వారికన్నా వ్యభిచారులు నయం
- జేఎన్ యూ విద్యార్థినులను ఉద్దేశించి హర్యానా సీఎం ఓఎస్డీ తీవ్ర వ్యాఖ్యలు
గుర్గావ్: పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష అమలైన కశ్మీరీ ప్రొఫెసర్ అఫ్ఝల్ గురు సస్మరణ సభతో మొదలైన రాజకీయ కాష్టం అంతకంతకూ పెద్దదవుతోంది. ఆరోపణా ప్రత్యారోపణల పర్వం శృతిమించుతోంది. విద్యార్థి నాయకులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థినులను ఉద్దేశించి హర్యానా సీఎంకు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జవహర్ యాదవ్.. శనివారం ట్విట్టర్ లో తీవ్రవ్యాఖ్యలు చేశారు.
'ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్ యూ)లో అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించడమేకాక, ఆ చర్యను సమర్థించుకుంటూ అక్కడి విద్యార్థినులు ఆందోళన నిర్వహిస్తుండటం సిగ్గుచేటు. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఆ విద్యార్థినుల కన్నా వ్యభిచారిణులు నయం. రెండోవాళ్లు కేవలం ఒళ్లమ్ముకుంటారు. దేశాన్ని కాదు' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జవహర్ యాదవ్. గతంలో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేచేసిన జవహర్ యాదవ్.. ప్రస్తుతం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కు ప్రత్యేక అధికారి(ఓఎస్డీ)గా వ్యవహరిస్తున్నారు.