11న తెలంగాణ స్పీకర్ ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి టీ హరీష్ రావు ఈ విషయాలను వెల్లడించారు. సొమవారం ఉదయం 9:30 గంటలకు ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అనంతరం 11 నుంచి జానారెడ్డి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని హరీష్ రావు తెలిపారు.
ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఎన్నుకుంటారు. అదే రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటుందని హరీష్ రావు తెలిపారు. శాసనమండలి చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వ్యవహరించనున్నారు.