Jotsna
-
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
టాలీవుడ్‌కి మిస్ యూఎస్ఏ
బ్యూటీ కాంటెస్టుల్లో గెలిచిన భామలు హీరోయిన్లుగా సినిమాల్లో ఎంపిక కావడం గతంలో చాలాసార్లు చూశాం. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్, ప్రియంకా చోప్రా వంటి తారలు ముందు అందాల పోటీల్లో పాల్గొని, లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చారు. లేటెస్ట్గా జో శర్మ (జ్యోత్స ్న) ఈ లిస్ట్‌లో జాయిన్ కాబోతున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్ఏ ఇంటర్నేషనల్ బ్యూటీ అండ్ టాలెంట్ కాంటెస్ట్ 2019 విజేతగా నిలిచారు జో శర్మ. 15 దేశాలకు చెందిన 15 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అందం, ప్రతిభ, నృత్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ స్పీచులు.. ఇలా అన్నింటి ఆధారంగా విజేతను నిర్ణయించారు. అన్నింటిలోనూ జో శర్మ తన ప్రతిభ కనబర్చి, ‘మిస్ యూఎస్ఏ’ టైటిల్ గెలిచారు. త్వరలో ఆమె టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. ప్రస్తుతం ‘లవ్ 2020’ చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత మోహన్ వడ్లపాటి త్వరలో రూపొందించబోయే మరో చిత్రం ద్వారా జో శర్మను హీరోయిన్గా పరిచయం చేయనున్నారు. -
ఏం చేసినా 'బాబు'ను బతికించలేం : డాక్టర్లు
కోల్‌కతా : కడు పేదరికం. లేకలేక పుట్టిన బిడ్డ. తెలియని వింత రోగం బిడ్డను వేధిస్తుండటంతో పెద్దాసుపత్రిని ఆశ్రయించింది జోత్స్న, జ్యోంతు దాస్‌ల జంట. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బిడ్డకు పుట్టుకతో వచ్చే ఎన్సీఫలోసీల్ అనే వ్యాధి సోకినట్లు చెప్పారు. అందుకే బిడ్డ తల ఫ్లాట్‌గా తయారైందని, మెడ వెనుక భాగంలో కణితి ఏర్పడిందని వివరించారు. ఏం చేసినా బిడ్డను బ్రతికించలేమని తల్లిదండ్రులకు చెప్పారు. డాక్టర్ల మాటలు విన్న 'బాబు' తల్లి జోత్స్న అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. లేకలేక పుట్టిన బిడ్డకు రెండు నెలలలోనే నూరేళ్లు నిండిపోతాయని తెలిసి గుండెలు అవిసేలా ఏడ్చింది. గర్భవతిగా ఉన్న సమయంలో పలుమార్లు స్కానింగ్ చేయించామని అప్పుడు సమస్య ఉన్నట్లు రిపోర్టుల్లో రాలేదని ఆమె తెలిపారు. బాధను పంటిబిగువన అదిమి పెట్టి ప్రేమతో తన బిడ్డను బ్రతికించుకుంటామని చెప్పి 'బాబు'ను ఇంటికి తీసుకెళ్లింది జంట. అప్పటినుంచి కంటి రెప్పలా బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వైద్య శాస్త్రంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయని, అలాంటిదే తమ బిడ్డకు జరిగి నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు జోత్స్న, దాస్ దంపతులు చెప్పారు. 'ఎన్సీఫలోసీల్' అంటే ఏంటి? అత్యంత అరుదుగా బ్రెయిన్‌కు సోకే వ్యాధే ఎన్సీఫలోసిల్. న్యూరల్ ట్యూబ్‌లోని లోపాల కారణంగా బిడ్డ జన్మించే క్రమంలో ఈ వ్యాధి సోకుతుంది. తల్లి గర్భం దాల్చిన మూడు, నాలుగు వారాల్లో బిడ్డ మెదడు, వెన్నుపూస తయారవుతుంది. ఈ సమయంలో న్యూరల్ ట్యూబ్ సరిగా మూసుకోకపోవడం వల్ల ఎన్సీఫలోసీల్ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. -
భారత్‌కు 14వ పసిడి పతకం.. దీపిక-జోత్స్న సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 14వ పసిడి పతకం దక్కింది. శనివారం స్వర్ణాల వేటలో భారత బాక్సర్లు నిరాశపరిచినా, స్క్వాష్ క్రీడాకారిణులు మెరిశారు. కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు. మహిళల డబుల్స్ స్క్వాష్ ఫైనల్లో భారత జోడీ దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప విజయం సాధించి బంగారు పతకం సొంతం చేసుకున్నారు. ఫైనల్ పోరులో దీపికా-చిన్నప్ప జంట 11-6, 11-8తో ఇంగ్లండ్ ద్వయం డంకాఫ్, మసారోను ఓడించారు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచిన భారత జోడీ రెండో గేమ్ ఆరంభంలో వెనుకబడ్డారు. అయితే 1-5 స్కోరు వద్ద భారత క్రీడాకారిణులు విజృంభించి ముందంజ వేశారు. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుని భారత్‌కు 14వ బంగారు పతకం అందించారు. -
వైద్యులేనా!
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన జోత్స్న(3)కు ఫిట్స్ రావడంతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యులు నిరసనలో ఉన్న విషయం తెలియక వారు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యంకోసం తిరిగారు. ఎక్కడా వారికి వైద్యం అందలేదు. చివరికి వారి తల్లిదండ్రులు బాలికను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే బాలిక ప్రాణాలు వదిలింది. నగర సమీపంలోని ముబాకర్ నగర్ వద్ద తారక్ న గర్‌కు చెందిన శ్రీనివాస్(38) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆ స్పత్రిలో వైద్య సహాయం అందకపోవడంతో మంగళ వారం రాత్రి 11.30గంటలకు మృతి చెందాడు. ప్రైవే టు ఆస్పత్రులు మూసి ఉన్నందున శ్రీనివాస్ అనారో గ్యంతో సోమవారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా డు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే శ్రీని వాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రైవేట్ వైద్యులు సేవలను నిలిపివేయడంపై మంగళవారం జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పందించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్‌లతో సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేసి వాటిలో సౌకర్యాలు, ఓపీ, ఐపీ సేవల వివరాలు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సేవల నిలుపుదలపై గంటలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వారు ఆస్పత్రి ైవైద్యులతో కూడిన టాస్క్‌పోర్సును ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అందుకు నిరాకరించారు. తాము కేవలం వైద్యసేవలు మాత్రమే అందిస్తామని, తనిఖీలు చేయబోమంటూ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆరోగ్యశాఖాధికారి, సూపరింటెండెంట్ కలెక్టర్‌కు ఉన్న పరిస్థితిని విరించారు. దీంతో కలెక్టర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులను ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. నేటి నుంచి రిలే దీక్షలు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులకు నిరసనగా వైద్యుల ఆందోళన కొనసాగుతుందని అప్నా అధ్యక్షుడు డాక్టర్ శివరాజ్ తెలిపారు. బుధవారం రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఇటీవల నిజామాబాద్, బోధన్‌లోని ఆస్పత్రులపై దాడి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర సంఘంతో మాట్లాడి తమ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్నారు. కిక్కిరిసిన జిల్లా ఆస్పత్రి ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో నాలుగు రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. స్పెషలిస్టు వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఓపీ కేసులు 350 నమోదు కాగా, మంగళవారం 560 పైగా నమోదయ్యాయి. ప్రభుత్వ వైద్యులపై చర్యలు ప్రైవేట్ వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు సోమవారం చేపట్టిన ధర్నాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహించారు. ప్రభుత్వ వైద్యులు ఈ నిరసనలో ఎందుకు పాల్గొన్నారని, తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ఆస్పత్రి అధికారులను ప్రశ్నించారు.దీంతో ఎంత మంది వైద్యులు నిరసనలో పాల్గొన్నారో వివరాలను అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. వీరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల తరపున నియమించబడిన వైద్యులపై డీఎంఈ వివరణ కోరారు. నిరసనలో పాల్గొన్న వైద్యుల వివరాలు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు. ఆస్పత్రిపై దాడిచేసిన ఆరుగురి అరెస్టు నిజామాబాద్ క్రైం : నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా లో గల బాంబే నర్సింగ్ హోంపై ఈ నెల 22న రాత్రి దాడిచేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ రెండవ ఎస్సై రామనాయుడు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంతోనే వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సుమలత అనే యువతి మృతి చెందినదన్న కోపంతో ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడిచేసినట్లు ఎస్సై తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు నరేంద్ర ఫిర్యాదు మేరకు నిందితులైన రవీందర్, పండరి, సురేశ్, కిషన్, రాజబాబు, శ్రీనివాస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.