Journalists Association
-
మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇంత నీచానికి దిగజారతారా జర్నలిస్టుల సంఘం ఫైర్
-
సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి
- జర్నలిస్టు యూనియన్ నేతల హెచ్చరిక - సంపూర్ణ మద్దతు ప్రకటించిన పార్టీలు - హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ధర్నా సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించ కుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వంటావార్పు, ధర్నాలు చేయటం... రోడ్డెక్కడం, బజారులోకి రావడం జర్నలిస్టుల అభిమతం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులు కోరుతున్నట్లుగా అందరికి అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌జేయూ), టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ధర్నా, బైఠాయింపు కార్యక్రమాన్ని నిర్వహించింది. సాయంత్రం వరకు జరిగిన జర్నలిస్టుల ఆందోళనలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్, టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ బాబు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్, ప్రధాన కార్యదర్శి వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డీజీ నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, నాయకురాలు పద్మ, రైతు జేఏసీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో పలు సందర్భాల్లో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు పర్చాలని విజ్ఞప్తి చేశారు. కొంత మంది జర్నలిస్టు నాయకులు ఎర్ర బుగ్గ కార్లు, పదవుల ఎరకు, కవర్లకు లాలూచి పడి తోటి జర్నలిస్టులను మోసం చేయవద్దని పేర్కొన్నారు. రెండేళ్లయినా అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వకపోవటంతో పాటు తెలంగాణ వస్తే ఇళ్లు వస్తాయని ఆశించిన జర్నలిస్టులకు నిరాశ ఎదురుకావటంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళనలు చేయాల్సి వచ్చిందని ఐజేయూ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. పోలీసులతో తన్నులు పడైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుంటామని సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మెసేజ్ ద్వారా, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఫోన్ ద్వారా జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గోపిరెడ్డి సంపత్‌కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి నరేందర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలి, చంద్రశేఖర్ మాట్లాడారు. కాగా జర్నలిస్టుల సమస్యలపై అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడే వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలిపారు. -
తెలంగాణలో జర్నలిస్టుల సంఘం ఒక్కటే..
టీయూడబ్ల్యూజే మినహా మరొకటి రిజిస్టర్ కాలేదు జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హన్మకొండ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే)’ మాత్రమే ఉందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఇది తప్ప మరే సంఘం రిజిష్టర్ కాలేదని ఆయన పేర్కొన్నారు. హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథ మ మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభలో నారాయణ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజేది, ఆ యూనియన్ నాయకులది గతించిన కాలమన్నారు. జర్నలి స్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అలాగే, జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు అందించేలా చూస్తామని, ప్రభుత్వం ఇవ్వకపోతే పోరాడైనా సాధించుకుంటామని తెలిపారు. కాగా, ఎంఎస్ఓలు నిలుపుదల చేసిన రెండు చానళ్ల పునః ప్రసారానికి ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ఆయన కోరారు. ముల్లు కర్రలా పని చేయాలి జర్నలిజం, జర్నలిస్టులు ముల్లు కర్రలా పని చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య సూచించా రు. ప్రజాప్రతినిధులు, అధికారులను మే ల్కొలిపేలా కథనాలు రాయాలని, వ్యక్తిగత విమర్శలకు తావివ్వొద్దని కోరారు. ఉద్యమానికి అండదండ తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అం డదందండలు అందించారని స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి కొనియాడా రు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు రాష్ర్ట అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఎం పీలు అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణకు టీడీపీ పక్కలో బల్లెంలా తయారైందని దుయ్యబట్టారు. మరో ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడు తూ గ్రామీణ విలేకరులకు కనీస వేతనం అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, అరూరి రమేష్ మాట్లాడుతూ తమ ని యోజకవర్గంలోని విలేకరులకు ఇళ్ల స్థలా లు అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 26 తీర్మానాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ మహాసభలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్‌తో పాటు రమణ, పల్లె రవి, రమేష్, పి.శ్రీశైలం, శైలేష్‌రెడ్డి, ఇస్మాయిల్, కొండల్రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, లెనిన్, శంకర్రావు, పెరుమాండ్ల వెం కటేశ్వర్లు, బి.శ్రీనివాస్, జయప్రకాష్ నారాయణ్, యోగి, అనిల్‌కుమార్, సాయిప్రదీప్, శ్యాం, రాఘవేందర్ పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా నవాబ్ ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.