10 ఎకరాల రైతు ఆదాయం అటెండర్ సంపాదన
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డీజీ డబ్ల్యూ.ఆర్. రెడ్డి ఆవేదన
హైదరాబాద్‌లో వ్యవసాయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పదెకరాల రైతు ఆదాయం ప్రభుత్వ కార్యాలయాల్లోని అటెండర్ సంపాదనతో సమానంగా ఉందని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూ.ఆర్. రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతు పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని అధిగ మించేందుకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరముందన్నారు. వ్యవసా య విస్తరణ వ్యూహాలు, ఆహార భద్రత, వాతావరణ మార్పులపై సర్వారెడ్డి వెంకు రెడ్డి ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్, పార్టిసి పేటరీ రూరల్ డెవలప్‌మెంట్ ఇనీషియేటి వ్స్ సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ సంయుక్తంగా 3 రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు శనివారం ఇక్కడ ప్రారంభమైంది.
సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ డబ్ల్యూ.ఆర్.రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విస్తరణ పద్ధ తుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసర ముందన్నారు. ఆహార, పోషక భద్రత... కుటుంబ ఆదాయంపై ఆధారపడి ఉంటుందని, అందుకోసం రైతు కుటుంబాల ఆదాయం పెంపొందించే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
పంటల ఉత్పాదకత పెంచాలి..
రైతు ఆదాయం రెట్టింపు చేయడానికి పంటల ఉత్పాదకత పెంచాలని, వ్యవ సాయేతర ఆదాయం అందేలా చూడాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) విస్తరణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎ.కె.సింగ్ అన్నారు. డిజిటల్ ఉపకరణాల ద్వారా రైతులకు వేగంగా సమాచారం అందిం చడానికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ విస్తరణలో విశేష సేవలు అందిం చిన డాక్టర్ సురేశ్ కుమార్, డాక్టర్ బిఎస్ హన్సాలను జీవన సాఫల్య పురస్కా రాలతో సత్కరించారు.