ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం
అమెరికాలో 46 మంది అటార్నీలకు ఉద్వాసన!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రీత్ బరారాతో పాటు మరో 45 మంది అటార్నీలకు ఉద్వాసన పలకడానికి అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన వీరంతా రాజీనామా చేయాలని కోరింది. మొత్తం 93 మంది అటార్నీలు ఉండగా.. వారిలో ఇప్పటికే పలువురు రాజీనామా చేశారు.
ఏకరూప పరివర్తన తీసుకురావడానికి ఇప్పటికీ కొనసాగుతున్న 46 మందిని రాజీనామా చేయాల్సిందిగా యూఎస్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ కోరారని న్యాయశాఖ ప్రతినిధి సారా ఇస్గుర్ ఫ్లోరెస్ తెలిపారు. జార్జి బుష్, బిల్ క్లింటన్ హయాంలో కూడా ఇలానే చేశారని తమ చర్యను సమర్థించుకున్నారు.