Justice Chandraiah
-
నిమ్స్‌లో వైద్య సేవలపై ఆరా
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్యసేవలపై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య ఆరా తీశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించారు. ఆయా రోగుల సహయకులను సైతం విచారించి ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా కలిశారు. అనంతరం నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ కె. మనోహర్‌తో సమావేశమై ఆస్పత్రికి సంబంధించి పరిపాలనా వ్యవహారాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
ఏప్రిల్ 10,11 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం
ఉగాది సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21ను ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు, 21 దేశాలలోని 21 సంస్థల అధ్యక్షులు పాల్గొంటారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్ చైర్మన్), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 21 గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకకు పద్మభూషణ్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఈనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సబ్ఎడిటర్ విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, మనతెలంగాణ ఎడిటోరియల్ అడ్వైజర్ గార శ్రీరామ మూర్తి హాజరవుతారు. -
జస్టిస్ చంద్రయ్యకు ‘నెల్సన్ మండేలా అవార్డ్’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య ప్రతిష్టాత్మక ‘నెల్సన్ మండేలా అవార్డ్’అందుకున్నారు. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఢిల్లీ నేషనల్ కో–ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ అవార్డును ఆయనకు అందించారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ చంద్రయ్య చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్‌సీయూఐ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. -
హక్కులంటే వ్యక్తిగత తగాదాలు కాదు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులే మానవ హక్కులని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోనే ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులను పొందుపర్చారని ఆయన చెప్పారు. చాలామందికి మానవ హక్కులంటే ఏమిటో అవగాహన తక్కువగా ఉందని, వ్యక్తిగత తగాదాలు, అధికారులు పనులు చేయకపోవడం, ఇతరత్రా సమస్యలతో కమిషన్‌కు పలువురు అర్జీలతో రావడం సబబుకాదని చెప్పారు. మానవ హక్కులపై అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణమూర్తి అధ్యక్షతన శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన తాను గ్రామపెద్దకు భయపడేవాడినని, అయితే తాను పదోతరగతి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ గ్రామపెద్ద వచ్చి భుజం తట్టి తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవాలని జస్టిస్ చంద్రయ్య హితవు చెప్పారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త 2 పదవులూ బీసీలకు ఇవ్వడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేసేలా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కుల ఉల్లంఘనల కేసుల్లో కమిషన్ సత్వర న్యాయం అందించాలని తెలంగాణ జనస మితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. మానవహక్కుల రక్షణకు కమిషన్ సుమో టోగా కేసుల్ని స్వీకరించి న్యాయం చేయాలని సభాధ్యక్షు డు సత్యనారాయణమూర్తి కోరారు. హక్కుల రక్ష ణకు కృషి చేస్తానని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నాన్ జ్యుడీషియల్ మెంబర్ మహ్మద్ ఇర్ఫాన్ మెయినుద్దీన్ చెప్పారు. అనంతరం జస్టిస్ చంద్రయ్యను కృష్ణయ్య, కోదండరాం సన్మానించారు. -
అసిఫాబాద్‌లో కోర్టు భవనాలు ప్రారంభం
అసిఫాబాద్: ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలో కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, హైకోర్టు పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ సీతారామమూర్తి శనివారం ఉదయం ప్రారంభించారు. రూ.89 లక్షలతో కోర్టు భవనాలను ఇక్కడ నిర్మించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. శివాలయంలో హైకోర్టు జడ్జి పూజలు ఆదిలాబాద్ జిల్లా రెబ్బిన మండలం నంబాల గ్రామంలో ఉన్న శివాలయంలో హైకోర్టు జడ్జి చంద్రయ్య శనివారం ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ పూజారి, గ్రామ పెద్దలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు. -
లోక్‌అదాలత్‌లో 13 వేల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,672 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ శనివారం తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భాను, జస్టిస్ చంద్రయ్యల నేతృత్వంలో ఈ అదాలత్ నిర్వహించామన్నారు. -
ఆరోగ్యశ్రీ అభివృద్ధి సూచిక: జస్టిస్ చంద్రయ్య
ఉస్మానియా ఆస్పత్రిలో ‘భోజనామృత’ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు సైతం పట్టణాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడంలో ఆరోగ్యశ్రీ ప్రధాన పాత్ర పోషించిందని, ఒక విధంగా ఇది అభివృద్ధికి సూచిక అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఇలాంటి పథకాలవల్ల వైద్యసేవల్లో అసమానతలు తొలగిపోతాయన్నారు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రకర్ (మెయిల్) సంస్థ ఇక్కడి ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత ‘భోజనామృత’ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ముఖ్యమైనవని, ఈ రెండూ ఉస్మానియాలో లభిస్తుండటం సంతోషకరమన్నారు. మందులు, ఆహారం లేకుండా ఎవరూ మరణించకూడదన్నారు. కార్యక్రమంలో మెయిల్ సంస్థ చైర్మన్ పీపీ రెడ్డి, హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.