డీవీడీలో కొత్త క్లైమాక్స్
హాలీవుడ్ సూపర్హీరోలందరూ కలిసి తమ సాహసాలతో మైమరిపించిన చిత్రం ‘ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’. గతంలో వచ్చిన ‘ఎవెంజర్స్’కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే కలెక్షన్లతో అదరగొడుతోంది. జాస్ వీడన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లూరే డీవీడి వెర్షన్లో సినిమాలో లేని కొత్త పతాక సన్నివేశాలను అందిస్తున్నారు. దాంతోపాటు సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలను కూడా అందులో జోడిస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఆగస్టులో ఈ బ్లూరే డీవీడి విడుదల కానుంది.