Job applications
-
ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా?
గత కొంతకాలంగా ఉద్యోగాల్లో చేరే మహిళల సంఖ్య బాగా పెరిగింది. దీంతో జాబ్ కోసం అప్లై చేసుకునే వారు క్రమంగా పెరుగుతున్నారు. 2023లో దేశం మొత్తం మీద ఎంత మంది ఉద్యోగాలకు అప్లై చేశారనే డేటాను apna.co విడుదల చేసింది. విడుదలైన డేటా ప్రకారం, గత ఏడాది ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో మహిళలు కోటి మంది ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం పురుషులతో పాటు మహిళలు ఇంతమంది అప్లై చేసుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. ఇందులో కూడా టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో మొత్తం 3.2 కోట్లమంది ఉద్యోగాలకు అప్లై చేసుకోగా.. ఇందులో 1 కోటి మంది మహిళలే కావడం గమనార్హం. అదే 2022లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న 2.7 కోట్ల మందిలో 87 లక్షలమంది మహిలు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళల సంఖ్య 2022 కంటే 13 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రోబో పనికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా - వీడియో వైరల్ ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంది ఇంటిపనులు మాత్రమే చేయడానికి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. తమను తాము నిరూపించుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. తమదైన రీతిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2023లో నిమిషానికి 100 ఉద్యోగాలకు ధరఖాస్తులు వచ్చినట్లు.. ఇందులో ఎక్కువగా సేల్స్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, అడ్వర్టైజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సైడ్ సేల్స్, మార్కెటింగ్, ఈ కామర్స్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. -
క్యాండీస్ తినటమే పని.. జీతం రూ.61 లక్షలు!
ఒట్టావా: ఒళ్లు వంచి రోజంతా కష్టపడినా జీతం అంతంతమాత్రమేనని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. తినటమే పనిగా ఉంటే.. దానికి లక్షల్లో జీతం వస్తే.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? అవునండీ.. అలాంటి ఉద్యోగాలూ ఉన్నాయి. ఓ ఛాక్లెట్ల తయారీ సంస్థ ‘చీఫ్ క్యాండీ టేస్టర్’ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాండీలు(మిఠాయిలు, ఛాక్లెట్లు) తినటమే ఆ ఉద్యోగం. జీతం కూడా భారీగానే ఇస్తోంది. ఏడాదికి రూ.61 లక్షలు మరి. క్యాండీలు అంటే ఇష్టపడే వారు వెంటనే ఈ ఆఫర్ను ఒడిసిపట్టండి మరి. కెనడాకు చెందిన క్యాండీ ఫన్హౌస్ అనే ఆన్లైన్ రిటైలర్ సంస్థ ఛాక్లెట్స్ నుంచి వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తోంది. చీఫ్ క్యాండీ ఆఫీసర్ను నియమించుకోవాలని భావిస్తోంది. అందుకు 1,00,000 కెనెడియన్ డాలర్లు(సుమారు రూ.61.14 లక్షలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను గత జులైలో లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది సంస్థ. తల్లిదండ్రుల అనుమతితో 5 సంవత్సరాల వయసు పైబడిన వారంతా ఈ ఉద్యోగానికి పోటీ పడొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని తాము ఊహించలేదని సీఈఓ జమిల్ హెజాజి పేర్కొన్నారు. ఒక చీఫ్ క్యాండీ ఆఫీసర్గా నెలకి 3,500 పీసులు తినాలి. రోజుకు 117 అన్న మాట. అయితే.. అవి చాలా ఎక్కువని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగానికి పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు పంపించారు. తమ పిల్లలు దరఖాస్తు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తల్లిదండ్రులు. Hiring: CHIEF CANDY OFFICER! 🍭 Are you passionate about CANDY, POP CULTURE and FUN? Get paid 6 figures to lead our Candyologists. Job is open to ages 5+, you can even apply on behalf of your kid! #DreamJob #hiring #careers #candy pic.twitter.com/p9mmlPg5R6 — Candy Funhouse (@candyfunhouseca) July 19, 2022 ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
మెట్రో నగరాల్లోనే అధికంగా దరఖాస్తులు
ముంబై: కరోనా వైరస్ విజృంభనతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదైలయింది. ముఖ్యంగా పరిశ్రమలు మూతపడడంతో లక్షలాధి మంది ఉపాధి కోల్పోయారు. కరోనా వైరస్ రాకముందు కంటే ఇప్పుడు 48శాతం అధికంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారని క్విక్ జాబ్స్ అనే పోర్టల్ నివేదిక తెలిపింది. కాగా దరఖాస్తులలో, ఉద్యోగాల ఖాళీలలో భారీ వ్యత్యాసం ఉందని తెలిపింది. అయితే మెట్రో నగరాలలో ఉద్యోగాల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఐఏఎన్ఎస్ సర్వే ప్రకారం.. డాటా ఎంట్రీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్స, డ్రైవర్, టీచర్, మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాలలో అధిక దరఖాస్తులు వచ్చినట్టు నివేదిక తెలిపింది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని తెలిపింది. విదేశాలలో ఉద్యోగాలు ఆశించేవారికి విమానయాన సంస్థ ఆంక్షలతో వారి ఆశలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: లాక్డౌన్: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్) -
భారత్లో గూగుల్ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. ప్రపంచ వ్యాప్తంగా 3,800 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. భారత్, అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని సంస్థ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్, యూజర్ సపోర్ట్ ఉద్యోగాల్లో నేరుగా కంపెనీ ఉద్యోగాలు ఉండనున్నాయని వివరించింది. గతంలో థర్డ్పార్టీ సేవల ద్వారా ఈ నియామకాలు జరిగేవి. ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్ విభాగంలో కంపెనీకి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారని 2020 చివరినాటికి వీరి సంఖ్యను 4,800 మందికి పెంచనున్నామని ఆపరేషన్స్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ డికెర్సన్ తెలిపారు. -
విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!
చెన్నై : ఉద్యోగానికి అవసరానికి మించి విద్యార్హతలు ఉన్న వారిని ఆయా ఉద్యోగాల్లో నియమించరాదని మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ క్వాలిఫికేషన్ పేరుతో చెన్నై మెట్రో తనకు ఉద్యోగం నిరాకరించడంతో ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. వివరాల్లోకెళ్తే.. 2013లో లక్ష్మిప్రభ అనే అభ్యర్థి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్)లో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఈ ఉద్యోగానికి డిప్లొమా అర్హత కాగా, ప్రభ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడంతో.. ఆమె దరఖాస్తును సీఎంఆర్ఎల్ తిరస్కరించింది. దీంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నా తన హక్కులను సీఎంఆర్ఎల్ నిరాకరించిందన్న పిటిషనర్ వాదనను జస్టిస్ వైద్యనాథన్ తోసిపుచ్చారు. ఓవర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ప్రస్తుత ఉద్యోగులనూ తొలగిస్తామని సంస్థ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. -
అరే వా! భాద్రా
సమ్థింగ్ స్పెషల్ రాజస్థాన్... ఎడారి ప్రాంతం... ఆ ఎడారిలో ఓ చిన్న గ్రామం... పేరు తహసిల్ భాద్రా. అక్కడికి కేవలం రెండు రైళ్లు మాత్రమే వస్తాయి. జనాభా కేవలం 40, 000. ఢిల్లీ నగరం నుండి 275 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. ఎందుకంటే.. భారతదేశంలోనే సంపూర్ణంగా, అతి చౌకగా వైఫైను వినియోగిస్తున్న గ్రామం ఇది. బెంగళూరు, పుణే, కొచ్చి, ఢిల్లీ నగరాలలో పూర్తి వైఫై సేవలు ఉన్నప్పటికీ, వాడేవారి సంఖ్య తక్కువగా ఉంది. కాని రాజస్థాన్లోని భాద్రా గ్రామ ప్రజలు అందరూ వైఫై సేవలు వినియోగించుకుంటున్నారు. బస్స్టాండ్కి వెళ్లి చూస్తే, అక్కడ చాటింగ్ చేసేవారు, వీడియో కాన్ఫరెన్స్లో ఉండేవారు, టికెట్ బుక్ చేసుకునేవారు కనిపిస్తారు. బస్స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, గల్లీ గల్లీలోనూ, మార్కెట్లలోనూ భాద్రా గ్రామ ప్రజలు సాంకేతికంగా ముందడుగులు వేసేశారు. పూర్తిస్థాయిలో సినిమాలు డౌన్లోడ్ చేసుకునేవారు కొందరు, ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్లు చేసేవారు కొందరు, వ్యాపారాలు చేసేవారు కొందరూ... ఇలా అందరూ ఎవరి పనులు వారు చ కచకా కాలు కదపకుండా చేసేస్తున్నారు. ఇంతకుముందు ఆన్లైన్ పాఠాలకు, జాబ్ అప్లికేషన్లకు ... భాద్రా నుంచి 160 కి.మీ. దూరంలోఉన్న హనుమాన్గఢ్కి వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. కొద్దినెలల క్రితమే వైఫై ఆ గ్రామానికి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఈ గ్రామ వాసులంతా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. వన్ జీబీ డేటా ఒక నెలకు, ఇక్కడ కేవలం 64 రూపాయలకే దొరుకుతోంది. ఈ చిన్నగ్రామంలో రోజుకి 160 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారంటే, భాద్రా ప్రజలు సాంకేతికంగా ఎంత ఎదిగిపోయారో తెలుస్తుంది. ఇక్కడి వారు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. వీడియో కాలింగ్, చాటింగ్, రీచార్జ్... అన్నీ చక్కగా ఉపయోగించుకుంటున్న గ్రామం తహసీల్ - భాద్రా. వాహ్ భాద్రా అనిపించట్లేదూ!!! - వైజయంతి