Jeff Sessions
-
అమెరికా ఏజీ జెఫ్ సెషన్స్‌కు ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్(ఏజీ) జెఫ్ సెషన్స్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్థానంలో తన మద్దతుదారైన మేథ్యూ వైట్కర్ను తాత్కాలిక ఏజీగా నియమించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణను పర్యవేక్షించేందుకు జెఫ్ సెషన్స్ నిరాకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం విచారణ ప్రక్రియ ట్రంప్ చేతుల్లోకి వచ్చేసినట్లైంది. కాగా, ఇన్నాళ్లూ జెఫ్ అందించిన సేవలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకే తాను ఏజీ పదవికి రాజీనామా చేసినట్లు జెఫ్ ప్రకటించారు. -
ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం
అమెరికాలో 46 మంది అటార్నీలకు ఉద్వాసన! వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రీత్ బరారాతో పాటు మరో 45 మంది అటార్నీలకు ఉద్వాసన పలకడానికి అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన వీరంతా రాజీనామా చేయాలని కోరింది. మొత్తం 93 మంది అటార్నీలు ఉండగా.. వారిలో ఇప్పటికే పలువురు రాజీనామా చేశారు. ఏకరూప పరివర్తన తీసుకురావడానికి ఇప్పటికీ కొనసాగుతున్న 46 మందిని రాజీనామా చేయాల్సిందిగా యూఎస్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ కోరారని న్యాయశాఖ ప్రతినిధి సారా ఇస్గుర్ ఫ్లోరెస్ తెలిపారు. జార్జి బుష్, బిల్ క్లింటన్ హయాంలో కూడా ఇలానే చేశారని తమ చర్యను సమర్థించుకున్నారు.