తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు! | Fornication murders | Sakshi
Sakshi News home page

తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు!

Published Tue, Aug 19 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు!

తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు!

తమ్ముడిని, తాళికట్టిన భార్యను నరికి చంపేశాడు.. 
తలలు వేరు చేసి, కావడి కట్టి.. పోలీస్‌స్టేషన్‌కు!
 

విశాఖపట్నం: వివాహేతర సంబంధం నేప థ్యంలో తోడబుట్టిన తమ్ముడిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అంతటితో ఆగక వారి తలలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని గొప్పులపాలేనికి చెం దిన చెదల గుండన్న, జానకమ్మ (36) భార్యాభర్తలు. గుండన్న తమ్ముడు నారాయణ (40), వదిన జానకమ్మతో వెళ్లిపోయి మరో గ్రామంలో మూడు వారాల క్రితం కాపురం పెట్టాడు.

దీంతో ఆగ్రహంతో ఉన్న గుండన్న సోమవారం తమ్ముడు నారాయణ పొలంలో ఉండగా కత్తితో వెళ్లి నరికి చంపాడు. తమ్ముడి తలను మూటగట్టుకుని, పొరుగూరులో ఉన్న భార్య జానకమ్మ వద్దకు వెళ్లాడు. వెంటాడి మరీ ఆమెను హతమార్చాడు. ఆమె తలను కూడా శరీరం నుంచి వేరు చేసి, రెండు శిరస్సులనూ కావడి కట్టి తాను పోలీసులకు లొంగిపోతున్నట్టు చెప్పి నడుచుకుంటూ బయల్దేరాడు. చేతిలో కత్తితో నడిచి వస్తున్న గుండన్నను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు.  బాకూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పాడేరులోగల హుకుంపేట పోలీస్ స్టేషన్‌కు నడిచివెళ్లి, లొంగిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement