Julian
-
Russia-Ukraine War: రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్ ‘నో’
కీవ్: తమ భూభాగంపై దురాక్రమణకు దిగిన రష్యాపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్ శతాబ్దకాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికీ తిలోదకాలు ఇచి్చంది. వందేళ్లకుపైగా ఉక్రెయిన్ జనవరి ఏడో తేదీనే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్.. రష్యాతోపాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్ క్యాలెండర్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఈఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ‘ ఉక్రేనియన్లు సొంత సంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించనున్నారు’ అని ఈ సందర్భంగా జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో క్రైస్తవ జనాభానే అధికం. ఉక్రెయిన్‌లో దశాబ్దాలుగా రష్యన్ ప్రాచీన చర్చి సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం. -
విహంగ విలాసం
ఫేమస్ టూన్ చెట్టు మీద తీరిగ్గా కూర్చున్న పక్షులను చూసినప్పుడు, అవి అందంగా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు సినారె రాసిన కవిత ఒకటి హృదయాన్ని తాకుతుంది ఇలా... ‘పక్షులు తన గూళ్లలో ఎప్పుడు ఒదిగివుంటాయో గోడల మీద ఎప్పుడు కొలువు తీరుతుంటాయో కొమ్మల మీద ఎప్పుడు విశ్రమిస్తుంటాయో గగనం పిలుపందితే ఎప్పుడు తటాలున ఎగిరిపోతుంటాయో అంతుపట్టదు!’ రుమేనియన్ కార్టూనిస్ట్ జూలియన్ పెనా పాయ్ కార్టూన్‌లోని పక్షిని చూస్తే మాత్రం... కారణం సులభంగా అంతుపడుతుంది. ఎవరూ లేని ఒంటరి దీవిలో తనకు గింజలు పెట్టి పెద్ద చేసిన యజమాని రుణం తీర్చుకోవాలనుకుంది... అందుకే ఆ యజమానిని అమాంతం దీవి నుంచి తీసుకెళ్లింది. మనం పక్షులకు మేలు చేస్తే అవి మనకు మేలు చేస్తాయనే భావాన్ని చెప్పే కార్టూన్ ఇది. ఈ కార్టూన్ గీసిన జూలియన్‌కు కార్టూన్లు గీయడంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అంతర్జాతీయంగా తొంబైకి పైగా బహుమతులు గెలుచుకున్నారు. అంతర్జాతీయ కార్టూన్ పోటీ జ్యూరీలకు ఒక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ‘కార్టూన్ ఐడియాల పరిణామ క్రమం’ మీద జూలియన్ సాధికారికంగా మాట్లాడగలరు. ‘ఒక మంచి కార్టూన్ రూపొందడా నికి ఏవి దోహదం చేస్తాయి?’ అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇది... ‘ఒక మంచి కార్టూన్ రూపొంద డానికి కాన్సెప్ట్ లేదా ఐడియా అనేది ప్రాథమికం. ఐడియా అనేది కార్టూనిస్ట్ మేధో ఉత్పాదన’ ఐడియాలో దమ్ముంటే చాలు.... ఒక మంచి కార్టూన్ రూపుదిద్దుకోవ డానికి అనే ఆయన మాటను అరువుగా తీసుకొని ఆయన గీసిన ఈ కార్టూన్‌ను బహుమంచి కార్టూన్ అనవచ్చు! -
‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు!
అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లాండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, ఇండో కెనెడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు.కెనడాలో గురువారం నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ సుందరి(49) తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్.. రూ. 48 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం ఆమె ముద్దును ఇలా వేలం వేశారు.