జేఎన్యూ విద్యార్థులకు బెయిల్
రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య లకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరునెలల మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
జేఎన్యూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య ఫిబ్రవరి 24న పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కన్హయ్య కుమార్ తో పాటు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని, అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాగా కన్హయ్య కుమార్ బెయిల్ పై బయటికి వచ్చిన రెండు వారాలకు వీరిద్దరికి బెయిల్ మంజూరైంది. మరో వైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయలేదు.