జనం మాట
అది గొప్ప నిర్ణయం
రేషన్, పింఛన్, ఆరోగ్యశ్రీ.. ఇలా ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో ఇచ్చేందుకు ఊరూరా జనసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గొప్ప నిర్ణయం. ఇప్పుడు రేషన్‌కార్డు కోసం రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.
- అరుణ, ఆబాద్పేట, హిందూపురం
మా ఆకలి తీరుతుంది
ఎంతో మంది ముసలోళ్లు అర్ధాకలితో అలమటించేవారు. అలాంటి సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్ మొత్తాన్ని రూ.200కు పెంచారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.700 చేస్తానని మాట ఇవ్వడం సంతోషదాయకం. ఇది మా ఆకలిని తీర్చే నిర్ణయం.
- అంజినమ్మ, రొద్దం
రైతుల గురించి పెద్దగా ఆలోచించారు
వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల గురించి పెద్దగా ఆలోచించారు. ఉచిత విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి, వ్యవసాయ పరికరాల కోసం రూ.3 లక్షల దాకా పావలావడ్డీ రుణాలు, ఇంటికి రూ.వందకే విద్యుత్ సరఫరా వంటి పథకాలు బాగున్నాయి. ఆయన ముఖ్యమంత్రి అయితే పేదలు, రైతులు బాగుపడతారు.
- ఆదినారాయణ,
నిమ్మలకుంట(ధర్మవరం)
ఇంతకన్నా ఇంకేం కావాలి?!
వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న ‘అమ్మఒడి’ పథకం అద్భుతంగా ఉంది. దీనివల్ల ప్రతిఒక్కరూ పిల్లలను బాగా చదివించుకుంటారు. ఇంతకన్నా ఇంకేం కావాలి?! వైఎస్ ఆశయాలను నెరవేర్చ గల సత్తా జగన్ మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది.
- శాంతమ్మ, కదిరి
వైఎస్ లాంటి నేత రావాలి
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలకు అంతా మంచే జరిగింది. ఆరోగ్యశ్రీ, 108 వంటి సేవలు ఇప్పటికీ ప్రజలకు ఉపయోగ పడుతున్నాయి. నేను ప్రమాదానికి గురైనప్పుడు 108 వల్లే ప్రాణం దక్కింది. ఇప్పుడు వైఎస్ లాంటి నేత రావాల్సిన అవసరముంది.
- నరసింహులు, హిందూపురం
చంద్రబాబు వల్లే చేనేత నిర్వీర్యం
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేనేత పరిశ్రమను విస్మరించారు. ఆయన హయాంలో పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యమై అనేకమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత చేనేతలకు భరోసా ఇచ్చారు. రుణ మాఫీ చేసి ఆదుకున్నారు. 50 ఏళ్లకే పింఛన్ వచ్చేలా చూశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ తప్ప ఏ పార్టీ చేనేతల గురించి ఆలోచించడం లేదు.
- గట్టు వెంకటేష్,
గాంధీనగర్, ధర్మవరం