- టీయూడబ్ల్యూజే మినహా మరొకటి రిజిస్టర్ కాలేదు
- జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హన్మకొండ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే)’ మాత్రమే ఉందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఇది తప్ప మరే సంఘం రిజిష్టర్ కాలేదని ఆయన పేర్కొన్నారు. హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథ మ మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభలో నారాయణ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజేది, ఆ యూనియన్ నాయకులది గతించిన కాలమన్నారు.
జర్నలి స్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అలాగే, జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు అందించేలా చూస్తామని, ప్రభుత్వం ఇవ్వకపోతే పోరాడైనా సాధించుకుంటామని తెలిపారు. కాగా, ఎంఎస్‌ఓలు నిలుపుదల చేసిన రెండు చానళ్ల పునః ప్రసారానికి ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని ఆయన కోరారు.
ముల్లు కర్రలా పని చేయాలి
జర్నలిజం, జర్నలిస్టులు ముల్లు కర్రలా పని చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య సూచించా రు. ప్రజాప్రతినిధులు, అధికారులను మే ల్కొలిపేలా కథనాలు రాయాలని, వ్యక్తిగత విమర్శలకు తావివ్వొద్దని కోరారు.
ఉద్యమానికి అండదండ
తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు అం డదందండలు అందించారని స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి కొనియాడా రు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు రాష్ర్ట అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఎం పీలు అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణకు టీడీపీ పక్కలో బల్లెంలా తయారైందని దుయ్యబట్టారు. మరో ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడు తూ గ్రామీణ విలేకరులకు కనీస వేతనం అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, అరూరి రమేష్ మాట్లాడుతూ తమ ని యోజకవర్గంలోని విలేకరులకు ఇళ్ల స్థలా లు అందజేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా 26 తీర్మానాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ మహాసభలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్‌తో పాటు రమణ, పల్లె రవి, రమేష్, పి.శ్రీశైలం, శైలేష్‌రెడ్డి, ఇస్మాయిల్, కొండల్‌రావు, దొంతు రమేష్, నూర శ్రీనివాస్, లెనిన్, శంకర్‌రావు, పెరుమాండ్ల వెం కటేశ్వర్లు, బి.శ్రీనివాస్, జయప్రకాష్ నారాయణ్, యోగి, అనిల్‌కుమార్, సాయిప్రదీప్, శ్యాం, రాఘవేందర్ పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా నవాబ్ ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.