నవంబర్ ఒకటి నుంచి మళ్లీ జన్మభూమి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించనుంది. నవంబర్ ఒకటి నుంచి ఎనిమిది పనిదినాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలుత అక్టోబర్ 2 నుంచి 20 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పదిరోజుల నిర్వహణ తరువాత హుదూద్ తుపాను కారణంగా దీనిని తాత్కాలికంగా వాయిదా వేయడం తెలిసిందే.