JDS party leader
-
ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
ఓ కాలేజీ ప్రిన్స్‌పాల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా.. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ సరైన సమాధానం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్‌పాల్.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో, సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone This happens when power goes to head Shame😈 pic.twitter.com/8RTCCud8Mo — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022 ఇది కూడా చదవండి: సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు -
కర్ణాటక హైడ్రామా.. కాంగ్రెస్, జేడీఎస్ ధీమా!
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేస్తుంటే తమ సంకీర్ణ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు బుధవారం ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకోగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించవచ్చనే ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ తన ఎమ్మెల్యేలతో గురుగ్రామ్‌లోని రిసార్ట్స్‌లో క్యాంప్ నిర్వహిస్తోంది. కర్ణాటకలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నా జేడీఎస్, కాంగ్రెస్ నేతలు పరిస్థితి తమ అదుపులోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముంబై హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, వారు తిరిగివచ్చి తమతో కలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాను రిలాక్స్డ్గా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గురుగ్రామ్‌లోని రిసార్ట్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇక కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఇది చిన్న విషయమని దీనికి ఏమంత ప్రాధాన్యం లేదని జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి అంతర్గత పోరు లేదని, ముంబై హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలందరితో తాను సంప్రదింపులు జరుపుతున్నానని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్ధానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా, వరుసగా 79, 37 స్ధానాలు గెలుపొందిన కాంగ్రెస్, జేడీఎస్‌లు బీజేపీకి చెక్ పెట్టేందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 18న సీఎల్పీ భేటీ కుమారస్వామి సర్కార్‌ను కూలదోసేందుకు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు సాగిస్తోందనే ప్రచారం నేపథ్యంలో తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ సంసిద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ గూటికి చేరకుండా అడ్డుకునేందుకు ఈనెల 18న సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సీఎల్పీ నేత సిద్ధరామయ్య అధ్యక్షతన ఈనెల 18న విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని సిద్ధరామయ్య కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. -
కరెంట్ రగడ
- విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై నిలదీసిన కుమారస్వామి - సమగ్ర దర్యాప్తునకు సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ - న్యాయ విచారణకు స్పీకర్ సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా సాగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయడానికి సభా సంఘాన్ని నియమించాలని శాసన సభలో జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ పద్దులపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన 2007-08 నుంచి 2012-13 వరకు విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకు ముందు 0.1 శాతంగా ఉన్న విద్యుత్ కొనుగోలు ఆ ఐదు సంవత్సరాల వ్యవధిలో 19 శాతానికి పెరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవధిలో రూ.17,480 కోట్లతో విద్యుత్నుకొనుగోలు చేశారని వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ధరను ఏడు శాతం నుంచి పది శాతానికి పెంచిన విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకు వస్తూ, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసక్తికరమైన చర్చ విద్యుత్ కొనుగోలు విషయమై సాదాసీదాగా ప్రారంభమైన చర్చ తీవ్ర ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్, కుమారస్వామి వాదనతో ఏకీభవిస్తూ దీనిపై ఏదైనా దర్యాప్తు జరిగితేనే మంచిదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సభ్యుడు శివమూర్తి ఇదో స్కామ్ అంటూ ఆరోపించారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా విద్యుత్‌ను కొనుగోలు చేస్తే, ఏదేదో ఆపాదిస్తారెందుకని ప్రశ్నించారు. బీజేపీ అప్పట్లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కాలానికి ఎందుకు, గత 20 ఏళ్ల వ్యవధిలో జరిగిన విద్యుత్ కొనుగోలుపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దశలో బీజేపీ, జేడీఎస్ సభ్యుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై న్యాయ విచారణ జరిపించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇదే సందర్భంలో ప్రభుత్వానికి సూచించారు.