jntu students
-
గల్లీ గల్లీలో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: సింబయోసిస్ కాలేజీలో 25 మంది.. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది.. ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆరుగురు.. జోగిపేట జేఎన్టీయూలోని విద్యార్థులు ముగ్గురు.. .. ఇదేదో మెడల్స్ గెల్చుకున్న వారి జాబితా కాదు.. గంజాయికి అలవాటు పడి గత నెలలో ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)’అధికారులకు పట్టుబడినవారి జాబితా. ఇంకా ఇలాంటి ఘటనలు మరెన్నో. ధర తక్కువ, లభ్యత ఎక్కువ అన్నట్టుగా గంజాయి విక్రయాలు సాగుతుండటంతో.. యువత, విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య డ్రగ్స్‌కు సంబంధించి రాష్ట్రంలో 938 కేసులు నమోదుకాగా.. 1,921 మంది అరెస్టయ్యారు. ఇందులో 816 కేసులు (86.99 శాతం), 1,649 మంది (85.84 శాతం) గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించినవే కావడం గమనార్హం. కేంద్రం ఆ«దీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాయంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వివిధ రూపాల్లో వాడుతూ.. రాష్ట్రంలో గంజాయికి అలవాటుపడ్డ వారిలో చాలా మంది నేరుగా వాడుతుండగా.. కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చరస్, హషీష్ ఆయిల్, బంగ్ తదితర రూపాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైసూ్కల్, జూనియర్ కాలేజీ స్థాయిలో తొలుత సిగరెట్‌కు అలవాటు పడుతున్నారు. తర్వాత సొంతంగానో, స్నేహితుల ద్వారానో గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి విక్రయదారులు.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమ్ముతుండటంతో సులభంగా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గంజాయి నియంత్రణపై మరింత ఫోకస్ చేయాలని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఒడిశా నుంచి రాష్ట్రంలోకి.. గంజాయి ఎక్కువగా ఒడిశాలో సాగవుతోంది. అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి వస్తోంది. కొన్నిసార్లు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు, ఆరీ్టసీ/ప్రైవేట్ బస్సులతోపాటు రైళ్లల్లోనూ గంజాయి హైదరాబాద్‌కు చేరుతోంది. గాంజాతోపాటు పాట్, హష్, స్టఫ్, స్టాష్.. ఇలా పలు ప్రత్యేక పదాలతో దీని విక్రయాలు జరుగుతున్నాయి. కొకైన్, హెరాయిన్, ఎల్ఏస్డీ వంటి డ్రగ్స్ ఒక గ్రాముకు లేదా ఒక డోసుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు కావాలి. అదే గంజాయి రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచి్చస్తే 100 గ్రాములు దొరుకుతోంది. పైగా దీన్ని సిగరెట్ స్ట్రిప్లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇక ధనికవర్గాలకు చెందినవారు హిమాచల్ ప్రదేశ్‌లోని కస్సోల్ ప్రాంతం నుంచి వచ్చే ఖరీదైన ప్రత్యేక గంజాయిని వినియోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చే గంజాయిలోనూ శీలావతి, గ్రీన్ రకాలకు డిమాండ్, రేటు ఎక్కువగా ఉంటుందని అంటున్నాయి.ప్రాణాలు తీస్తున్న ‘గంజా’మత్తు!హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన పి.రాజు గంజాయికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే తన ఇంటి సమీపంలో నివసించే ఆరేళ్ల చిన్నారిని తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి పరారయ్యాడు. రాజు కోసం పోలీసుల గాలింపు చేపట్టడంతో.. వరంగల్ జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలోని రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన ఉదయ్‌కుమార్ తన అమ్మమ్మ రాంబా యమ్మ దగ్గర ఉంటున్నాడు. పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఉదయ్.. డిప్లొమా లో చేరాక గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి కోసం డబ్బులు కావాలని అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఓ రోజు రాత్రి 11.30 గంటలకు హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన నవీన్ గంజాయి మత్తులో ఓ వ్యక్తిపై గొడలితో దాడి చేసి చంపేశాడు. బెయిల్ వచ్చాక గంజాయి మత్తులో గ్రామస్తులతో ఘర్షణకు దిగడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. గ్రామంలో మంచి పేరున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీవ్ గంజాయికి బానిసగా మారడంతో.. ఆ ప్రభావం కుటుంబానికి చెందినవారందరిపై పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. పక్కన మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్నా బీహార్ వలస కూలీ వినోద్ మాజ్హి గంజాయి మత్తులో.. ఆ దంపతుల ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని గోపాల్‌రావుపేటకు చెందిన సురేశ్ పద్దెనిమిదేళ్ల వయసులోనే గంజాయికి బానిసయ్యాడు. మితిమీరి గంజాయి తీసుకోవడంతో చనిపోయాడు.వెంటనే బానిసలవుతారు మద్యం తాగేవాళ్లు కనీసం ఓ ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్లపాటు తాగుతూ ఉంటేనే.. దానికి బానిసలుగా మారుతారు. అదే గంజాయి విషయంలో కొన్నిరోజుల్లోనే బానిసలవుతారు. గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌కు గురవుతారు. కానీ దీని వినియోగం పెరిగిపోతే.. సైకోసిస్ సహా అనేక మానసిక రుగ్మతలు వస్తాయి. కొందరు హింసాత్మకంగా, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కారణంగానే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. – ప్రతాప్ రాజన్, క్లినికల్ సైకాలజిస్ట్803 కిలోల గంజాయి పట్టివేతరూ.2.81 కోట్ల విలువ ఉంటుందన్న పోలీసులుశంషాబాద్ రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒక డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ విభాగం, శంషాబాద్ పోలీసులు ఆదివారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పెద్ద గోల్కొండ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై మాటువేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఒడిశాకు చెందిన కమిషన్ ఏజెంట్ సోమనాథ్ ఖార, డీసీఎం డ్రైవర్లు హెచ్ఎస్ విఠల్‌రెడ్డి, సంజీవ్కుమార్తోపాటు సునీల్ ఖోస్లా, జగ సునను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపు సూత్రధారులైన ఏపీలోని అరకు వాసి రాము, మహారాష్ట్ర వాసి సురేశ్ మారుతి పాటిల్ పరారీలో ఉన్నట్టు వివరించారు. తరలింపు ప్లాన్ ఇదీ.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అరకువాసి రాము గంజాయి సరఫరాదారు.. అతడి వద్ద సోమనాథ ఖార పనిచేస్తున్నాడు. వారు ఇటీవల డీసీఎం యజమాని విఠల్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్ పరిసరాల్లో గూడ్స్ డెలివరీ కోసం వస్తే తమకు చెప్పాలన్నారు. విఠల్‌రెడ్డికి గత నెల 30న పటాన్చెరు నుంచి వైజాగ్ సరకు తరలించే ఆర్డర్ వచ్చింది. ఆ సరుకును డెలివరీ చేశాక.. ఈ నెల 1న వైజాగ్‌లోని సెజ్‌లో ఉన్న ఓ కంపెనీ నుంచి కెమికల్ సాల్వెంట్స్ తీసుకుని బయలుదేరారు. మధ్యలో గంజాయి బస్తాలను నింపారు. సోమనాథ్ ఖార ముందు ఓ కారులో వెళ్తుండగా.. వెనకాల డీసీఎం వచ్చింది. గంజాయిని హైదరాబాద్‌లోని పటాన్చెరు వరకు తీసుకొచ్చి అక్కడ సురేశ్పాటిల్కు అప్పగిస్తే.. అతను వేరే వాహనంలో గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లేలా ప్లాన్ వేసుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. -
విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!
సాక్షి, అనంతపురం శ్రీకంఠంసర్కిల్: రెండు రోజుల క్రితం అనంతపురం జేఎన్టీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య కేసు దర్యాప్తును వన్‌టౌన్ పోలీసులు ముమ్మరం చేశారు. జేఎన్టీయూ (ఏ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతుల కుమారుడు చాణిక్య నందరెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వర్సిటీలోని ఎల్లోరా హాస్టల్లో చాణిక్య ఉంటున్న నంబర్ 131 గదిలోని నలుగురు విద్యార్థులతో పాటు చాణిక్య ఆత్మహత్య చేసుకునే ముందు నిద్రించిన గదిలోని అత్యంత సన్నిహితున్ని శుక్రవారం విచారణకు పిలిచారు. ఎవరితో పెద్దగా విభేదాలు లేవని, ప్రేమ వ్యవహారాలు కూడా నడవలేదని, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై తమకూ స్పష్టత లేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే, డిసెంబరు 31 రాత్రి నుంచి చాణిక్య మూడీగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు 134 గదిలోకి.. చాణిక్య తను ఉండాల్సిన 131 నంబరు గదిలో కాకుండా 134లోకి రావడానికి కారణాన్ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. తనతో పాటు ఇంటర్ నుంచి కలసి చదువుతున్న విద్యార్థి నరేంద్ర సీఈసీ తీసుకున్నాడు. తను 134 గదిలో ఉంటున్నాడు. దీంతో ఎక్కువగా చాణిక్య కూడా అతనితో గడిపేవాడు. చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా చాణిక్య అక్కడే పడుకున్నాడు. కాగా తను ఎప్పుడు నిద్ర లేచి వెళ్లాడో తెలియదని నరేంద్ర అంటున్నాడు. తను చనిపోయిన విషయం హాస్టల్లో విద్యార్థులకు కూడా ఆరు గంటల దాకా తెలియదంటున్నారు. ఇదిలా ఉండగా హాస్టల్ టెర్రస్ పైభాగాన చాణిక్య చెప్పులు వదిలేసి ఉండటం పోలీసులకు అనుమానాన్ని పెంచుతోంది. సెల్ఫోన్లోనూ నో క్లూ.. చాణిక్యనందరెడ్డి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రేమ వ్యవహారాలుంటే అందులో ఏదో ఒక చోట సంభాషణ, లేదా పంపిన సందేశాలుండేవి. అయితే, అలాంటివి లేవంటున్నారు. గతంలో జేఎన్టీయూలో జరిగిన ర్యాగింగ్ బ్యాచ్‌ల్లో చాణిక్య ఉన్నాడా? అని కూడా ఆరా తీయగా, వాటితో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలిసినట్లు సమాచారం. ఆర్థిక సమస్యలుండవచ్చనే కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవముండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు. కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉందేమోగాని.. చాణిక్య వరకు అలాంటి ఇబ్బంది లేదు. కారణం తను దుబారా ఖర్చులు చేసేవాడు కాదట. చదువు మినహా మరో వ్యాపకం కూడా లేదని అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా తనకు వచ్చిన రూ. 60 వేల స్కాలర్ షిప్ కూడా తండ్రి ఖాతాలోకి మళ్లించాడు. లోన్‌యాప్స్, క్రెడిట్‌కార్డులు లాంటి అవకాశం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. సెల్ఫోన్లో ఎక్కడా ఆ జాడలు లేవు. కాని చాణిక్య తను చనిపోయే ముందు సెల్ఫోన్లో టైప్ చేసి ఉంచిన మైఫైల్స్ సందేశంలో మాత్రం.. వ్యక్తిగత సమస్యలతోనే చనిపోతున్నట్లు ఉంది. తన సోదరి గీతారెడ్డికి పంపిన సందేశంలోని సారాంశాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ ఆర్థిక పరిస్థితితోనే చాణిక్య ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. (చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్) -
అఫ్గాన్‌లో మా చెల్లిని చంపేశారు
అనంతపురం విద్య: అఫ్గానిస్తాన్‌లో మా చెల్లిని చంపేశారు.. తాలిబన్లు కాల్చేశారు.. మార్కెట్‌కు వచ్చినప్పుడు కాల్చి చంపేశారు.. అంటూ అనంతపురం జేఎన్టీయూ విద్యార్థిని బీబీ రహెనా అజీజీ విలపించారు. అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తమ కుటుంబసభ్యుల భద్రతపై ఇక్కడ చదువుకుంటున్న అఫ్గానీయులు భయపడుతున్నారు. అక్కడి పరిస్థితులపై వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జేఎన్టీయూలో అఫ్గానిస్తాన్‌కు చెందిన 12 మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చదువుతున్నారు. మరోవైపు జేఎన్టీయూ– అనంతపురంలో విదేశీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారనే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ (ఐసీసీఆర్) ఆరా తీసింది. వారి వీసా గడువు ఎప్పటికి ముగుస్తుంది.. తదితర అంశాలపై రెండు రోజుల్లో సమాచారం ఇవ్వాలని వర్సిటీ అధికారులను కోరింది. బిగుతు దుస్తులు ధరించిందని.. మేం కాబూల్‌లో నివసిస్తున్నాం. తాలిబన్లు రెండురోజుల కిందట మా చెల్లిని చంపేశారు. మార్కెట్‌కు వచ్చినప్పుడు బిగుతు దుస్తులు ధరించిందనే నెపంతో కాల్చి చంపారు. ఆ దుర్వార్త విన్నప్పటి నుంచి మనసు కలత చెందుతోంది. మా ఇంట్లో వాళ్లను తలుచుకుంటుంటే ఇంకా భయమేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 30న నా వీసా గడువు ముగుస్తుంది. ఎంబీఏ కోర్సు కూడా అప్పటికి పూర్తవుతుంది. మా కుటుంబసభ్యులు మాత్రం ఇప్పుడే రావద్దు.. పరిస్థితులు చక్కబడ్డాక రావాలని చెబుతున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులను కలసి వీసా గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కోరాం. – బీబీ రహెనా అజీజీ, ఎంబీఏ రెండో సంవత్సరం విద్యార్థిని పరిస్థితులు చక్కబడేవరకు ఇక్కడే అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులు తారుమారయ్యాయి. నాకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పా. బీటెక్ ఇంకా రెండేళ్లు ఇక్కడే చదువుతా. పరిస్థితులు చక్కబడ్డాక స్వదేశానికి వెళతా. – మహమ్మద్ ఆమీర్ సాలేహా, బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి అమ్మానాన్నలతో మాట్లాడుతున్నా మేం కాబూల్‌లో నివాసముంటున్నాం. అక్కడి పరిస్థితులు తలచుకుంటే భయమేస్తోంది. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కన్పిస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడేలా లేవు. అమ్మానాన్నలతో ఫోన్లో తరచు మాట్లాడుతున్నా. పరిస్థితులు చక్కబడేవరకు అక్కడికి రావద్దని చెబుతున్నారు. – హరుణ్ఖాన్, బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి వీసా గడువు పొడిగించాలని కోరాం ఇక్కడ చదువుతున్న అఫ్గాన్ విద్యార్థులకు అండగా నిలుస్తాం. వీసా గడువు త్వరలో ముగుస్తున్న విద్యార్థులకు కోర్సు కాలవ్యవధి పెంచుతాం. అలాగే వీసా గడువు మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాం. – ప్రొఫెసర్ సి.శశిధర్, రిజిస్ట్రార్, జేఎన్టీయూ–అనంతపురం -
మూడు రాజధానుల ఆలోచన అద్భుతం
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ఆలోచన అద్భుతంగా ఉందని అనంతపురం జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమలో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటువల్ల శ్రీభాగ్ ఒప్పందానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ.. ఏపీలో అధికార, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సీఎం యాక్షన్ ప్లాన్ బాగుంది ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ యాక్షన్ ప్లాన్ బాగుందని ఎస్కే యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అభివృద్ధి ఒకేచోట ఉంటే ప్రాంతీయ అసమానతలు వస్తాయని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి లక్ష కోట్ల అవసరమా? అని ప్రశ్నించారు. ఏపీలో మెగా క్యాపిటల్ అవసరం లేదని, మనకు కావాల్సింది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కాదు.. గ్రౌండ్ ఫీల్డ్ క్యాపిటల్ కావాలని, ఇదే విషయాన్ని బోస్టన్ గ్రూప్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకోవటం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని అన్నారు. మేధావుల మద్దతు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మేధావులు మద్దతు ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి ప్రజల హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి రద్దు.. ప్రతిపక్ష టీడీపీ స్వయంకృతాపరాధమేనని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధిపై తిరుపతిలో అవగాహన సదస్సు జరిగింది. ప్రజల అభిష్ఠానాన్ని అడ్డుకుంటూ.. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని అన్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు రాజధానులు అవసరం గురించి తిరుపతి ఎస్వీయూలో అవగాహన సదస్సు జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రొపెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు. భారీ ర్యాలీ.. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. జేఏసీ నేత రాజా రెడ్డి నేతృత్వంలో వందలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జేఏసీ నేతలు ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయానికి తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. స్వాగతిస్తున్న ప్రవాసాంధ్రులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రవాసాంధ్రులు స్వాగతిస్తున్నారు. సౌతాఫ్రికాలో నివాసం ఉంటున్న తెలుగువారు సీఎం వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతూ అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు. -
నేడు జేఎన్టీయూ విద్యార్థులు తిరంగ యాత్ర
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ , ఎంబీఏ విద్యార్థులు సోమవారం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం యూనివర్శిటీలను ఆదేశించింది. ఇందులో భాగంగా జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వర్శిటీ నుంచి అనంతపురంలోని శారద నగర్ వరకు తిరంగ యాత్ర నిర్వహించనున్నారు.