న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. ప్రపంచ వ్యాప్తంగా 3,800 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. భారత్, అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని సంస్థ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్, యూజర్ సపోర్ట్ ఉద్యోగాల్లో నేరుగా కంపెనీ ఉద్యోగాలు ఉండనున్నాయని వివరించింది. గతంలో థర్డ్‌పార్టీ సేవల ద్వారా ఈ నియామకాలు జరిగేవి. ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్ విభాగంలో కంపెనీకి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారని 2020 చివరినాటికి వీరి సంఖ్యను 4,800 మందికి పెంచనున్నామని ఆపరేషన్స్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాయ్ డికెర్సన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment