Janta Darbar
-
ట్రిపుల్ తలాక్ బాధితురాలికి యోగి అభయం
సాక్షి, గోరఖ్‌పూర్ : ట్రిపుల్ తలాఖ్ బాధితురాలికి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండగా నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ మంగళవారం గోరఖ్‌పూర్ మఠంలో జనతా దర్బార్ నిర్వహించారు. ఈ సమయంలో రాంపూర్‌కు చెందిన బాధిత ముస్లిం మహిళ.. ట్రిపుల్ తలాఖ్ గురించి ఆయనకు వివరించారు. ‘నాకు నాభర్త ఫోన్లోనే తలాక్.. అని ముమ్మారు చెప్పి విడాకులు ఇచ్చారని’ ఆమె వాపోయారు. విడాకులు ఇవ్వడమేకాక.. తనను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు అతియా బేగం యోగి ఆదిత్యనాథ్‌కు వివరించారు. అతియా బేగం ఆవేదనపై స్పందించిన యోగి ఆదిత్యానాథ్.. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళకు తప్పకుండా న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలపై దురాగతాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. My husband gave me Triple Talaq over the phone and also threatened to kill me. A law should be made to stop this. Today, I have come to CM's Janta Darbar, so, I can narrate my story to him: Triple Talaq victim from Ramapur pic.twitter.com/nfJVjNOtm9 — ANI UP (@ANINewsUP) November 21, 2017 -
రెండో రోజు ‘జనతా దర్బార్’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కూడా జనతా దర్బార్ నిర్వహించారు. కౌశంబీలోని ఆప్ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలను విన్నారు. గంటన్న పాటు జరిగిన జనతా దర్బార్‌లో దాదాపు 500 మంది పాల్గొన్నారు. జనం ఉదయం 8 నుంచే ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దర్బార్ ఉదయం 10 గంటలకు మొదలండంతో, పళ్లు , పూలమాలలు, మిఠాయిలతో వచ్చి కొందరు కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. మొదట వికలాంగులను కలిసిన కేజ్రీ, తరువాత ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళల చొప్పున బృందాలుగా వచ్చిన వారితో సమావేశమయ్యారు. 11.30 గంటలకు కేజ్రీవాల్ బయటకు వచ్చి ముఖ్యమైన సమావేశానికి హాజరుకావలసిఉన్నందున తాను బయలుదేరుతున్నానని చెప్పారు. తనను కలవలేకపోయినవారు అధికారులకు తమ పత్రాలు ఇచ్చి వెళ్లాలని సూచించారు. ‘ నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ సమస్యలు పరిష్కరిస్తాన్న నమ్మకంతోనే నన్ను ఎన్నుకున్నారు. పత్రాలు అధికారులకు ఇచ్చి వెళ్లండి.’ అని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిరాశ చెందిన అభిమానులు కేజ్రీవాల్ తమను కలవకుండా వెళ్లిపోవడం కొందరికి నిరాశ కలిగించింది. ‘నా సమస్యలు కేజ్రీవాల్‌కే చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చాను. కానీ ఆయన కలవలేకపోవడం బాధించింది.’ అని ద్వారకా నుంచి వచ్చిన మనోజ్కుష్వాహా ఆవేదన వ్యక్తం చేశారు. వెనుక గేటు గుండా వీఐపీలు వచ్చి కేజ్రీవాల్‌ను కలిశారని కొందరు ఫిర్యాదుచేశారు. ‘సీఎం నాసమస్య విన్నారు. అయితే ఉద్యోగం ఇవ్వలేనని, వసతి అవసరాలను తీర్చేడానికి ఏదైనా చేస్తానని హామీ ఇచ్చారు.’ అని దష్టిలోపం కలిగిన 45 ఏళ్ల ప్రేమ్ కుమార్ చెప్పారు . అయితే ‘ప్రజల నుంచి ఫిర్యాదు పత్రాలను స్వీకరించాం. పరిష్కారం కోసం వాటిని సంబంధిత అధికారులకు పంపుతాం’ అని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అమిత్ చాబ్రియా చెప్పారు. దర్బార్‌కు పటిష్ట భద్రత జనతా దర్బార్ కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చుట్టూ మూడంచెల భద్రతావ్యవస్థను ఏర్పాటుచేశారు. ‘ముఖ్యమంత్రి వికలాంగులను మొదట కలవాలన్న కోరారు. అందువల్ల వారు ఏ సమసయంలో వచ్చారన్న వివక్ష పాటించకుండా ఆయనను కలిసే ఏర్పాటుచేశాం’ అని కేజ్రీవాల్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన గాజియాబాద్ నగర మెజిస్ట్రేట్ కపిల్‌సింగ్ చెప్పారు. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు సీఎం ప్రజలను కలుస్తారని ఆప్ కార్యకర్తలు చెప్పారు. కేజ్రీవాల్ రాజు కాదు కేజ్రీవాల్ ప్రజలను కలిసే సమావేశాలను జనతాదర్బార్గా పేర్కొనడంపై మాజీ మంత్రి మాలవీయనగర్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీ అభ్యంతరం వ్యక్తం చేశారు. జనతా దర్బార్ అంటే రాజు ప్రజలను కలిసినట్లుగా ఉందని, కానీ కేజ్రీవాల్ రాజు కారని, ఆయన ప్రజలలో ఒకరని సోమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఆయన బ్రహ్మకుమారీతో కలసి సీఎంతో సమావేశమయ్యారు. -
సమస్యలపై కేజ్రీ దర్బార్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇలా చేసినా.. అప్పట్లో సరైన ప్రణాళిక లేక.. అది మధ్యంతరంగా ఆగిపోయింది. ఈసారి పూర్తిస్థాయిలో అధికారం దక్కించుకున్న ఆయన సమస్యలున్నవారు నేరుగా రావాలంటూ కార్యక్రమం ప్రారంభించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఆయన ఘజియాబాద్‌లోని తన పార్టీ కార్యాలయం కౌశాంబిలో ప్రజాదర్బార్ నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి 200 మందిని ఆహ్వానించి నలుగురు చొప్పున లోపలకు పిలిచి వారి సమస్యలు విన్నారు. ఇక నుంచి ఇది ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం పార్టీ అనవాయితీగా నిర్వహించే కార్యక్రమంలా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ), కార్మిక, విద్యుత్, మున్సిపాలిటీ శాఖల్లోని సమస్యలు ప్రజల నుంచి తెలుసుకుంటారు. వీటిపై ముందుగా నిర్ణయించిన తేదీల్లో ప్రజల స్పందన కోరుతారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అధికారులు కూడా తాము కేటాయించిన ఫోన్ నంబర్లకు కాల్ చేయడం ద్వారా గానీ, ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా గానీ ప్రభుత్వంతో మమేకం కావొచ్చిన పార్టీ నేతలు తెలిపారు. -
జనతా దర్బార్‌కు భారీగా జనం.. మధ్యలోనే వెళ్లిన కేజ్రీవాల్
-
జనతా దర్బార్‌కు భారీగా జనం.. మధ్యలోనే వెళ్లిన కేజ్రీవాల్
ఢిల్లీ సచివాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జనతా దర్బార్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. వేలాది మంది ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి వచ్చారు. అక్కడకు ముఖ్యమంత్రితో పాటు మొత్తం మంత్రులంతా వచ్చారు. బ్యారికేడ్లు కూడా పడగొట్టి మరీ జనం తోసుకురావడంతో వారిని నియంత్రించడం ఢిల్లీ పోలీసులకు, సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళానికి కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ సగంలోనే కార్యక్రమం వదిలి వెళ్లిపోయారు. అంతమంది ప్రజలు వస్తారని ఊహించలేకపోయామని, అందుకే వారిని నియంత్రించడం కష్టమైందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడం వల్లే అక్కడినుంచి వెళ్లానని తర్వాత కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. దాదాపు 50 వేల మంది ప్రజలు అక్కడికొచ్చినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఎక్కువ మంది డీటీసీ, బీఎస్ఈఎస్, వివిధ ప్రభుత్వాస్పత్రులు, మునిసిపాలిటీల్లాంటి శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులే ఉన్నారు. తన ఫ్లాటును కొంతమంది ఆక్రమించుకున్నారని సునీతా కపూర్ అనే మహిళ చెప్పారు. ఆమె ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకున్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేవరకు తాను విశ్రమించేది లేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా చెప్పారు. -
ప్రతి శనివారం జనతాదర్బార్ నిర్వహిస్తా: సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ వ్యవస్థ వివరాలను గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శనివారం జనతాదర్బార్తో ఈ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి ఫిర్యాదులను స్వీకరించడం కోసం ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రతి శనివారం ఉదయం సచివాలయం ఎదుటనున్న రోడ్డుపై జనతా దర్బార్ నిర్వహిస్తారని, మిగతా రోజుల్లో జరిగే జనతా దర్బార్‌కు ఎవరైనా ఒక మంత్రి హాజరై అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ప్రజలనుంచి అందే ఫిర్యాదులను ఐదు కేటగిరీలుగా విభజించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మొదటి కేటగిరీలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. అంటే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరించాలనేది మంత్రి సంబంధిత ఫైలుపై రాస్తారు. విధాన మార్పులు అవసరమైన ఫిర్యాదులను రెండవ కేటగిరీలో చేరుస్తారు. వీటిని సంబంధిత మంత్రులకు, ముఖ్యమంత్రికి పంపి ప్రభుత్వ విధానాలలో అవసరమైన మార్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. సమస్యల పరిష్కారానికి ప్రజలందించే సలహాలను మూడవ కేటగిరీలో చేరుస్తారు. ఈ సలహాలను అధ్యయనం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి హేతుబద్ధమైన సలహాలను అమల్లోకి తేవడానికి ప్రయత్నిస్తారు. నాలుగవ కేటగిరీలో ఇతర ఫిర్యాదులను, ఐదవ కేటగిరీలో ప్రభుత్వానికి సంబంధించని ఫిర్యాదులను చేరుస్తారు. అధికారులు పరిష్కరించినట్లుగా పేర్కొని మూసివేసిన కేసుల పర్యవేక్షణకు కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఫిర్యాదుదారులకు ఎస్ఎంఎస్లు పంపి అధికారులు చేపట్టిన చర్యలు వారికి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటామని, తమ కార్యకర్తలు తదనంతరం ఫోన్లు చేస్తారని ఆయన చెప్పారు. ఈ వ్యవస్థను ప్రారంభించిన వెంటనే ఫిర్యాదులు వెల్లువెత్తే అవకాశం ఉన్నందువల్ల ఇది వెనువెంటనే నూటికి నూరు శాతం ప్రభావపూరితంగా పనిచేస్తుందని ఆశించరాదని కేజ్రీవాల్ ముందుగానే హెచ్చరించారు. కాలక్రమేణా ఈ వ్యవస్థ ప్రభావపూరితంగా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం కిందకు రాని డీడీఏ, ఎమ్సీడీ, ఢిల్లీ పోలీసు విభాగాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆ విభాగాలే చూసుకుంటాయని ఆయన చెప్పారు. ప్రేమ పెళ్లిళ్లు చేయించలేను.. తాను ప్రేమ పెళ్లిళ్లు జరిపించలేనని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం నెలకొల్పనున్న వ్యవస్థ గురించి విలేకరులకు వివరిస్తున్న సమయంలో సీఎం ఇలా వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల తన వద్దకు ఒక యువతి వచ్చి తాను ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరిందన్నారు. ఆ యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని.. అతడితో తన వివాహం అయ్యేలా చూడాలని ఆమె కోరినట్లు సీఎం వివరించారు. పరిష్కరించాలని ఉన్నా, సీఎం అయినప్పటికీ తాను ఇలాంటి సమస్యలను పరిష్కరించలేనని ఆయన చెప్పారు.