Journalism course
-
సామాజిక సేవకు మేము సైతం..
రాయదుర్గం : గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సులకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 13 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వీరిలో ముగ్గురు గౌలిదొడ్డి ఐఐటీ గురుకుల విద్యార్థులే కావడం విశేషం. మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం వచ్చింది. ఇటీవలే జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చాటి అడ్వాన్స్‌కు అర్హత సాధించిన గురుకుల విద్యార్థులు రమేష్‌చంద్ర, ఎ.మదర్ ఇండియా, జి. శశిశ్వేత జర్నలిజం కోర్సుకు ఎంపికయ్యారు. ఇటీవలే నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటి విద్యార్థులు సీట్లు సాధించడం విశేషం. ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సుకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్ వివేకానందను టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.. గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో ఐఐటీ, నీట్ కు శిక్షణ ఇస్తామని, కానీ విద్యార్థులు తమ ఇష్టం తో చదివి జర్నలిజం కోర్సును ఇఫ్లూ యూనివర్సిటీలో చేసేందుకు ఆసక్తి కనబరిస్తే ప్రోత్సహిం చా మని ప్రిన్సిపాల్ వివేకానంద పేర్కొన్నారు. ప్రభు త్వం ద్వారా పూర్తి వ్యయాన్ని భరించి చదివించేందుకు కార్యదర్శి అంగీకరించారన్నారు. గౌలిదొడ్డి ఐఐటీ కళాశాల ద్వారా గత ఏడాది నలుగురు ఐఐటీ సీట్లు, 15 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా 8 మంది విద్యార్థులు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి ఎంపికయ్యారని ఆయన తెలిపారు. -
జర్నలిజం కోర్సుతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్ : జర్నలి జం కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ మేరకు సమాజంలో జరిగే విషయాలపై అవగాహన, భాషపై పట్టు సాధిస్తే భవి ష్యత్‌లో వృత్తిలో రాణించవచ్చని కేయూ దూరవిద్యా కేంద్రం జర్నలిజం విభా గం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. దూరవిద్యా కేంద్రంలోని జర్నలిజం విద్యార్థుల ఫీల్డ్ విజిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా, ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా విద్యార్థులు ఆకాశవాణి వరంగల్ కేంద్రంను సందర్శించగా పనితీరు, రేడియో కేంద్రాల్లో ఉద్యోగావకాశాల వివరాలను ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ చల్లా జైపాల్‌రెడ్డి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సూర్యప్రకాశ్, ప్రోగ్రాం అనౌన్సర్ డాక్టర్ వి.వీరాచారి, గాదె మోహన్ తెలిపారు. జర్నలిజం విభాగం అధ్యాపకులు కె.నర్సిం హారాములు, డి.రామాచారి, సుంకరనేని నర్సయ్య, డి.శ్రీకాంత్, పులి శరత్, వం గాల సుధాకర్, పి.పద్మ పాల్గొన్నారు. -
సంస్థ - ప్రజల మధ్య వారధి.. పీఆర్ఓ
అప్‌కమింగ్ కెరీర్: ఒక సంస్థ మార్కెట్లో నిలదొక్కుకొని, నాలుగు కాలాలపాటు తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రజల్లో దానికి ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపును తెచ్చిపెట్టే ఉద్యోగి ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ). అంటే సంస్థ -ప్రజలకు నడుమ వారధి లాంటి వ్యక్తి.. పీఆర్ఓ. సంస్థ కార్యకలాపాలను, పనితీరును, ఉత్పత్తులను, వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో ప్రజలకు చేరవేసి, సంస్థ మనుగడను కాపాడే నిపుణుడు.. పీఆర్ఓ. ఆధునిక కార్పొరేట్ యుగంలో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. పబ్లిక్ రిలేషన్స్. పీఆర్ఓలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అన్ని కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, ప్రముఖ కంపెనీలు, యాడ్ ఏజెన్సీలు ప్రజా సంబంధాల అధికారులను తప్పనిసరిగా నియమించు కుంటున్నాయి. ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పీఆర్ఓ.. తాను పనిచేస్తున్న సంస్థ గురించి వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థలో జరిగే కార్యక్రమాలు, సదస్సులపై సమాచారాన్ని ప్రెస్నోట్ల రూపంలో ప్రసార మాధ్యమాలకు అందజేయాలి. అవి ప్రజలకు చేరేలా చూడాలి. ప్రెస్మీట్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పీఆర్ఓలకు మీడియాతో మంచి సంబంధాలు ఉండాలి. పీఆర్‌ఓలో కెరీర్లో రాణించాలంటే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కనీసం మూడు భాషల్లో మంచి పట్టు ఉండాలి. సృజనాత్మకత, సహనం, పట్టుదల అవసరం. ప్రాపంచిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి. ఈ రంగంలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా పగలూరాత్రి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ సమయంలోనైనా విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలి. అర్హతలు మనదేశంలో పబ్లిక్ రిలేషన్స్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. కొన్ని సంస్థలు జర్నలిజం కోర్సులో ఒక సబ్జెక్టుగా పబ్లిక్ రిలేషన్స్‌ను బోధిస్తున్నాయి. ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖలో చేరాలంటే డిగ్రీ ఉండడం అవసరం. వేతనాలు కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో పీఆర్ఓలకు మంచి వేతనాలు అందుతున్నాయి. యాడ్ ఏజెన్సీలో చేరితే ప్రారంభంలో నెలకు రూ.8 వేలు అందుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో అయితే ప్రారంభంలో రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీని బట్టి వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. సొంతంగా పీఆర్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే రూ.లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: http://www.braou.ac.in/ ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ వెబ్సైట్: http://dcac.du.ac.in/ కమలా నెహ్రూ కాలేజీ వెబ్సైట్: http://www.knc.edu.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-ఢిల్లీ వెబ్సైట్: http://www.iimc.nic.in/ భారతీయ విద్యా భవన్-ఢిల్లీ వెబ్సైట్: http://www.bvbdelhi.org/ వైఎంసీఏ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.newdelhiymca.in/ కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుబడి ‘‘కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పీఆర్ఓగా మంచి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయగలిగే ఓర్పు పీఆర్ఓలకు ఉండాలి. ప్రస్తుతం విద్యాసంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు కస్టమర్ల అభిరుచులను తెలుసుకునేందుకు సర్వేలను నిర్వహించేందుకు పీఆర్ సంస్థలపైనే ఆధారపడ్డాయి. గ్లోబలైజేషన్ నేపథ్యంతో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. దీనికి జర్నలిజం కోర్సు కూడా పూర్తిచేస్తే అదనపు అర్హత చేకూరినట్లే’’ - ప్రొఫెసర్ బి.బాలస్వామి, జర్నలిజం విభాగ అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం -
జర్నలిజంతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్ : జర్నలిజం కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కాకతీయ యూని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి తెలిపారు. కేయూలో రెగ్యులర్ ఎంసీజే ప్రవేశపెట్టిన తర్వాత మొదటి బ్యాచ్ కోర్సు ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా దూరవిద్యా కేంద్రంలోని సెమినార్‌హాల్‌లో శుక్రవారం విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఫేర్వెల్ సమావేశంలో రామస్వామి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జర్నలిజం విద్యార్థులు గ్రామీ ణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రాజారాం మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలన, ప్రశ్నించేతత్వం అవసరమని తెలిపారు. సమావేశంలో కేయూ జర్నలిజం విభాగం కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్, అధ్యాపకులు ఎ.సంపత్‌కుమార్, భూక్యా దేవేందర్, కె.నర్సింహరాములు పాల్గొన్నారు.