JEE Applications
-
ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్!
ముంబై: ఆల్ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు కోల్పోయాడు. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు తల్లీ తండ్రీలేరు. కష్టపడి చదవి జేఈఈలో మంచి ర్యాంకు సంపాదించాడు. ఐఐటీ బోంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సైతం సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్‌నెంబర్‌పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫరదర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. దీంతో ఆయనకు నవంబర్ 10న విడుదలైన అడ్మిటెడ్ స్టూడెంట్స్ లిస్టు చూశాక షాక్ తగిలింది. ఆయన పేరు 93మంది విద్యార్దుల తుది జాబితాలో లేదు. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ ఈ నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. దీంతో ఈ విషయంపై బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టం పూడ్చేందుకు అదనపు సీటు కేటాయించాలని కోరుతున్నారు. తాను కేవలం సీటు దొరకడం వల్ల ఇకపై అడ్మిషన్ ప్రక్రియ ఉండదన్న అంచనాతో ఫ్రీజ్ లింక్‌ను క్లిక్ చేశానని కోర్టుకు చెప్పారు. అయితే విత్‌డ్రా చేసుకోవడం రెండంచెల్లో జరుగుతుందని, విద్యార్థి ఇష్టపూర్వకంగానే సీటు వదులుకున్నట్లు భావించాలని, ఆ మేరకు సదరు విద్యార్థ్ధికి రూ.2వేలు మినహాయించుకొని సీటు కోసం తీసుకున్న ఫీజు రిఫండ్ చేస్తామని ఐఐటీ పేర్కొంది. సీట్లు వృథా కాకుండా ఈ విధానం తెచ్చినట్లు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
జేఈఈ(మెయిన్స్) అప్లికేషన్స్ రీఓపెన్
సాక్షి, న్యూఢిల్లీ: ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ 2020 కోసం ఆన్లైన్ అప్లికేషన్స్‌ని రీఓపెన్ చేసింది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు, అప్లికేషన్ పూర్తిచేయని వారు ఆ ప్రక్రియ మొదలు పెట్టొచ్చు. మే 19 నుంచి ఆప్లికేషన్లులు jeemain.nta.nic.in లో అందుబాటులోకి రానున్నాయి. మే 24 సాయంత్రం 5 గంటల వరకు ఆప్లికేషన్లు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఫీజు మే24 రాత్రి 11:50 గంటల వరకు చెల్లించవచ్చు. (టిక్‌టాక్‌కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!) 📢Announcement Dear JEE (MAIN) 2020 applicants, after several requests received from you, I have advised @DG_NTA to allow you to make corrections for one last time in the particulars & choice of centre cities in the online application form. pic.twitter.com/WnVBG3Unuu — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 19, 2020 ఈ విషయం గురించి మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ ట్వీట్ చేస్తూ ‘జేఈఈ (మెయిన్స్) 2020 అభ్యర్థులరా, మీ నుంచి చాలా విజ్ఞప్తులు రావడంతో, అప్లికేషన్లో అభ్యర్థులకు సంబంధించిన వివరాలు మార్చుకోవడానికి, పరీక్షా కేంద్రాలు మరల ఎంపిక చేసుకోవడాని వీలు కల్పించాలని ఎన్టీఏ డీజీని ఆదేశించాం’ అని పేర్కొన్నారు. ఎవరైతే విదేశాల్లో చదవానలను కొని కరోనా కారణంగా ఆగిపోయారో వారికి భారత్‌లో చదవడానికి ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. అప్లికేషన్ పత్రాలు సమర్పించడానికి వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఎన్టీఏ డీజేని కోరినట్లు చెప్పారు. తొందరగా అప్లికేషన్లను సమర్పించండి. మే 24 వరకు సమయం ఉంది అని పొక్రియాల్ ట్వీట్ చేశారు. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!) 📢Students who dropped the idea to study abroad, here is your chance to pursue your studies in India. I have advised @DG_NTA to give one more opportunity to students to submit new/complete online application form for JEE (Main) 2020. Hurry! Forms available till 24th May. pic.twitter.com/hSwXQ9GBjX — Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 19, 2020 -
‘ఆధార్’ ఐడీతోనూ జేఈఈ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ దరఖాస్తుల సమయంలో విద్యార్థుల దగ్గర ఆధార్ నంబర్ లేకపోతే వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సూచించింది. వచ్చే నెల 1 నుంచి ప్రారంభం అయ్యే జేఈఈ మెరుున్ దరఖాస్తుల్లో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో విద్యార్థులు ఆధార్ నంబర్‌ను తీసుకోవాలని, లేని వారు ఆధార్ వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకునేందుకు జేఈఈ పరీక్ష కేంద్రాలుండే పట్టణాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రాల్లో ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. తమ సహాయక కేంద్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సదుపాయం లేకపోతే విద్యార్థులు అక్కడే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న వారికి సహాయక కేంద్రం రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేస్తుందని, ఆ నంబర్‌ను ఎంటర్ చేసి జేఈఈ మెరుున్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. జేఈఈ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేనాటికి ఆధార్ నంబర్ రాకపోతే (అప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు) ఆధార్ కోసం దరఖాస్తు చేసినపుడు విద్యార్థికి వచ్చే ఎన్రోల్మెంట్ స్లిప్‌లో ఉండే 28 నంబర్ల ఎన్రోల్మెంట్ ద్వారా జేఈఈకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ అవ కాశం జమ్మూ కశ్మీర్, అసోం, మేఘాలయ మినహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని వివరించింది. -
లక్ష తగ్గిన జేఈఈ దరఖాస్తులు
రేపటి నుంచి దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2016 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దరఖాస్తుల సంఖ్య దేశవ్యాప్తంగా లక్ష వరకు తగ్గినట్లు జేఈఈ మెయిన్ వర్గాలు వెల్లడించాయి. 2015లో 13.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అది 12.07 లక్షలకు తగ్గింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 1.8 లక్షల మంది దరఖాస్తు చే సుకున్నట్టు అంచనా. జేఈఈ మెయిన్ పరీక్ష విధానం ప్రారంభమైన 2012లో 12.2 లక్షలు, 2013లో 12.82 లక్షలు, 2014లో 13.56 లక్షల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సవరణకు 31 వరకు అవకాశం జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫారాల్లో పొరపాట్లను సవరించుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అవకాశం కల్పించింది. ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆన్లైన్ దరఖాస్తుల్లో వివరాల్లో పొరపాట్లను www.jeemain.nic.in వెబ్సైట్ ఇచ్చే ప్రత్యేక లింకు ద్వారా సవరించుకోవచ్చని సూచించింది. 31వ తేదీ తరవాత సవరణకు అవకాశం ఇవ్వబోమని వెల్లడించింది. పరీక్ష కేంద్రం (పట్టణం) మార్పు, పరీక్ష విధానం (ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు, ఆఫ్లైన్నుంచి ఆన్‌లైన్‌కు) మార్పు కుదరదని స్పష్టం చేసింది. ఫీజు చెల్లించిన వారిలో ఎవరైనా అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటే ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు చెల్లించవచ్చని వెల్లడించింది. వెబ్సైట్లో మాక్ టెస్టు లింక్ జేఈఈ మెయిన్ రాత పరీక్ష (ఆఫ్‌లైన్)ను ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించనుండగా, ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు సీబీఎస్ఈ చర్యలు చేపడుతోంది. ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రాక్టీస్ చేసేందుకు తమ వెబ్సైట్లో ప్రత్యేకంగా మాక్ టెస్టు లింకు ఇచ్చింది. ‘‘90 ప్రశ్నలకు 180 నిమిషాల్లో మాక్ టెస్టు రాయాలి. లింక్ ఓపెన్ చేయగానే సబ్జెక్టులవారీగా మాక్ టెస్టు విధానం ఉంటుంది. అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోవాలి’’ అని పేర్కొంది. -
జేఈఈ దరఖాస్తుల్లో ‘అదర్స్’ ఆప్షన్
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం మార్పులు చేసిన సీబీఎస్ఈ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం లభించింది. అయితే ఇప్పటికిప్పుడే తెలంగాణ ఇంటర్మీయట్ బోర్డు పేరుతో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం సాధ్యం కానందున.. విద్యార్థుల కోసం ‘అదర్స్ (ఇతరులు)’ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థులంతా ‘అదర్స్’గా విద్యార్హతల ఆప్షన్‌ను మార్చుకోవాలని వివరించింది. కొద్దిరోజుల్లో తాము సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి.. అదర్స్ పేరుతో ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులందరినీ తెలంగాణ బోర్డు కిందకు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు జేఈఈకి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులంతా వెబ్సైట్లో తమ ఆప్షన్‌ను ‘అదర్స్’గా ఈ నెల 31లోగా మార్పు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఆన్లైన్ దరఖాస్తుల్లో సీబీఎస్ఈ గురువారం మార్పులు చేసిందని విద్యా మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల్లో.. ఏ బోర్డు నుంచి ఇంటర్/12వ తరగతి చదువుతున్నారనే సమాచారాన్ని నమోదు చేయాల్సిన ఆప్షన్లలో నవంబర్‌లో దరఖాస్తుల సమయంలో తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు. దీంతో రాష్ట్ర విద్యార్థులంతా ఏపీ బోర్డు ఆప్షన్‌తో దరఖాస్తు చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులకు జేఈఈ మెయిన్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 40 శాతం వెయిటేజీని కోల్పో యే పరిస్థితి రావడంతో వారంతా ఆందోళన చెందారు. దీనికితోడు ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఇచ్చినా.. ఆ ఆప్షన్లలోనూ తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఇంటర్ బోర్డు బుధవారమే సీబీఎస్ఈకి లేఖ రాసింది. ప్రభుత్వంతో పాటు బోర్డు అధికారులు గురువారం సీబీఎస్ఈ అధికారులతో మాట్లాడారు. తెలంగాణ బోర్డును చేర్చకపోతే రాష్ట్ర విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ వెంటనే జేఈఈ మెయిన్ దరఖాస్తుల సవరణ లింక్‌లో అదర్స్ ఆప్షన్‌ను అందుబాటులోకి ఉంచింది.