jayashankar agriculture university
-
తెలంగాణకు తగ్గట్టుగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అను సరించి ఉద్యాన (హార్టి్టకల్చర్) విధానాన్ని రూపొం దించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు మరింత విస్తరి ంచే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. హార్టి కల్చర్ యూనివర్సిటీని బలోపేతం చేయాలన్నారు. తెలంగాణలో హార్టి్ట కల్చర్ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధ తుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందు కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యా లయం ప్రాంగణంలో 300 ఎకరాలను కేటాయిస్తు న్నట్టు ప్రకటించారు. శుక్రవారం ప్రగతి భవన్లో ‘ఉద్యాన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణా ళిక’ అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, హార్టి్టకల్చర్ వర్సిటీ వీసీ నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మూస పద్ధతిలో... ‘‘ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూస పద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీళ్లతో సాగైన వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. తద్వారా సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో వ్యవసాయం బాగా వెనకబడిపోయింది. వ్యవసాయ రంగానికి ఓ విధానం రూపొందించక పోవడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లాంటి ఉద్యాన పంటల సాగు చాలావరకు విస్మరించబడింది. సర్కార్ చర్యలతో గాడినపడిన వ్యవసాయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణం, రైతుబంధు వంటి వ్యవసాయ ప్రోత్సాహక చర్యలతో తెలంగాణ వ్యవసాయం గాడిలో పడింది. దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా ముందుకు సాగుతున్నది. రైతన్నల జీవితాలు గుణాత్మక అభివృద్ది దిశగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్ విధానాన్ని రూపొందించుకోవాలి. మనది అత్యంత అనుకూల ప్రాంతం మన నేలలు, పంటల స్వభావం మనకు అర్థమవు తోంది. తెలంగాణ నేల అద్భుతమైన సాగు స్వభా వాన్ని కలిగి ఉంది. ఇక్కడ కురిసే వర్షాలు, గాలి, వాతావరణం హార్టీకల్చర్ పంటలకు అత్యంత అనుకూలమైనవి. అందువల్ల ఉద్యాన పంటలను తెలంగాణలో అద్భుతంగా పండించవచ్చు. సాగునీటి ప్రాజెక్టుల వలన నీరు పుష్కలంగా లభిస్తున్న నేపథ్యంలో తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేందుకు మన రైతాంగాన్ని ఉద్యాన పంటల సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరముంది. ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకుని, ఉద్యాన నర్సరీలను నెలకొల్పే రైతులకు, పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు.. రైతుబంధుతో పాటుగా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు కార్యాచరణ రూపొందించాలి. పండ్లు, కూరగాయలు, పూల సాగులో ఉద్యానవన శాఖ ఇప్పుడెలా వుంది? భవిష్యత్తులో ఎలా ఉండాలో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దిగుమతి స్థాయి నుంచి ఎగుమతికి పెరగాలి తెలంగాణలో మొత్తం 129 మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్ నగరాలు, పట్టణాలున్నాయి. వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసరాలను అందించేందుకు ఆ పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపిక చేసి, కూరగాయలు తదితర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా తెలంగాణలోని పట్టణ ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదు. అదే సమయంలో ఎగుమతి చేసే దిశగా ఉద్యానవన శాఖ చర్యలు చేపట్టాలి. అంతర్గతంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకునే వీలుంది. ఉద్యాన శాఖకు నలుగురు ఉన్నతాధికారులు ఉద్యానవన శాఖలో పని విధానాన్ని వికేంద్రీకరించుకోవాలి. పని విభజన జరగాలి. ఇప్పుడు ఉద్యానవన శాఖకు ఒకే కమిషనర్ ఉన్నారు. ఇక నుంచి పండ్ల తోటల సాగుకోసం, కూరగాయలు.. ఆకుకూరల సాగు కోసం, పామాయిల్ సాగు కోసం.. మొత్తంగా నలుగురు ఉన్నతాధికారులను నియమించాలి. సాగు ఖర్చు తగ్గించాలి రైతులకు పంటల సాగులో విపరీతమైన ఖర్చు పెరిగిపోతోంది, సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకుని సాగువిధానాలను రూపొందించుకుని రైతు సాగు ఖర్చు తగ్గించుకునే దిశగా వ్యవసాయ శాఖ విధివిధానాలు రూపొందించుకోవాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పనిచేస్తున్నారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేసి, రైతుల సెల్ ఫోన్లకు కూడా మెసేజీలు పంపిస్తున్నారు. ఈ విధానం దేశంలో మరెక్కడా లేదు. కేంద్రం అమలు చేస్తున్న నూతన సాగు చట్టాలతో సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందాం..’’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్య కేంద్రాల్లో సమీకృత కూరగాయల మార్కెట్లు వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే స్ఫూర్తితో సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల సెంటర్లలో గజ్వేల్ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
పాల పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ వ్యాపకంగా పాల పుట్టగొడుగుల(మిల్కీ మష్రూమ్స్) పెంపకాన్ని చేపట్టవచ్చని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సూచిస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే పాల పుట్టగొడుగుల పెంపకం ద్వారా రైతులు నిరంతరాయంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చని, తమకు అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ పెట్టుబడితోనే పుట్టగొడుగుల సాగును చేపట్టవచ్చని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల మొక్కల తెగుళ్ల శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీల తెలిపారు. తమ కళాశాల ఆవరణలో రైతులకు ప్రతి నెలా మూడో శనివారం ఆమె శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వపరంగా పుట్టగొడుగుల సాగుపై సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు తగిన శిక్షణ ఇస్తున్నది ఈ ఒక్క చోట మాత్రమే. శిక్షణ పొందిన వారు తమ ప్రాంతంలో పుట్టగొడుగుల అమ్మకం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చు. రైతులు, ఇతర స్వయం ఉపాధి మార్గాలను అనుసరించే వారు దీన్ని ఉప వ్యాపకంగా చేపట్టవచ్చు. ఆసక్తి గల వారు ప్రతి నెలా మూడో శనివారం నేరుగా తమ కళాశాలకు వచ్చి రూ. 500 చెల్లించి శిక్షణ పొందవచ్చని డా. ప్రమీల వివరించారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు, నేరుగా వచ్చి.. ప్రతి నెలా మూడో శనివారం ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు శిక్షణ పొందవచ్చు. సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. గ్రామాల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వరి గడ్డి, వెదురు కర్రలు తదితరాలను వినియోగించి.. రూ. వెయ్యి పెట్టుబడితో కూడా పాల పుట్టగొడుగుల సాగును ప్రారంభించవచ్చని డా. ప్రమీల వివరించారు. శిక్షణ పొందిన వారిని ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చి.. తదనంత కాలంలో పుట్టగొడుగుల సాగులో వచ్చే సమస్యలు, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తామన్నారు. పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సిన విత్తనం ధర కిలో రూ. 100 ఉంటుంది. కిలో విత్తనంతో సుమారు రూ. 2 వేల ఖరీదైన పుట్టగొడుగుల దిగుబడి పొందవచ్చన్నారు. మెలకువలు పాటిస్తే ప్రతి పుట్టగొడుగునూ 130 నుంచి 230 గ్రాముల బరువు వరకు పెంచవచ్చన్నారు. మామూలుగా 3–4 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే 15–20 రోజులుంటాయి. పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారం! పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారమని, అయినా మాంసాహారంలో ఎక్కువగా ఉండే బి12తోపాటు విటమిన్ డి, బి, నియాసిన్ వంటి విటమిన్లు.. కాల్షియం, సెలీనియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయని డా. ప్రమీల తెలిపారు. బి12 విటమిన్ కేన్సర్ రాకుండా చేస్తుందని, కేన్సర్‌ను నయం చేస్తుందన్నారు. పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తింటే చర్మ సమస్యలు ఉపశమిస్తాయని, బీపీ నియంత్రణలో ఉంటుందని, పీచు పుష్కలంగా ఉండటం మూలాన ఊబకాయాన్ని తగ్గించడంలోనూ ఉపకరిస్తాయన్నారు. ఎండబెట్టిన పుట్టగొడుగుల పొడితో జావ చేసుకొని తాగినా, ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని కూర వండుకొని తిన్నా విటమిన్ డి లోపం తగ్గిపోతుందని ఆమె వివరించారు. ఎండబెట్టుకోవడానికి ఆయిస్టర్ మష్రూమ్స్ అనువుగా ఉంటాయన్నారు. వివరాలకు.. డా. ప్రమీలను 040–24015011 నంబరు ద్వారా సంప్రదించవచ్చు. ∙ఎండిన పుట్టగొడులతో డా. ప్రమీల -
అంగట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 234 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా జరగనున్నాయి. దీంతో ఆ పోస్టులను దక్కించుకునేందుకు అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలోకి దిగారు. వారికి ఉన్నతస్థాయి పలుకుబడి కలిగిన కొందరు ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయానికి చెందిన మరికొందరు కీలకాధికారులూ సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు అండగా అన్నట్లు ఇంటర్వ్యూ కోసం ఏకంగా 25 మార్కులు కేటాయించారు. గతంలో కేవలం 5–10 మార్కులే ఇంటర్వ్యూలో ఉండేవి. తాజాగా ఇంటర్వ్యూకు అధిక మార్కులు కేటాయించడంతో అన్ని అర్హతలు కలిగిన వారిని కూడా బరి నుంచి తప్పించి, పైరవీ చేసుకునే వారిని ఎంపికచేసే అవకాశం కల్పించినట్లయిందని అదే వర్సిటీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు విశ్లేషిస్తున్నారు. ఇంటర్వ్యూకు అన్ని మార్కు లు కేటాయించాల్సిన అవసరమేంటన్న ప్రశ్న అందరిలో నెలకొంది. ఇటీవల మహారాష్ట్రలో ఇలాగే వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తే, కేవలం 15 మార్కులే ఇంటర్వ్యూకు కేటాయించారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇంటర్వ్యూకు అధిక మార్కులు కేటాయించి అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్కారు విడుదల చేసిన జీవో ప్రకారం ఈ పోస్టుల ఎంపిక కోసం 100 మార్కులు కేటాయించారు. అందులో అకడమిక్ రికార్డు, డొమైన్ నాలెడ్జ్, అనుభవం, పబ్లికేషన్లు, అవార్డులకు 75 మార్కులు కేటాయించారు. ఇక ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయించారు. ఆ ప్రకారం ఇంటర్వ్యూలో కాంప్రెహెన్సివ్ డొమైన్ నాలెడ్జికి 10 మార్కులు, టీచింగ్/శిక్షణ, డెమో లెక్చర్‌కు 5 మార్కులు, టీచింగ్, పరిశోధన, ఎక్స్టెన్షన్ ఆప్టిట్యూడ్‌కు 5 మార్కులు, టెక్నాలజీ బదిలీలో అనుసరించే నైపుణ్యానికి 5 మార్కులు కేటాయించారు. మొదటి 75 మార్కులు కేవలం అభ్యర్థి వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానే సాధిస్తారు. ఇక ఇంటర్వ్యూలోని 25 మార్కుల ద్వారా అక్రమాలకు తెరలేపుతారన్న ఆరోపణలున్నాయి. పీహెచ్‌డీకి వెయిటేజీ తొలగింపు? పీహెచ్‌డీకి గతంలో వెయిటేజీ ఉండేది. ఇప్పుడు దాన్ని ఎందుకు తీసేశారని పలువు రు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల పీహెచ్డీ చేసిన వారికి, ఎంఎస్సీ చేసిన వారికి ఎలాంటి తేడా ఉండదని అంటున్నారు. ఇంటర్వ్యూ మార్కులు తగ్గించాలనుకున్నాం... కానీ వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూకు మార్కులు తక్కువగానే ఉండాలని భావించాం. కానీ 25 మార్కులు కేటాయించక తప్పలేదు. తగ్గించే వెసులుబాటు లేకే ఇలా చేశాం. - పార్థసారథి, కార్యదర్శి, వ్యవసాయశాఖ ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు? కొందరు దళారులు, అభ్యర్థులు రాష్ట్రంలో కీలకమైన కొద్దిమంది ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి పైరవీలు ముమ్మరం చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఏకంగా 234 పోస్టులు ఉండడంతో కొందరు దళారులు పైరవీలపై తీవ్రంగా దృష్టిసారించారని తెలుస్తోంది. ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదని పెద్ద ఎత్తున దందా మొదలుపెట్టారని తెలిసింది. వివిధ విభాగాల్లో ఒక్కో పోస్టుకున్న డిమాండ్‌ను బట్టి వసూళ్ల పర్వం ఉంటుందని అంటున్నారు. కొన్ని విభాగాల్లో ఒక పోస్టుకు 15 నుంచి 20 మంది అభ్యర్థులు పోటీ పడితే, కొన్ని పోస్టులకు ఒక్కో దానికి ఐదుగురు, నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువున్న పోస్టులకు అత్యధికంగా డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్కో పోస్టుకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని అదే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లే అంటున్నారు. గత అనుభవాల ప్రకారం చూసినా పోస్టుల దందా అత్యంత పకడ్బందీగా జరుగుతోందని వారు చెబుతున్నారు. గతంలో ఇంటర్వ్యూకు ముందే అభ్యర్థుల జాబితాను తయారు చేసుకొని ఎవరికి పోస్టులు ఇవ్వాలో నిర్ణయించేవారట. కొన్ని సందర్భాల్లో అభ్యర్థి పేరుకు ముందు మార్కులు, ఎవరి నుంచి పైరవీ అనే కాలమ్‌లు పెట్టుకొని కూడా దందా జరిగేదని ఒక ప్రొఫెసర్ పేర్కొన్నారు. అంతేకాక ఒకానొక సందర్భంలోనైతే పాలకవర్గ సభ్యునికో రెండు పోస్టుల చొప్పున కేటాయించారన్న ప్రచార మూ ఉంది. అంతేకాదు ప్రభుత్వ పెద్దల్లో ఎవరిరెవరి నుంచి పైరవీలు వచ్చాయో ముందే ఒక రహస్య జాబితా తయారు చేసుకొని ఆ ప్రకారం కేటాయింపులు జరిగేవి. ఇంటర్వ్యూకు 5–10 మార్కులున్నప్పుడే అన్ని అక్రమాలు జరిగితే, 25 మార్కులకు పెంచాక ఇప్పుడు ఇంకెన్ని అవకతవకలు జరుగుతాయోనన్న ప్రచారం జోరందుకుంది. -
10 ఎకరాల రైతు ఆదాయం అటెండర్ సంపాదన
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డీజీ డబ్ల్యూ.ఆర్. రెడ్డి ఆవేదన హైదరాబాద్‌లో వ్యవసాయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పదెకరాల రైతు ఆదాయం ప్రభుత్వ కార్యాలయాల్లోని అటెండర్ సంపాదనతో సమానంగా ఉందని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ.ఆర్. రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతు పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని అధిగ మించేందుకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరముందన్నారు. వ్యవసా య విస్తరణ వ్యూహాలు, ఆహార భద్రత, వాతావరణ మార్పులపై సర్వారెడ్డి వెంకు రెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్, పార్టిసి పేటరీ రూరల్ డెవలప్మెంట్ ఇనీషియేటి వ్స్ సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ సంయుక్తంగా 3 రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు శనివారం ఇక్కడ ప్రారంభమైంది. సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విస్తరణ పద్ధ తుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసర ముందన్నారు. ఆహార, పోషక భద్రత... కుటుంబ ఆదాయంపై ఆధారపడి ఉంటుందని, అందుకోసం రైతు కుటుంబాల ఆదాయం పెంపొందించే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. పంటల ఉత్పాదకత పెంచాలి.. రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి పంటల ఉత్పాదకత పెంచాలని, వ్యవ సాయేతర ఆదాయం అందేలా చూడాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) విస్తరణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎ.కె.సింగ్ అన్నారు. డిజిటల్ ఉపకరణాల ద్వారా రైతులకు వేగంగా సమాచారం అందిం చడానికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ విస్తరణలో విశేష సేవలు అందిం చిన డాక్టర్ సురేశ్ కుమార్, డాక్టర్ బిఎస్ హన్సాలను జీవన సాఫల్య పురస్కా రాలతో సత్కరించారు.