మార్చి వరకూ ‘జియో’ ఫ్రీ
• ‘నూతన సంవత్సర కానుక’గా పొడిగింపు
• ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరేవారికీ వర్తింపు
• రోజుకు ఎఫ్‌యూపీ పరిమితి 1జీబీనే
• రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ ప్రకటన
ముంబై: రిలయన్స్ జియో నూతన సంవత్సర కానుకగా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు డిసెంబర్ 3తో ముగిసిపోతున్న ఉచిత సేవలను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. డేటా, దేశీయంగా వారుుస్, వీడియో కాల్స్, జియో యాప్స్‌ను ప్రస్తుత కస్టమర్లతోపాటు కొత్తగా చేరే వారు సైతం మార్చి వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. కానీ, అదే సమయంలో డేటా విషయంలో జియో నియంత్రణలు విధించింది. పారదర్శక వినియోగ విధానం (ఎఫ్‌యూపీ) కింద ప్రతీ కస్టమర్‌కు ఒక రోజులో ఉచిత డేటాను 1జీబీకే పరిమితం చేసింది.
ప్రస్తుత కస్టమర్లు మాత్రం డిసెంబర్ 31 వరకు రోజుకు 4జీబీ డేటాను పొందవచ్చు. జనవరి 1 నుంచి క్తొత ఆఫర్‌కు మారిపోతారు. కాగా, డేటా పరిమితిని ముకేశ్ అంబానీ సమర్థించుకున్నారు. 80 శాతం జియో కస్టమర్ల రోజు వారీ డేటా వినియోగం 1జీబీ అంతకంటే తక్కువే ఉందని, మిగిలిన 20 శాతం కస్టమర్లు డేటాను విపరీతంగా వాడేస్తున్నారని, దీంతో నెట్‌వర్క్‌లో రద్దీ పెరిగిపోతున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 4న జియో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇక కోరితే కస్టమర్ ఇంటికే వచ్చి జియో సిమ్‌ను అందించే సదుపాయాన్ని కూడా ముకేశ్ ప్రకటించారు. మొబైల్ ద్వారా చెల్లింపులకు జియో మనీ అప్లికేషన్‌ను విడుదల చేశారు. ‘‘భారత్‌లోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా జియో అవతరించింది. తొలి మూడు నెలల వయసులోనే ఫేస్బుక్, వాట్సాప్, స్కైప్‌ల కంటే అధికంగా వృద్ధిని నమోదు చేసింది’’ అని ముకేశ్ అంబానీ ప్రకటించారు.
20 శాతానికి కాల్ బ్లాక్ రేటు: ‘‘ప్రత్యర్థి ఆపరేటర్ల పోటీ వ్యతిరేక విధానాల వల్ల జియో అత్యుత్తమ వారుుస్ టెక్నాలజీ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించలేకపోయాం’’ అని అంబానీ పేర్కొన్నారు. అధికారుల జోక్యం ఫలితంగా కాల్ బ్లాక్ రేటు 90 శాతం నుంచి 20 శాతం సమీపానికి దిగి వచ్చినట్టు చెప్పారు. రానున్న వారాల్లో తగినన్ని ఇంటర్ కనెక్షన్ పారుుంట్లు ఇతర ఆపరేటర్ల నుంచి అందితే జియో కస్టమర్లు అవాంతరాల్లేని వారుుస్ అనుభవాన్ని చవి చూస్తారని అంబానీ పేర్కొన్నారు.
డేటా వేగం నిదానించడంపై...
జియో నెట్‌వర్క్‌ను సామర్థ్యం, వేగం కోసం నిర్మించామని, 5 కోట్ల మంది కస్టమర్లు ఉచిత ఆహ్వాన ఆఫర్‌ను పూర్తి స్థారుులో వినియోగించుకోవడం వల్లే వేగంలో సమస్యలు ఏర్పడ్డాయని అంబానీ వివరించారు. అసాధారణ డేటా వినియోగం కారణంగా 8 శాతం జియో టవర్లు సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఒక బ్రాడ్ బ్యాండ్ యూజర్ రోజువారీ వినియోగం కంటే జియో కస్టమర్ సగటున 25 శాతం అధికంగా వినియోగిస్తున్నారనీ, అరుునప్పటికీ ఇతర ఆపరేటర్ల కంటే నాలుగు రెట్ల అధిక డేటాను, అధిక వేగంతో అందించినట్టు అంబానీ వివరించారు.
గ్రామగ్రామానా జియో మనీ...
జియో మనీ యాప్ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై పనిచేస్తుందని అంబానీ పేర్కొన్నారు. ‘‘కస్టమర్లు జియో మనీ సాయంతో నేరుగా తమ బ్యాంకు ఖాతాలోని నగదు బ్యాలన్స నుంచి వర్తకులకు చెల్లింపులు చేయవచ్చు. వర్తకులు జియో మనీ యాప్‌తో కస్టమర్ల నుంచి చెల్లింపులను నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి స్వీకరించవచ్చు. దేశవ్యాప్తంగా 17,000 పట్టణాలు, 4 లక్షల గ్రామాల్లో కోటి చిన్న వర్తకులు, రిటైలర్లతో జియో చేతులు కలపనుంది. ఆధార్ ఆధారిత సూక్ష్మ ఏటీఎంలను ఏర్పాటు చేస్తాం’’ అని అంబానీ చెప్పారు.
నోట్ల రద్దుపై ప్రధానికి అభినందనలు
ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముకేశ్ అంబానీ మద్దతు పలికారు. ప్రధాని ప్రకటించిన డీమోనిటైజేషన్ నిరుపయోగంగా పడి ఉన్న ధనాన్ని ఉత్పాదకత వైపు తీసుకొస్తుందన్నారు. ఈ చర్యతో డిజిటల్ ఆధారిత ఆర్థిక వృద్ధికి మోదీ బలమైన చేయూతనిచ్చారని పేర్కొన్నారు. ధృఢమైన, చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధానికి తన అభినందనలని ప్రకటించారు. ప్రధాని చర్య ప్రజల ఆలోచనల్లో మార్పు తెస్తుందని... డిజిటల్ చెల్లింపులు పారదర్శక, బలమైన భారత్‌కు, దేశీయ ఆర్థిక రంగానికి మేలు చేస్తాయన్నారు.
జియో ఆఫర్‌ను సమీక్షిస్తాం: ట్రాయ్
న్యూఢిల్లీ: ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ప్రకటించిన ‘జియో హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌ను పరిశీలిస్తామని ట్రాయ్ తెలిపింది. తమ ముందుకు వచ్చిన ప్రతీ టారిఫ్‌ను పరిశీలిస్తామని, దీనిపై తగిన సమయంలో స్పందిస్తామని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు.