jupally krishanrao
-
ఏఐసీసీ కార్యాలయంలో పొంగులేటి, జూపల్లి..!
-
ఆశలు చిగురించేనా..
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆశలు చిగురించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు మంత్రి వర్గాన్ని విస్తరించిన సీఎం కేసీఆర్ నేడు మళ్లీ మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి అనుమతి తీసుకున్నారు. ఇదీలా ఉంటే ఎంత మందితో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు? కొత్తగా ఎవరెవరికీ అవకాశం కల్పించనున్నారు?అనేదానిపై అధినేత స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆదివారం జరగనున్న మంత్రి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తొలుత అతి స్వల్ప కాలం వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ ఆ పదవి నుంచి తప్పించి వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. స్వతహాగా వైద్యుడిగా ఉన్న లక్ష్మారెడ్డి సుమారు నాలుగున్నరేళ్ల పాటు వైద్యారోగ్యశాఖకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత లక్ష్మారెడ్డికి మళ్లీ పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆయనకు మంత్రి పదవి చేజారింది. నెలరోజుల క్రితం మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. అందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపించింది. తర్వాత మంత్రివర్గ విస్తరణకు కాస్త ఆలస్యమైంది. చివరకు శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హరీశ్‌రావు, కేటీఆర్, ఓ మహిళ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు బెర్త్ ఖరారైందనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అయితే శనివారం రాత్రి వరకు మంత్రుల జాబితా ప్రకటించకపోవడంతో లక్ష్మారెడ్డికి మంత్రిపదవి దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇదీలా ఉంటే సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించనున్న పది రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకూ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. తనతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జూపల్లికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రెండు విప్ పదవులు మరోవైపు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిని శాసనమండలి విప్‌గా శనివారం ప్రకటించారు. అలాగే అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ప్రభుత్వ విప్‌గా నియమించారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. -
‘నేను పార్టీ మారడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. కావాలనే కొందరు తనపై కుట్రపన్ని పార్టీ మారతారంటూ దష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కొల్లాపూర్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన జూపల్లి.. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. -
ఐకియాలో మహిళలకు 350 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, సంస్థల స్థాపనకు దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం తెలంగాణ అని, ఇక్కడ సమర్థవంతమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐకియా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో తమ రిటైల్ స్టోర్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించనుంది. ఇందులో పనిచేసేందుకు తెలంగాణలోని 350 మంది మహిళలకు అవకాశం కల్పిస్తుంది. వీరికి న్యాక్‌లో 45 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం(ఎంవోయూ)పై నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్(న్యాక్), ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం), ట్రస్ట్ ఫర్ రిటైలర్స్ అండ్ రిటైల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా(ట్రైన్), యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) ప్రతినిధులు సంతకాలు చేశారు. -
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి
కొల్లాపూర్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చే సేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జూపల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సీఎం కేటాయించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కే సీఆర్‌కు కృత జ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. -
తైవాన్ విధానాలు అనుసరణీయం
♦ ఐటీసీఎఫ్ సమావేశంలో పరిశ్రమల మంత్రి జూపల్లి ♦ తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్‌తో ఐటీ ఒప్పందం హైదరాబాద్: తైవాన్‌లో పారిశ్రామికీకరణ, సంక్షేమ పథకాలు, అత్యున్నత మౌలిక వసతులతో కూడిన నగరాల నిర్మాణం మొదలైనవి రాష్ట్రానికి అనుసరణీయమని వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణతో పోలిస్తే మూడింట రెండో వంతు విస్తీర్ణంలో ఉన్న తైవాన్ భారత స్థూల జాతీయోత్పతిలో సగం మేర సాధించడం అద్భుతమని కొనియాడారు. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తైవాన్‌తో దృఢ బంధాన్ని ఏర్పరుచుకుంటుందని చెప్పారు. తైవాన్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం రాష్ట్రంలో తైవాన్ డెస్క్ ఏర్పాటు చేయడంతోపాటు మాండరిన్ భాషలో దరఖాస్తులను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ఐటీశాఖ సహకారంతో ఇండియా-తైపీ అసోసియేషన్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా తైవాన్ కోఆపరేషన్ ఫోరం (ఐటీ సీఎఫ్) సమావేశానికి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూపల్లి సమక్షంలో తెలంగాణ ఐటీ శాఖ, తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్ పరస్పర సహకార ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. చైనా, తూర్పు ఆసియా దేశాల్లో తైవాన్‌కు చెందిన కంపెనీలు నెలకొన్నాయని, వాటికి ప్రత్యామ్నాయ వేదికగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నట్లు జూపల్లి వెల్లడించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు భారత్ గమ్యస్థానంగా మారుతోందని, 2050 నాటికి అత్యధిక మానవవనరులున్న దేశంగా వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా నిర్ణీత వ్యవధిలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. నాలుగు వేలకుపైగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల సభ్యత్వం ఉన్న తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని జూపల్లి స్వాగతించారు. పెట్టుబడులకు రాష్ట్రం అత్యంత అనువైనదని, అత్యున్నత సౌకర్యాలు కలిగిన హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తైపీ కంప్యూటర్స్ అసోసియేషన్ డైరక్టర్ జనరల్ డాక్టర్ డెన్నిస్ హూ పేర్కొన్నారు. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో నెలకొనడం నగర ప్రతిష్టను ఇనుమడింప చేసిందన్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ‘టీ హబ్’తో పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సమావేశంలో తైపీ భారత విభాగ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జాన్లీ, అమెజాన్ పబ్లిక్ పాలసీ సీనియర్ మేనేజర్ మోహిత్ బన్సల్, అడ్వాన్‌టెక్ సేల్స్ మేనేజర్ డారీన్ చెన్ తదితరులు పాల్గొన్నారు.