆమె పట్టుచీరలను కొనుక్కోలేదు. నూలు చీరల్లో నిరాడంబరంగా జీవించారు. ఎవరు బహుమతులిచ్చినా స్వీకరించేవారు కాదు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా తీసుకోలేదామె. తన మీద అభిమానంతో కలిసిన వారిని ఆమె ఒక్కటే కోరేవారు. ‘తాను పోయిన తర్వాత అంత్యక్రియలను కమ్యూనిస్టు పార్టీ వాళ్లందరూ కలిసి చేయ’మని అడిగేవారు. ఆమె చివరి రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లోనే గడిపారు. తిరునగర్‌లో నివసిస్తున్న కూతురు, అల్లుడు తమతోపాటు ఉండమని ఎంత కోరుకున్నా జానకమ్మ పార్టీ ఆఫీస్‌లో ఉండటానికే ఇష్టపడేవారు. దాంతో ఆఫీస్‌లోనే ఆమె కోసం ఒక గదిని కేటాయించారు. ఆస్త్మాతో బాధపడుతూ 1992, మార్చి ఒకటవ తేదీన చివరి శ్వాస తీసుకున్నారు. రంగస్థలం వేదికగా మొదలైన జాతీయోద్యమ స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించారామె. సామాన్యుని హక్కుల కోసం పోరాటంలోనే జీవితాన్ని గడిపారు. అరెస్టులు, జైలు జీవితం ఆమెను ఏనాడూ భయపెట్టలేదు. కులమతాలు, స్త్రీ–పురుష వివక్షను తీవ్రంగా వ్యతిరేకించే జానకమ్మ సిద్ధాంతం, మనిషిని మనిషిగా స్వీకరించాలనే ఆమె తత్వం... చివరి వరకు అలాగే కొనసాగాయి. అవి తరువాతి తరానికి ఆమె వదిలిన పాదముద్రలు. జాతీయోద్యమంలో పాల్గొన్న జానకమ్మ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోలేదు. స్వతంత్ర భారతదేశంలో ఆమె ప్రజాసమస్యల మీద ఉద్యమించారు, అనేక దఫాలు అరెస్టయ్యారు కూడా. ఆమెలో స్త్రీశక్తిని చూసిన వాళ్లున్నారు. స్నేహమూర్తిని చూసినవాళ్లున్నారు. ఆత్మీయతను పంచే తల్లిని చూసిన వాళ్లూ ఉన్నారు. జానకమ్మలో... శ్రామికుల తరఫున పోరాడేటప్పుడు అకుంఠిత దీక్షతో పని చేసే శక్తిస్వరూపిణి కనిపించేది. వారి హక్కుల కోసం అధికారులతో చర్చించేటప్పుడు ఆమెలో అపర మేధావి కనిపించేది. జానకమ్మను అమితంగా ఇష్టపడిన వాళ్లు... ఆమె మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం ‘జానకి అమ్మ మెమోరియల్ ట్రస్ట్’ ప్రారంభించారు. ఆ ట్రస్ట్ మహిళాశిశు అభివృద్ధి కోసం పని చేస్తోంది. ఆడశిశువును పుట్టగానే చంపేయడం, కడుపులోనే చంపేయడం అనే దురాలోచనను తుడిచిపెట్టాలన్న సదుద్దేశంతో పనిచేస్తోంది జానకి అమ్మ మెమోరియల్ ట్రస్ట్. – మంజీర -
దేవుడిచ్చిన అమ్మ
వెంకాయమ్మగారూ... భోజనం చేశారా... ఆ తల్లి వచ్చి నాకు తినిపించిందయ్యా... శాంతకుమారిగారూ... మాత్రలు వేసుకున్నారా... ఆ అమ్మాయి మింగించేసిందయ్యా... ఏమ్మా మీ బట్టలు మార్పించిందెవరు?.. ఇంకెవరు ఆ అమ్మే. సీతామాలక్ష్మిగారూ... కూరలు బాగున్నాయా... ఆ అమ్మ చేతివంట గురించి వేరే చెప్పాలా నాయనా... ఇంతమంది చెప్పేది ఒకే ఒక్కరి గురించి. ఆమే జానకమ్మ. విజయనగరం ప్రేమసమాజంలో ఉండే ఏ వృద్ధురాలిని కదిపినా... అందరూ చెప్పేది అందులో పనిచేసే జానకమ్మ గురించే. అదీ జానకమ్మకు... ఆ ప్రేమ సమాజానికీ ఉన్న అనుబంధం. అది ఈ నాటిది కాదు. దాదాపు 30 ఏళ్లుగా ఆమె అక్కడివారితో పెనవేసుకుపోయారు. ఇంతకీ ఆ జానకమ్మ ఎవరు... ఎందుకు అంతగా అందరితో మమేకమయ్యారో తెలుసుకోవాలంటే ఆమె గురించి మొదట తెలుసుకోవాలి. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కట్టుకున్న భర్త అర్ధంతరంగా కాలం చేశారు. అత్తవారింట వాతావరణం అనుకూలంగా లేదు. కన్నవారింటికెళ్దామంటే చిన్నతనం అనిపించింది. పైగా వారి మనసు ఎంత బాధపడుతుందోనన్న బాధ. రోడ్డుపైకి వచ్చేసింది. కానీ ఎలా బతకాలి. పొత్తిళ్లలో చిన్నారి... బాధ్యతను గుర్తు చేసింది. ఆమె ఆకలి తీర్చడానికైనా ఏదో పనిచేసుకోవాలి. ఎలా... ఒంటరి మహిళకు సమాజంలో ఎలాంటి విలువ ఉంటుందో వేరే చెప్పాలా... చివరకు ఎవరో చెప్పారు ప్రేమసమాజం గురించి. ఎలాగో వెదుక్కుంటూ అక్కడకు చేరిన ఆమెకు అక్కడి నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. అందులోని వృద్ధులందరికీ సేవలు చేస్తూ... వారందరి తలలో నాలుకయ్యారు. అందరికీ తానే వండి... స్వయంగా తినిపిస్తున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా... నేనున్నాననే నమ్మకాన్ని వారిలో కలిగించారు. చివరకు ఎవరైనా కాలం చేస్తే వారి కర్మకాండలూ చేశారు. అలా.. 29ఏళ్లుగా ఆ ప్రాంగణంలోని ప్రతి అణువుకూ ఆమె దగ్గరయ్యారు. ఆమే జానకమ్మ. ఆమె ఎక్కడినుంచి వచ్చారు... ఆమె జీవితం ఎందుకలా అయ్యిందో ఆ కథ ఆమె మాటల్లోనే... అత్తవారింట ఉండలేక... మాది ఒడిశా రాష్ట్రం. 33 ఏళ్ల క్రితం విజయనగరం పట్టణా నికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకే నా భర్త మరణించారు. అప్పటికే నా కడుపులో ఓ నలుసు పడింది. ఆ దారుణ విషాదాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కన్నీళ్లతోనే అత్తవారింటికి వచ్చాను. నాకు ఒక పాప పుట్టిం ది. రెండేళ్లు అత్తవారింట్లోనే ఉన్నాను. కానీ అక్కడి సరిస్థితులు నన్ను ఉండనివ్వలేదు. పుట్టింటికి వెళ్లి కన్నవారికి భారం కావాలనుకోలేదు. సొంత ఊరికి వెళ్లి అవమానాల పాలు కాదలచుకోలేదు. అత్త వారింట సంతోషంగానే ఉన్నాననే తృప్తిని సొంతూరికి, తల్లిదండ్రులకు మిగల్చాలనుకున్నాను. ఎవరికీ భారం కాకుండా నా బతుకు నేను బతకాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా.. ఈ ఊరిలో నాకెవరూ తెలియదు. ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాలేదు. ఏ పని చేయాలో తెలియలేదు. అప్పుడే నాకు ‘ప్రేమ సమాజం’ గురించి తెలిసింది. ఆదరించిన ప్రేమ సమాజం రెండేళ్ల బిడ్డను చంకలో పెట్టుకుని ప్రేమసమాజం తలుపు తట్టాను. నిర్వాహకులకు నా పరిస్థితిని వివరించాను. ఎక్కడైనా ఉద్యోగం చూస్తాం చేస్తావా అని అడిగారు. జీతం కోసం పనిచేయడం నా అభిమతం కాదని, నాకు నా కూతురికి నీడ కల్పించి కడుపుకింత ముద్ద పెట్టమని వేడుకున్నాను. నా పరిస్థితి చూసి వారు కరిగిపోయారు. ప్రేమ సమాజంలో ఆశ్రయం కల్పించారు. అప్పటి నుంచి నాకూ, నా కూతురికీ ఇదే ఇల్లు. ఇక్కడ ఉండే అనాథ వృద్ధులను చూసి నా మనసు చలించిపోయింది. ఎవరూ లేని వాళ్ల మానసిక దుస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వారికి ఆ లోటు రానివ్వకూడదనుకున్నాను. వారినే దైవాలుగా భావించి సేవలు చేయడం మొదలుపెట్టాను. ఇక ఆ తర్వాత పుట్టినింటికిగానీ, మెట్టినింటికిగానీ వెళ్లాలనిపించలేదు. ఇరవై తొమ్మిదేళ్లు ఇలాగే గడిచిపోయాయి. వారి సేవలోనే హాయి ఉదయం నుంచి రాత్రి వరకూ అమ్మల ఆలనాపాలనా చూసుకుంటున్నాను. వారికి పొద్దున్నే అల్పాహారం దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ సమయానికి పెడుతుంటాం. నాతో పాటు చెల్లిలా లక్ష్మి ఉంటోంది. ఆమె నాకు ఇరవై ఏళ్లుగా అన్నిటిలో తోడవుతోంది. నేను వంట చేసి అమ్మలకు పెడుతుంటాను. లక్ష్మి వారికి దుస్తులు మారుస్తుంటుంది. ఇక్కడ ఉన్న వారిలో 90 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు. వారిలో ఓ అమ్మ శాంత కుమా రి. ఆమెకు ఓ చేయి లేదు. మంచంపై నుంచి లేచి నడవలేదు. ఆమెకు నేనే అన్నం కలిపి ముద్దలు తినిపించాలి. బూచి వెంకాయమ్మ అనే అమ్మకు ఉన్న ఒక్క కొడుకూ కాలం చేయడంతో మనుమరాళ్లకు భారం కాలేక మా దగ్గరకు వచ్చారు. ఆమె ఎన్నో మంచి విషయాలను చెబుతుం టారు. ఇలా ఇక్కడున్న ప్రతి ఒక్కరిదీ ఒక్కో కన్నీటి వ్యధ. మూడు దశాబ్దాలలో దాదాపు 350 మంది ఇక్కడే తుదిశ్వాస విడిచారు. వారి సంబంధీకులెవరూ రాలేదు. నేనే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. నాతో పాటు ఇంత మంది అమ్మలకు ఆశ్రయం ఇచ్చిన ప్రేమసమాజం అధ్యక్షులు డి.ఎస్.ఆర్.మూర్తి, కార్యదర్శి పెద్దింటి అప్పారావు మాకు ప్రత్యక్ష దేవుళ్లు. మేనేజర్ రమణ మమ్మల్ని తోబుట్టుల్లా చూసుకుంటున్నారు. అందుకే ప్రాణం ఉన్నంత వరకూ ఈ ప్రేమ సమాజంలో ఇలాంటి ఎంతోమంది అమ్మలకు సేవ చేస్తూ గడిపేస్తాను. -
రామయ్యకి తోడుగా జానకమ్మ
‘వృక్షో రక్షతి.. రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్ సైకిల్‌పై తిరిగే నా భర్తను చూసి.. ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను మాత్రం నా భర్తను ఏమీ అనలేదు. ‘అనుకూలవతిౖయెన సుదతి దొరకుట పురుషుడి అదృష్టం’ అంటారు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య. అన్నట్టుగానే ఆయన ఆశయంలో, తలపెట్టిన లక్ష్యంలో తోడు, నీడై నిలిచింది భార్య జానకమ్మ. భర్త తలంచిన కార్యంలో ఆయనతో పాటు అడుగేసింది. రామయ్యకు మొక్కలపై ఉన్న ప్రేమతో ఆమె కూడా మొక్కలు నాటింది. కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్యను ఇటీవలే పద్మశ్రీ అవార్డు వరించిందని తెలిసి పద్మశ్రీ రావడం తమ బాధ్యతను మరింతగా పెంచిందనీ అందరూ వన ప్రేమికులమై ప్రపంచమంతా మొక్కలు నాటాలన్నదే తమ ధ్యేయం అని అంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ మాటలు... పులి ఉన్నా మొక్కలే ముఖ్యం ‘నేనే రోజూ గేదెల వెంట పోత. ఒకరోజు చేలల్లో రెడ్డోరి ఆవును పెద్ద పులి తిన్నదని ఊళ్లో అనుకున్నరు. అప్పుడు గేదెల వెంట పోవాలంటే భయపడ్డా. తోడు నువ్వురా అని ఆయనను అడిగా. గేదెల పాలు పోసి వెంటనే వస్తానని ఖమ్మం పోయిండు. ఎప్పుడు వస్తాడోనని భయపడుతూనే గేదెల మేపా. పొద్దుపోయినా రాలేదు. చీకటి పడింది. ఇంట్లో అన్నం వండుతుంటే వచ్చిండు. అప్పుడు ఆయన్ను చూసి కోపం వచ్చింది. ‘నన్ను పెద్దపులి తిన్నా రావా..?’ అని ఏడ్చా. పాలు పోసి మొక్కలు తెచ్చేందుకు వెళ్లా అని చెప్పాడు. ‘నువ్వు గేదెలు కాసేందుకు వెళ్లక ముందే చేలల్లకు పోయి చూసిన. ఎక్కడా పులి గుర్తులు లేవు. నక్కో, తోడేలో వచ్చింది. అంతే. అందరూ పెద్దపులి అని భయపడ్డారు. అంతా చూసే నేను రాలేదు’ అని అన్నాడు. పెద్దపులి ఉంటే నా భార్యకు ఏమవుతుందోనని భయపడి ముందే చేలల్లో చూసి వెళ్లిన ఆయనపై కోపం తగ్గింది. భార్యగా నా మీద, మొక్కల మీద, పిల్లల మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో అప్పుడు ఆర్థమైంది’.. తొమ్మిదో ఏటే పెళ్లైయింది మా అమ్మనాన్నలు శంకరమ్మ, వెంకట్రామయ్య. మాది తుమ్మలపల్లి గ్రామం కొణిజర్ల మండలం. ఆరుగురు మగవాళ్లం. ఇద్దరం ఆడోళ్లం. చిన్నప్పుడే అమ్మనాన్న చనిపోయిండ్రు. అమ్మమ్మ దగ్గరే పెరిగాం. రామయ్య ఊరు ముత్తగూడెం. నా తొమ్మిదో ఏటే పెళ్లయింది. అప్పుడు రామయ్య వయస్సు 15 ఏళ్లు. అప్పటికే ఆయన ఎక్కడికి పోయినా మొక్కలు నాటేవాడు. ముత్తగూడెం నుంచి రెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మా పొలాలు ఉండడంతో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం. మాకు మగ్గురు కొడుకులు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక కొడుకు అనారోగ్యంతో చనిపోయిండు. కుండలు చేయకుండా చెట్లబాట పట్టిండు మేము కుమ్మరోళ్లం. మా మామ లాలయ్య కుండలు చేసేవాడు. మా ఆయనకు కుండలు చేయడం రాదు. దీపాంతలు చేయడం ఒక్కటే తెలుసు. కొన్నాళ్లు మేళం వాయించాడు. కుండలు చేయడం రాకపోతే పిల్లలతో ఎలా బతకాలని బాధపడ్డా. ఉన్న పొలంలో కొంత నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పోయింది. మొక్కలు, చెట్లు అంటూ తిరిగి ఉన్న 3 ఎకరాలు అమ్మిండు. మళ్లీ కొన్నాళ్లకు పొలం కొన్నాం. గేదెల పాలు తీస్తే పోసి వచ్చేది. వీటితో వచ్చే పైసలతోనే కుటుంబాన్ని గట్టెక్కించా. ఎక్కడ విత్తనాలు కనిపించినా ఏరకవస్తాడు. వేప, సుబాబుల్, గానుగ, చింత గింజలు తెచ్చి నాకిస్తే వాటిని చాటలో చెరిగి పెట్టేదాన్ని. ఇవి తీసుకెళ్లి నర్సరీ పెట్టేవాడు. వాళ్ల అమ్మ బీర ఇత్తులు నాటిందని.. కుండలు చేయడానికి ఉపయోగించే మట్టి మా మామ తెచ్చిపోస్తే అందులో మా అత్త బీర ఇత్తులు నాటిందట. అవి పెద్దవై కాయలు కాశాయట. మా ఆయన కూడా వాళ్ల అమ్మను చూసి బీర ఇత్తులు పెట్టడంట. మొక్కలు నాటితే వాటి పండ్లు తినవచ్చని, భవిష్యత్ తరాలు బాగుంటాయని వాళ్ల అమ్మే చెప్పిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల ఆమ్మ మాటే పట్టుకొని మొక్కలు నాటుతుండు. ఒకసారి పొయ్యి కాడ పొంతకుండ పక్కనే మొక్క వేసిండు. ఇక్కడ వేడి ఉంటుంది ఎందుకు వేశావు అని అడిగాను. ‘పదును ఉంటుంది. బతుకుద్దిలే’ అన్నాడు. రెండు కోట్ల వరకు అయిన వేసిన మొక్కలు ఉన్నాయి. బాట వెంట పోయే వాళ్లందరూ ఇవి రామయ్య వేసిన మొక్కలు అని అంటే మా ఆయన గొప్పతనం నాకు తెలిసేది. పిచ్చోడు అన్నవారు.. ఆశ్చర్యపోతున్నారు.. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్ సైకిల్‌పై తిరిగే నాభర్తను చూసి ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను నా భర్తను ఏమీ అనలేదు. మొక్కలంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో చూసి మొక్కలు నాటమనే చెప్పా. అప్పుడు ఆయనను చూసి నవ్వినవాళ్లు, పిచ్చోడు అన్నవాళ్లు పద్మశ్రీ అవార్డు రావడం చూసి ఆశ్చర్య పోతుండ్రు. ఇంతకన్నా నాకు సంతోషం ఏం కావాలి..? తోడుగానే ఉంటా.. ఇప్పుడు ఆయన వయస్సు 77 ఏళ్లు. జీవితాంతం ఆర్థాంగిగా తోడు ఉంది ఆయన్ను బాధపెట్టకుండా మొక్కలు నాటడంలో తోడు ఉండటమే నా పని. ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తే నర్సరీ ఏర్పాటు చేస్తాం. మొక్కలు పెంచి ప్రజలకు ఇవ్వాలన్నది మా తపన. మా పిల్లలు కూడా ఆయనలా మొక్కలు నాటి సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. నా భర్తను అందరూ ‘వనజీవి’ రామయ్య అంటారు. ఇప్పుడు ఈ ఆవార్డుతో ‘పద్మశ్రీ రామయ్య’ అంటున్నారు. మా ఇంటికి వచ్చి కార్లల్లో తీసుకెళ్లి సన్మానం చేస్తున్నారు. మనవరాళ్ల పేర్లు.. కబంధపుష్పం, హరితలావణ్య ఆయనకు పిల్లలు, మనవరాళ్లు అంటే ప్రాణం. మనువరాళ్ల పేర్లు ఏమి పెట్టాలని పిల్లలే ఆయన్ను అడిగేవారు. మొక్కల మీద ఉన్న ప్రేమతో మనవరాళ్లకు ‘కబంధపుష్ప, వనశ్రీ, చందనపుష్ప, హరితలావణ్య’ అని పేర్లు పెట్టాడు. ఐదో తరగతి చదువుకున్న ఆయన రోజూ పుస్తకం తీసుకొని అందులో చెట్లు, మొక్కలపై సూక్తులు రాస్తాడు. చెట్లు నాటితే మనషుల లోకం ఎలా ఉంటుందో నాకు చెప్పుతాడు. ఆయనకు తెలిసిన ప్రాంతమంతా మొక్కలే నాటిండు. మా ఇంట్లో, ఊళ్లో, రోడ్ల వెంట ఎక్కడ చూసినా ఆయన నాటిన మొక్కలే. జానకమ్మ .. నా క్లాస్మెంట్.. ‘ఆడది కారం వేసుకొని తినాలి.. మగాడు కోడిగుడ్డు తినాలి అని ఎనకట పెద్దలు చెప్పేవాళ్లు. ‘ఆడోళ్లు మగాడితో సమానంగా వరి కోస్తరు, మోపులు మోస్తరు. ఎడ్లకు వరిగడ్డి వేస్తరు. పాలిచ్చే గేదెలకు పచ్చిగడ్డి పెడతరు. మగాళ్లకు బాధ తెలియకుండా పిల్లలను పెంచుతరు. వారికి పౌష్టికాహారం పెట్టాలి. మగాడు కారం తినాలి. ఆడది గుడ్డు తినాలి అంటాను నేను. అప్పుడే కుటుంబం ఇల్లు చక్కగా ఉంటుంది. నేనూ జానకమ్మ స్నేహితుల్లా ఉంటాం. ఆమెపై ఎప్పుడూ పెత్తనం చేయను. మొక్కలు నాటాలని ప్రచారానికి వెళ్లే నాకు సైకిల్ మధ్యలో ఎక్కడైనా పంక్చర్ అవుతుందేమోనని పదిరూపాయలు తెచ్చి నా జేబులో పెట్టేది. నేనంటే జానకమ్మకు అంతటి ప్రేమ. నేను నమ్మిన సిద్ధాంతానికి నా వెంటే జీవితాంతం తోడై నడుస్తోంది. మా ఇద్దరి ఆశయం ఒక్కటే. దేశంలో గ్రీన్ కరెన్సీ రావాలి. ప్రపంచం మన దేశాన్ని ‘పచ్చని భారతదేశం’ అని చెప్పుకోవాలి. – ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత రామయ్య – బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం -
అమ్మా నాన్నకు ప్రేమతో...
నాగర్‌కర్నూల్ రూరల్: ఇంట్లో నుంచి కుమారులు వెళ్లగొట్టడంతో రోడ్డుపాలైన వృద్ధ దంపతులకు పోలీసులు బాసటగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మండలం ఉయ్యాలవాడకు చెందిన బుచ్చారెడ్డి, జానకమ్మలు తమ కుమారుల తీరుపై సోమవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విషయం విదితమే. ఈ ఘటనపై స్పందించిన ఎస్ఐ ప్రదీప్‌కుమార్.. దంపతుల కుమారులు నిరంజన్‌రెడ్డి, ఆంజనేయులురెడ్డి, మురళీధర్‌రెడ్డిలను స్టేషన్‌కు పిలిపించారు. వారితో మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిందిపోయి ఇంట్లో నుంచి వెళ్లగొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున రూ.15లక్షలు బ్యాంకులో వారి పేరున జమ చేయాలని ఎస్ఐ సమక్షంలో గ్రామపెద్దలు చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. వారం రోజుల్లో డబ్బును బ్యాంకులో జమచేయాలని సూచించారు. అయితే తల్లిదండ్రులిద్దరూ పెద్దకుమారుడు నిరంజన్‌రెడ్డి ఇంట్లో ఉండేలా ఒప్పందం చేశారు. -
తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు!
తమ్ముడిని, తాళికట్టిన భార్యను నరికి చంపేశాడు.. తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు! విశాఖపట్నం: వివాహేతర సంబంధం నేప థ్యంలో తోడబుట్టిన తమ్ముడిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అంతటితో ఆగక వారి తలలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని గొప్పులపాలేనికి చెం దిన చెదల గుండన్న, జానకమ్మ (36) భార్యాభర్తలు. గుండన్న తమ్ముడు నారాయణ (40), వదిన జానకమ్మతో వెళ్లిపోయి మరో గ్రామంలో మూడు వారాల క్రితం కాపురం పెట్టాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న గుండన్న సోమవారం తమ్ముడు నారాయణ పొలంలో ఉండగా కత్తితో వెళ్లి నరికి చంపాడు. తమ్ముడి తలను మూటగట్టుకుని, పొరుగూరులో ఉన్న భార్య జానకమ్మ వద్దకు వెళ్లాడు. వెంటాడి మరీ ఆమెను హతమార్చాడు. ఆమె తలను కూడా శరీరం నుంచి వేరు చేసి, రెండు శిరస్సులనూ కావడి కట్టి తాను పోలీసులకు లొంగిపోతున్నట్టు చెప్పి నడుచుకుంటూ బయల్దేరాడు. చేతిలో కత్తితో నడిచి వస్తున్న గుండన్నను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. బాకూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పాడేరులోగల హుకుంపేట పోలీస్ స్టేషన్‌కు నడిచివెళ్లి, లొంగిపోయాడు.