jatara celebrations
-
ఘనంగా పోలమాంబ అమ్మవారి సారె జాతర (ఫొటోలు)
-
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
-
బిస్కెట్ జాత్రా..!: ఇదేం జాతర రా నాయనా..!
నేపాలీల కొత్త సంవత్సరం మేష సంక్రమణం రోజున జరుగుతుంది. ఇదేరోజు కఠ్మాండు సమీపంలోని భక్తపూర్లో ‘బిస్కెట్ జాత్రా’ వేడుకలు జరుగుతాయి. నిజానికి ఈ జాతర పేరు ‘బిస్కా జాత్రా’ అయినా, కాలక్రమంలో ‘బిస్కెట్ జాత్రా’గా జనాల్లో స్థిరపడింది. భక్తపూర్లో ఏటా ఈ జాతర జరుపుకోవడం వెనుక ఒక స్థలపురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకానొక కాలంలో భక్తపూర్ ప్రాంతాన్ని లిచ్చవి వంశానికి చెందిన శివదేవ మహారాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంపై చుట్టుపక్కల అడవుల్లో ఉండే కిరాతులు తరచు దాడులు చేస్తుండేవారు. తన రాజ్యానికి కిరాతుల బెడద లేకుండా చేయాలని కోరుతూ శివదేవ మహారాజు వజ్రయోగినిని ప్రార్థించాడు. కిరాతుల పీడను శేఖర్ ఆచాజు అనే తాంత్రికుడు విరగడ చేయగలడని, అతడి సహాయం తీసుకోమని వజ్రయోగిని సలహా ఇచ్చింది. శివదేవ మహారాజు తన పరివారాన్ని వెంటతీసుకుని శేఖర్ ఆచాజును కలుసుకుని, తన సమస్యను వివరించాడు. శేఖర్ ఆచాజు తన తాంత్రిక శక్తితో పులిగా మారిపోయాడు. తన శిష్యగణాన్ని కూడా పులులుగా మార్చాడు. పులుల గుంపు ఒక్కసారిగా మెరుపుదాడి చేయడంతో కిరాతుల దండు పటాపంచలై, పలాయనం చిత్తగించింది. శివదేవ మహారాజుకు కిరాతుల బెడద విరగడైంది. కిరాతులను తరిమికొట్టిన శేఖర్ ఆచాజును శివదేవ మహారాజు తన రాజ్యంలోని తిమి పట్టణానికి ఆహ్వానించి, సిందూరపు జల్లులతో ఘనస్వాగతం పలికాడు. ఈ సంఘటన తర్వాత శేఖర్ ఆచాజు శక్తి అతడి భార్య నరరూపకు తెలిసింది. తన ఎదుట ఒకసారి పాముగా మారి చూపించాలని కోరింది. శేఖర్ ఆచాజు ఆమె చేతికి కొన్ని వడ్లగింజలు ఇచ్చి, వాటిని తిరిగి తనపై చల్లితే యథారూపానికి వస్తానని చెప్పాడు. తన మంత్రశక్తితో కొండచిలువగా మారిపోయాడు. కొండచిలువను చూసి నరరూప భయంతో పరుగు తీసింది. తన నడుముకు ఉన్న దట్టీ బిగుతుగా ఉండి అడ్డుపడటంతో దాన్ని వదులు చేసుకోవడానికి భర్త తన చేతికి ఇచ్చిన వడ్ల గింజలను నోట్లో వేసుకుంది. వెంటనే ఆమె కూడా కొండచిలువగా మారిపోయింది. తిరిగి మానవ రూపంలోకి రావాలంటే, ఆ రహస్యం శివదేవ మహారాజుకు మాత్రమే తెలుసు. కొండ చిలువలుగా ఉన్న భార్యా భర్తలిద్దరూ పాకుతూ రాజు అంతఃపురంలోకి వెళ్లారు. ఆచాజు దంపతులే అలా వచ్చారని పోల్చుకోలేని రాజు కొండచిలువలను చంపేయమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వాటిని చంపేశారు. ఇది జరిగిన కొంతకాలానికి శివదేవ మహారాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. అప్పటి నుంచి పాముల రూపంలో మరణించిన ఆచాజు దంపతుల గౌరవార్థం ఏటా మేషసంక్రమణం రోజున ‘బిస్కా జాత్రా’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ జాతరలో భక్తపూర్ ప్రధాన వీథుల్లో భైరవుడిని, భద్రకాళిని రథాలపై ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని ‘థానే’ (ఎగువభాగం), ‘కోనే’ దిగువభాగం ప్రజల నడుమ పొడవాటి తాడును గుంజే ‘టగ్ ఆఫ్ వార్’ పోటీ జరుగుతుంది. మరుసటి రోజున ‘సిందూర్ జాత్రా’ జరుగుతుంది. జనాలు ఒకరిపై ఒకరు సిందూరం పూసుకుని, వీథుల్లోకి వచ్చి నృత్యగానాలతో సందడి చేస్తారు. (చదవండి: పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
గంగమ్మ తల్లికి సారె సమర్పించనున్న ఎమ్మెల్యే భూమన
-
విశాఖపట్నం : వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ అమ్మవారి జాతర (ఫొటోలు)
-
గాజుల రామారం లో ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)
-
యువకుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్
హుకుంపేట: యువకుడిపై సర్పంచ్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దాడికి పాల్పడడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాకూరు పంచాయతీ కేంద్రంలో బుధవారం సాయంత్రం శ్రీ పోతురాజుస్వామి జాతర మహోత్సవంలో భాగంగా డాన్స్బేబీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలోని స్టేజ్‌పై అదే గ్రామానికి చెందిన కాకర రవి ఎక్కి కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ సీనియర్ నాయకుడు, స్థానిక సర్పంచ్ వెంకటరమణరాజు, రవిని కొట్టడమే కాకుండా ముఖంపై కాలితో తన్నడంతో అతను గాయపడ్డాడు. దీనిపై సామాజిక మధ్యమాల్లో యువకుడిపై దాడి ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. (చదవండి: వేడెక్కుతున్న మన్యం) -
మేడారంలో ‘గుడిమెలిగె’
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్): మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర పూజాకార్యక్రమాలు బుధవారం జరగనున్న గుడిమెలిగె పండుగతో ఆరంభం కానున్నాయి. ఈ పండుగ నిర్వహించేందుకు పూజారులు మంగళవారం సాయంత్రంనుంచి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం (9న) మండమెలిగె పండుగకు వారానికి ముందుగా గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. మేడారంలోని సమ్మక్క గుడి పూర్వకాలంలో గుడిసెతో ఉండేది. గుడిసెపై కొత్త గడ్డి కప్పి, పందిళ్లు వేసేది. సమ్మక్క గుడి భవనం నిర్మించడంతో పూజారులు సంప్రదాయంగా బుధవారం ఉదయాన్నే సమ్మక్క గుడిని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరిస్తారు. అడవినుంచి సేకరించిన ఎట్టిగడ్డిని గుడిపై ఈశాన్య దిశలో పెడతారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి గుడిమెలిగె పండుగతో మహాజాతరకు అంకురార్పణ జరిగినట్లుగానే భావించాలి. కన్నెపల్లి సారలమ్మ గుడిలో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజారులు సిద్ధం గుడిమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం సమ్మక్క పూజారులు సమావేశమై పండుగ కార్యక్రమాల నిర్వహణపై చర్చించుకున్నారు. ఉదయాన్నే పూజారులు తలస్నానాలు అచరించి అడవికి వెళ్లి ఎట్టిగడ్డిని తీసుకురానున్నారు. గుడిమెలిగె సందర్భంగా భక్తులు కూడా వేలాది మంది తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. పూజా కార్యక్రమాలన్నింటినీ సమ్మక్క పూజారులు సిద్దబోయిన మునిందర్, కొక్కర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూపగడ్డ నాగేశ్వర్రావు, బొక్కెన్న, సిద్దబోయిన లక్ష్మణ రావు, సిద్దబోయిన మహేష్, పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, తదితరులు నిర్వహించనున్నారు. చదవండిః ‘పద్మశ్రీ’కి ఎంపికైన రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపరాఫర్ -
చిత్తారమ్మ ప్రధాన జాతరకు పోటెత్తిన భక్తులు
-
జాతర వెళ్లొద్దామా..
సాక్షి, సుల్తానాబాద్(పెద్దపల్లి): మినీ మేడారంగా ప్రసిద్ధిగాయించిన నీరుకుల్ల–వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న రంగానాయకస్వామి ఆలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతర వైభవంగా జరగనుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు పెద్దపల్లి జిల్లా నుంచేకాక ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. జారత ప్రదేశంలో మానేరు నది, గుట్టలు, పచ్చని చెట్లతో ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దాదాపు 3–4లక్షల భక్తులు దర్శించుకుంటారని అంచానం. గర్రెపల్లిలో 30 ఏళ్లుగా.. గర్రెపల్లిలో రాజీవ్రాహదారికి అనుకోని ఉన్న తిరుమలయ్యగుట్టపై 30 ఏళ్లుగా సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతుంది. మేడారం కొయపూజారులతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సుమారు లక్షయాభైకిపైగా మంది భక్తులు వస్తారు. భక్తులస్నానాలకు షవర్లు, చాలువ పందిర్లు, తాగునీటి, సాముహిక మరుగుదొడ్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. 46 ఏళ్లుగా కొలనూర్‌లో.. ఓదెల(పెద్దపల్లి): చుట్టూగుట్టలు..మూడువైపులా రహదార్లు..ప్రధాన రహదారికి పక్కనగల జంపన్నవాగు..సమ్మక్కసారలమ్మ గద్దెలపైకి కోయపూజారులతో ప్రతిష్ఠాపన రోజున శివసత్తుల పూనకాలతో దద్దరిల్లె ధనగుట్టలు కొలనూర్ శ్రీసమ్మక్కసారలమ్మ జాతర ప్రత్యేకతలు. పెద్దపల్లి జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే ఓదెల మండలం కొలనూర్ గ్రామంలోని సమ్మక్కసారలమ్మ జాతర గద్దెలు ముస్తాబయ్యాయి. ఫిబ్రవరి 5నుంచి 8వరకు జరిగే సమ్మక్కసారలమ్మ జాతర దర్శనంకోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. 1974లో ప్రారంభమైన జాతర నేటికి 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలనుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తారు. ఈనెల 5న సారలమ్మ గద్దెకు , 6న రాత్రి సమ్మక్కగద్దెకు వచ్చుట, 7న భక్తులు మొక్కులు సమర్పించుట, 8న దేవతల వనప్రవేశం ఉంటుంది. హైదరాబాద్, కొత్తగూడెం, నాగపూర్, సిర్పూర్కాగజ్నగర్ నుంచి రైళ్లతోపాటు ఆర్టీసీ, ప్రయివేట్ వాహనాల సౌకర్యం ఉంది. పటిష్ట బందోబస్తు పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనూర్ గ్రామంలో జరిగే సమ్మక్కసారలమ్మ జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫ్లెక్సీల ఏర్పాట్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధం. – పెట్టెం చంద్రకుమార్ ఎస్సై, పొత్కపల్లి గోలివాడకు 38 ఏళ్లు రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ గోదావరి నది ఒడ్డున ప్రతీరెండేళ్లకోసారి నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు 38 ఏళ్లుపూర్తికానున్నాయి. గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్‌రావు అలియాస్ బయ్యాజీ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఓసారి గోదావరినదిలో పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లగా అదే ప్రాంతంలో ఇసుకలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణి మూట లభ్యమైంది. దాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో సమ్మక్క కళలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలోనే శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దెరాజుల గద్దెలు నిర్మించి ప్రతీరెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. విషయాన్ని గ్రామ పెద్దలు పెండ్రు హన్మాన్రెడ్డి, ఆవుల చంద్రయ్యకు సమాచారం ఇచ్చి మరోసారి కుంకుమ భరణి లభ్యమైన ప్రాంతానికి వెళ్లి చూడగా మరోసారి పూజ సామగ్రి కనిపించడంతో మరింత నమ్మకం కుదిరింది. 1982లో అదే ప్రాంతంలో గద్దెల నిర్మాణం చేపట్టి తొలిసారి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహించారు. అప్పటినుంచి జాతర వ్యవస్థాపకులతో జాతర నిర్వహణ కొనుసాగుతోంది. కోల్‌బెల్ట్‌లో 28 ఏళ్లుగా.. కోల్‌సిటీ/గోదావరిఖని(రామగుండం): గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సమ్మక్క–సారలమ్మ’ జాతర ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్దది. ఉమ్మడి జిల్లాలో సుమారు 60 ప్రాంతాలలో దేవాదాయశాఖ నేతృత్వంలో జాతర నిర్వహిస్తుండగా, వీటిలో ఎక్కువ ఆదాయం, లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ప్రాంతం గోదావరిఖనిలో జరుగుతున్న జాతర ఒక్కటే పెద్దది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, ఆదిలాబాద్ నాలుగు జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన సమీపంలో రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. 28 సంవత్సరాలుగా జాతర... వరంగల్ జిల్లాలోని మేడారం జాతరకు పారిశ్రామిక ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు తరలివెళ్లేవారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు ఎక్కువగా పాల్గొనేవి. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం, 1992లో తొలిసారిగా గోదావరిఖనిలోని గోదావరినది ఒడ్డున జాతర ఏర్పాటు చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి ఇక్కడే జాతర జరుగుతోంది. 1996లో జాతర నిర్వహణ బాధ్యతలు దేవాదాయశాఖ ఆధీనంలోకి రావడంతో అప్పటి నుంచి దేవాదాయశాఖ జాతర నిర్వహిస్తోంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, సింగరేణి తదితర సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి. నాలుగు జిల్లాల భక్తులకు అనుకూలం... పెద్దపల్లి– మంచిర్యాల–కొమురంభీం–ఆదిలాబాద్ నాలుగు జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన సమీపంలో నిర్వహిస్తున్న ఈ జాతరకు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, సెంటనరీకాలనీ, యెటింక్లయిన్‌కాలనీ, కమాన్‌పూర్, మంథని, గుంజపడుగుతోపాటు మంచిర్యాల, కొమురంభీం, ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, చెన్నూర్, కిష్టాపూర్, ఇందారం, పౌనూర్, ఏలాల, కుందారం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల ప్రజలు జాతరకు భారీగా తరలివస్తారు. వీరితోపాటు సింగరేణి కార్మికుల కుటుంబాలతో సత్సంబంధాలు కలిగిన జయశంకర్ జిల్లా నుంచి కూడా భక్తులు గోదావరిఖనిలో జరిగే జాతరకు తరలిరావడం గమనార్హం. రూ.లక్షల్లో ఆదాయం 2012 సంవత్సరంలో రూ.29 లక్షలు ఆదాయం రాగా, 2016లో 37 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2016లో సుమారు నాలుగున్నర లక్షల మంది భక్తులు హాజరయ్యారు. 2018లో రూ.41.32 లక్షల ఆదాయం రాగా, సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు కూడా సుమారు 6 నుంచి 8 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని దేవాదాయశాఖ ఈవో డీ.వీ.మారుతిరావుతోపాటు ధర్మకర్తల మండలి ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు... రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతోపాటు నగరపాలక సంస్థ సంయుక్తంగా వన దేవతల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలకు మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. బూడిద ఇటుకలతో ఆలయ ప్రాంగణంతోపాటు భక్తులు క్యూలైన్లో ఫ్లోర్ నిర్మాణం చేపడుతున్నారు. బీ–గెస్ట్‌హౌజ్ సమీపంలోని దేవాలయంతోపాటు సమ్మక్క–సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రహరీగోడ, ముఖద్వారానికి రంగులు వేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జాతర మైదానం శుభ్రం చేయడంతోపాటు విద్యుత్ దీపాలంకరణకు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకోవడానికి శాశ్వత గదులు నిర్మిస్తున్నారు. జాతర నిర్వహించే ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థంకోసం తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మహిళలు గోదావరిలో స్నానం చేయడానికి షవర్లు, దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మిస్తున్నారు. జాతర నిర్వహించే ప్రాంతంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ నుంచి మట్టిని పోసి దుమ్ములేవకుండా శుభ్ర పరుస్తున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా, బల్దియా ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కానుకలు సమర్పించడానికి ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి కొలనూర్ గ్రామంలో జరిగే జాతరకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహారాష్ట్రతోపాటు మిగతా జిల్లాలనుంచి వచ్చే భక్తులకు నీడ, తాగునీటి, వైద్యం, విద్యుత్, రహదార్లను బాగుచేశాం. దేవతలను దర్శనం చేసుకోవడానికి సులువుగా మార్గాలు ఏర్పాటు చేశాం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – బండారి ఐలయ్యయాదవ్, చైర్మన్ కొలనూర్ -
ఘోర ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
సాక్షి, ఎన్పీకుంట: జాతర నుంచి ఇళ్లకు బయల్దేరిన ఇద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాల్లోకెళ్తే... ఎన్పీకుంట మండలం మండెంవారిపల్లికి చెందిన పలువురు ఆదివారం తలుపుల మండలం పంతులోల్లపల్లిలో గంగమ్మ జాతరకు వెళ్లారు. సోమవారం ట్రాక్టర్లో తిరుగుపయనమయ్యారు. ఎన్పీకుంటలోని కొత్తరోడ్డు సమీపాన సీతారామ్ బావి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో హరినాయుడు (33), గిరినాయుడు (12) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. కదిరి రూరల్ సీఐ రెడ్డప్ప, స్థానిక ఎస్ఐ యతీంద్ర తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను 108 ద్వారా కదిరి ఆస్పత్రికి తరలించారు. -
జాతరను విజయవంతం చేద్దాం
పాపన్నపేట(మెదక్):మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల్లో జరిగే మహాజాతరను అధికారులంతా సమన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాతరపై ఏడుపాయల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతరన్నారు. ఈ ఏడాది మాఘ అమావాస్య పుణ్య స్నానాలకు వెల్లువలా తరలివచ్చిన భక్తజనాలను చూస్తే.. శివరాత్రి జాతరకు సుమారు 10లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున అదే స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు తరలివచ్చే ఏడుపాయల జాతరలో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. ఈసారి మంజీరా నదిలో నీరు లేనందున ఘనపురం ప్రాజెక్ట్ మడుగుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి చెక్‌డ్యాం నింపాలన్నారు. అమ్మవారి ఆలయం ముందు వరకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల స్నానాల కోసం షవర్ బాత్‌ల సంఖ్య పెంచాలన్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు అనువుగా వసతులు కల్పించాలన్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ట్యాంకర్లను వినియోగించాలని ఆదేశించారు. భక్తుల సంఖ్యకనుగుణంగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టి రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు. 750 మంది పంచాయతీ సిబ్బందితో నిరంతరం సేవలు అందించాలని ఆదేశించారు. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా 24గంటల పారిశుధ్య సేవలు అందించాలన్నారు. మంజీరానదిలో ఎక్కడి పడితే అక్కడ భక్తులు స్నానాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌ను విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. ఈసారి పోతంశెట్టిపల్లి వైపు నుంచి కూడా జాతరకు వాహనాలను అనుమతిస్తామన్నారు. ఎడ్లబండ్లకు పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయించాలన్నారు. అమ్మవారి ఆలయాన్ని, రాజగోపుర, పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. 24గంటలపాటు నిరంతర విద్యుత్ అందించాలని సూచించారు. వైద్య సౌకర్యాలు 24గంటలు అందుబాటులో ఉండాలన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను జాతరలో ప్రచారం చేయాలని సూచించారు. ఈ పనులన్నీ 25వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తిరిగి 26న సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పుడు పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జాతర నిర్వహణ విఫలమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. జాతరకు 1,150 మంది పోలీసులను బందోబస్తుకోసం నియమిస్తున్నట్లు అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. కాలినడనక కలెక్టర్ ఏడుపాయల్లో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కలెక్టర్, జేసీ నగేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ నాగరాజు, ఆర్డీఓలు ఇతర అధికారులతో కలిసి ఘనపురం ఆనకట్టపై నుంచి కాలినడకన జాతర జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ఏడుపాయల్లోని చెక్‌డ్యాం, అమ్మవారి ఆలయం, ఘనపురం ఆనకట్ట, అంతర్గత రోడ్లు, బస్టాండ్ ప్రదేశం, విద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడ చేసే ఏర్పాట్లను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు. వారి వెంట ఏడుపాయల పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌శాఖ, ఫారెస్ట్‌శాఖ అధికారులతోపాటు తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకావ్, డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు, పాలకవర్గ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా ప్రారంభమైన ఎడ్ల పందాలు
ఎర్రగుంట్ల (వైఎస్ఆర్జిల్లా) : ఏరువాక గంగమ్మతల్లి జాతర మహోత్సవం(ఆవులపబ్బము) సందర్భంగా సోమవారం వైఎస్ఆర్జిల్లా ఎర్రగుంట్లలోని జెడ్పీ క్రీడామైదానంలో ఎడ్ల పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో వివిధ జిల్లాల నుంచి 14 ఎడ్ల జతలు పాల్గొంటున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50వేలు నిర్ణయించారు.