Jeff Williams
-
రాష్ట్రంలో తయారీ యూనిట్ పెట్టండి: బాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా రెండవ రోజు శనివారం ఆపిల్ సీఈవో జెఫ్ విలియమ్స్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆపిల్ కంపెనీ సీఈవోను కోరారు. భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో క్వాలకమ్ టెక్నాలజీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేని, డైరెక్టర్ ప్రొడెక్ట్ మేనేజ్మెంట్ చందన పైరాల సమావేశం అయ్యారు. టెలికమ్యునికేషన్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన క్వాల్కమ్ టెక్నాలజీస్ రాష్ట్రంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనపరిచిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. స్ట్రోటోస్పియర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే విభాగాధిపతి అలిస్టర్‌తో బాబు సమావేశమయ్యారు. లాస్ ఏంజెల్స్‌లో టెస్ట్రా ప్రెసిడెంట్ సీఎఫ్ఓ ఎలొన్ మస్క్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐ–బ్రిడ్జి, ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
ఆర్నెల్ల తర్వాత అంతరిక్షం నుంచి..
కజకిస్తాన్ః సుమారు ఆర్నెల్ల కాలం తర్వాత అంతరిక్షం నుంచి ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 48 మంది సాహస యాత్రికులకు సారధ్యం వహించిన కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ జెఫ్ విలియమ్స్ సహా ఆయన క్రూమేట్స్ అలెక్సీ ఓఛినిమ్, ఒలేగ్ స్ర్కిపోచ్కాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సురక్షితంగా భూమికి చేరుకుని నాసా వ్యోమగాముల జాబితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 48 మంది సాహస అంతరిక్ష యాత్రికులతో కూడిన సోయజ్ టిఎంఏ-20ఎం స్పేస్ క్రాఫ్ట్... కజకిస్తాన్ లోని చెజ్ కజగన్ నగరంలో 7 సెప్టెంబర్ 2016 బుధవారం ఉదయం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈ ప్రత్యేక యాత్రలో విలియమ్స్, అలెక్సీ ఓఛినిమ్, ఒలేగ్ స్ర్కిపోచ్కా లు అంతరిక్ష కేంద్రంలో 172 రోజులపాటు గడిపారు. గతేడాది డిసెంబర్ నెలలో నింగికి ఎగిరిన ఈ వ్యోమగాములు అనేక పరిశోధనలు నిర్వహించి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరిలో ముఖ్యంగా విలియమ్స్ అంతరిక్షంలో 534 రోజులు గడిపిన నాసా వ్యోమగాముల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. స్ర్కిపోచ్కా రెండు విమానాల్లో మొత్తం 331 రోజులు... అలెక్సీ ఓఛినిమ్ 172 రోజులు అంతరిక్షంలో గడిపి నాసా వ్యోమగాముల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
అంతరిక్షంలో ఆవాసం..!
వాషింగ్టన్: నాసా మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను మరి కాస్త విస్తరించింది. రెండు రోజుల క్రితం ఇదే ప్రయత్నంలో విఫలమైన ‘నాసా’.. ఐఎస్ఎస్ను తాజాగా ఒక గది మేరకు విస్తరించగలిగింది. వ్యోమగామి జెఫ్ విలియమ్స్.. నెమ్మదిగా చిన్న చిన్న పేలుళ్ల ద్వారా పీడనం పెంచుతూ ఐఎస్ఎస్ను పూర్తిగా 67 అంగుళాల మేర విస్తరించగలిగారు. అనంతరం ‘బిగ్లో ఎక్స్‌పాండబుల్ యాక్టివిటీ మోడ్యూల్ (బీమ్)’ అనే ఈ తొలి మార్పులు చేయగల ఆవాసం లోపల 8 ఎయిర్ ట్యాంక్‌లను వదిలారు. వ్యోమగాము లు ఉండేందుకు అవసరమైన ఒత్తిడి, ఇతర వాతావరణ పరిస్థితులు నెలకొల్పారు. మొత్తం ఈ ప్రయత్నానికి రూ. 113 కోట్లు ఖర్చయింది. ఈ బీమ్‌ను సంపూర్ణంగా విస్తరిస్తే 13 అడుగుల పొడవు, 10.5 అడుగుల వెడల్పు ఉన్న గదిలా మారుతుంది. బిగ్లో ఏరోస్పేస్ సంస్థ సహకారంతో నాసా ఈ ఘనత సాధించగలిగింది. చంద్రుడు, అంగారకుడి మీద నివాసయోగ్య గదులను ఏర్పాటు చేసేందుకు నాసా యత్నిస్తోంది.