'పార్టీ ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర'పై నేడు సదస్సు
సాక్షి,సిటీబ్యూరో: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘పార్టీ ఫిరాయింపులు - స్పీకర్ పాత్ర’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి తెలిపారు. బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం (జులై 31న) ఉదయం 10 గంటకు సదస్సు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు.
ప్రముఖ న్యాయ కోవిదులు జస్టిస్ బి.జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బి. శేషశయన రెడ్డి, లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి , ప్రముఖ రాజనీతి ఆచార్యులు ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావులు సదస్సులో ప్రసంగిస్తారని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు.