ఢిల్లీకి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: హర్యానాలో జాట్ల ఆందోళన ప్రభావం ఢిల్లీపై పడుతోంది. సోమవారం కూడా ఢిల్లీలో పాఠశాలలు మూసివేయాలని ఆప్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమ ప్రభావంతో ఢిల్లీలో నీటి సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు.
సోమవారం నుంచి ట్యాంకర్ల ద్వారానైనా నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ నీటి కొరతను తీర్చే ప్రధాన నీటి కాలువ మునాక్ను జాట్లు మూసివేయడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలపై తీరని ప్రభావం పడే అవకాశం ఉంది.