Judge positions
-
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు: కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : బీసీలకు న్యాయమూర్తి పదవులు రాకుండా అడ్డుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీసీల పట్ల చంద్రబాబు అనురిస్తున్న వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. బీసీలకు న్యాయమూర్తి పదవులు రాకుండా తప్పుడు నివేదికలు పంపిన చంద్రబాబు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. వారిని చంద్రబాబు ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్సార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. నిరసన కార్యక్రమంలో జీ గంగాధర్, సుంకర పద్మశ్రీతోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలే రాలేదు
జడ్జిల నియామకాలపై కేంద్రం న్యూఢిల్లీ: హైకోర్టుల్లో పెరుగుతూ పోతున్న జడ్జి ఖాళీల సంఖ్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) విమర్శలు చేయడంతో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జడ్జిల నియామకాలపై గణాంకాలను ఉటంకించి నిర్లక్ష్యం సుప్రీం కోర్టు కొలీజియందే అని చెప్పేందుకు ప్రయత్నించింది. సుప్రీంలో ప్రస్తుతం ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిలో ఒకటి ఖాళీ అయి ఏడాది అయినా, నియామకానికి కొలీజియం నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని ఒక ప్రభుత్వాధికారి చెప్పారు. 24 హైకోర్టుల్లో కలిపి 430 జడ్జి స్థానాలు ఖాళీగా ఉండగా 279 పోస్టులకు ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. 2015-16 మధ్య హైకోర్టుల్లో నియామకాల కోసం 370 ప్రతిపాదనలు రాగా వాటిని తనిఖీ చేసి 328 ప్రతిపాదనలను ప్రభుత్వం కొలీజియానికి పంపిందని, కొలీజియం 290 పేర్లను ప్రాసెస్ చేసి వాటిలో 99 పేర్లను తిరస్కరించిందని తెలిపారు. 1990ల నుంచి హైకోర్టుల్లో నియమించిన జడ్జిల సంఖ్య సగటున ఏడాదికి 80 కాగా, ఈ ఏడాది ఇప్పటికే తాము 120 మంది జడ్జిలను నియమించామని అధికారి పేర్కొన్నారు.